• అభిప్రాయం
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జెండాలు వేరైనా..అజెండా ఒక్కటే!

అరాచకం కావాలా... అభివృద్ధి కావాలా... ప్రజలు ఆలోచించాలి

చైతన్యరధం by చైతన్యరధం
March