చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వరద బాధితులకు రూ.601 కోట్లు చెల్లించాం

ఆరోపణలపై బహిరంగ చర్చకైనా సిద్ధమని వెల్లడి

by చైతన్యరధం
Oct 10, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వరద బాధితులకు రూ.601 కోట్లు చెల్లించాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నీలిమీడియా తప్పుడు కథనాలతో దుష్ప్రచారం సరికాదు
  • ప్రభుత్వంపై బురద రాజకీయాలు చేస్తే సహించేది లేదు
  • మంత్రులు వంగలపూడి అనిత, అనగాని, నారాయణ
  • ఆరోపణలపై బహిరంగ చర్చకైనా సిద్ధమని వెల్లడి

అమరావతి(చైతన్యరథం): వరద సాయంపై నీలిమీడియాలో అసత్య కథనాలు, వైసీపీ నేతల దుష్ప్రచారంపై రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో సభ్యులైన హోం, విపత్తుల నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై బురద జల్లుడు రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముందుగా మంత్రి అనగాని మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ మధ్య సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన దాదాపు 4.06 లక్షల మంది బాధితులకు నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. సుమారుగా రూ.602 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉందని అంచనా వేయగా అందులో రూ.601 కోట్లను ఇప్పటికే చెల్లించడం జరిగిందని, మిగిలిన సొమ్మును కూడా ఆధార్‌ సీడిరగ్‌ తదుపరి తక్షణమే చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

చంద్రబాబు నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి కేవలం 115 రోజులే అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు ప్రతిరోజూ ఏదో మంచి చేయాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది ఒక టీమ్‌లాగా అహర్నిశలూ కృషిచేయడం జరుగుతుందన్నారు. 10 రోజుల్లోనే విజయవాడలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చి పారద ర్శకంగా, నిష్పక్షపాతంగా వరద నష్టపరిహారం కూడా చెల్లించామన్నారు. గత ప్రభుత్వంలో వరద సాయంగా రూ.2-4 వేలు ఇస్తే ఇప్పుడు దానిని రూ.25 వేలకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్క పిలుపుతో పలువురు దాతలు ముందుకొచ్చి దాదాపు రూ.400 కోట్ల విరాళంగా ఇచ్చారంటే అది చంద్రబాబుపై ప్రజల కున్న నమ్మకమన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అందులో ఇప్పటికే దాదాపు రూ.252 కోట్లు సొమ్ము డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. అయితే ఈ విషయంలో జగన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తూ రోత పత్రికలో తప్పుడు కథనాలను రాయిస్తున్నారని మండిపడ్డారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, జనరేటర్లు, విద్యుత్‌ తదితర వాటిపై చేసిన ఖర్చుపై దుష్ప్రచారం చేస్తున్నారు..వాటికి చేసిన ఖర్చు రూ.23 లక్షలని మంత్రి స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితుల సహాయార్థం మొత్తం చేసిన ఖర్చు రూ.139.44 కోట్లు అని వెల్లడిరచారు. జగన్‌రెడ్డి వరద విరాళంగా ప్రకటించిన రూ.కోటి ఇవ్వలేదని, మరి ఆ రూ.కోటిని ఏ విధంగా ఖర్చు చేశారో, ఎవరికిచ్చారో కూడా తెలియదన్నారు.

రూ.601 కోట్లు ఖర్చు చేస్తే.. రూ.534 కోట్లు దుర్వినియోగమా?
మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన బాధితులకు రూ.601 కోట్లు ఖర్చు చేస్తే అందులో రూ.534 కోట్లు దుర్వినియోగం జరి గిందని జగన్‌రెడ్డి విమర్శిస్తూ తన పత్రికలో కథనాలు రాయించడం విడ్డూరంగా ఉందన్నా రు. వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోనే మొత్తం రూ.139.44 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అందులో తాత్కాలిక వసతి కోసం రూ.8.42 కోట్లు, ఆహారానికి రూ.92.51 కోట్లు, తాగునీటికి రూ.11.22 కోట్లు, మెడికల్‌ కేర్‌కు రూ.4.55 కోట్లు, శానిటేషన్‌/పునరావాస కేంద్రాలకు రూ.20.56 కోట్లు, మిగిలినవి ఇతర అవసరా లకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రోజుకు 12 లక్షల ఫుడ్‌ ప్యాకెట్లను, 30 లక్షల వాట ర్‌ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

పారిశుధ్య పనుల కోసం దాదాపు ఏడు వేల మందిని బయటి నుంచి తెప్పించడమే కాకుండా మరో మూడు వేల మంది మున్సిపల్‌ సిబందిని కలుపుకుని మొత్తం 10 వేల మందితో రేయింబవళ్లు పారిశుధ్య పనులు చేయబట్టే ఎటువంటి అంటు వ్యాధులు రాలేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫైర్‌ ఇంజన్లను విజయవాడకు తెప్పించి ఇళ్లలో కూడా క్లీన్‌ చేయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశించిన వెంటనే 3.83 లక్షల కుటుంబాలకు రూ.572 కోట్లు వెంటనే వారి ఖాతాల్లో జమచేయడం జరిగిందని, ఇప్పుడు ఆధార్‌ ఫీడిరగ్‌ అయిన తదుపరి మొత్తం 4.06 లక్షల మందికి రూ.600 కోట్లు జమచేయడం జరిగిందన్నారు. మరో 8 వేల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, వాటి థర్డ్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని, ఆ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే వారికి కూడా చెల్లింపు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంత చేస్తే జగన్‌రెడ్డి విమర్శించడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు.

ఆదుకోవాల్సింది పోయి విమర్శలు సిగ్గుచేటు
హోం, విపత్తుల నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ రాని విపత్తు వరద రూపంలో విజయవాడలో వచ్చిందన్నారు. 10 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ మార్గనిర్దేశనం చేస్తూ సాధారణ పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. రోడ్లు, ఇళ్లల్లో పేరుకున్న బురదను ఫైరింజన్‌ల ద్వారా శుభ్రం చేయించారని తెలిపారు. ఈ విషయంలో ఫైర్‌ సేఫ్టీ, మున్సిపల్‌ సిబ్బందికి సెల్యూట్‌ చేస్తున్నామన్నారు. వరదసాయంగా మొత్తం ఖర్చు అయింది రూ.601 కోట్లు అయితే రూ.300 – రూ.400 కోట్ల అవినీతి జరిగిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. ఆహారానికి రూ.92.5 కోట్లు, తాగునీటికి రూ.11.2 కోట్లు, మెడికల్‌ కేర్‌కు రూ.4.55 కోట్లు, పారిశుధ్యానికి రూ.20.56 కోట్లు ఖర్చయింద న్నారు. మొత్తంగా ఎన్టీఆర్‌ జిల్లాల్లో రూ.139.44 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.

వరదలతో తీవ్రంగా నష్టపోతే ఆదుకోవాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదని.. అవసరమైతే ఆరోపణలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జీవోను సైతం సవరించి నష్టపరిహారం పెంచి అందించారని, బ్యాంకు ఖాతాల సమస్యలను కూడా ప్రభుత్వమే పరి ష్కరించిందన్నారు. వరద విరాళాలపై కూడా ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిప డ్డారు. దాతలు తమ విరాళాలను చెక్కులు, డీడీల రూపంలో అందించారని వీటికి అన్ని లెక్కలు ఉంటాయని స్పష్టం చేశారు. ఏకంగా 20 కిలోమీటర్లు జేసీబీ మీద ప్రయాణించి సీఎం వాస్తవ పరిస్థితులను అంచనా వేశారని, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా చంద్ర బాబు ఎప్పటికప్పుడు మంత్రులకు, అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆరోపణలు చేసేవారు అవసరమైతే ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.పి.సిసోడియా, ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ డైరెక్టర్‌ ఆర్‌.కూర్మనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

స్వర్ణాంధ్ర సాధనకు కలిసి రావాలి

Next Post

అత్యంత పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026

కార్యకర్త
@ May 12, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ముఖ్య వార్తలు

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ముఖ్య వార్తలు

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి
ఆంధ్రప్రదేశ్

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026

కార్యకర్త
@ May 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026

svrayudu
@ May 11, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist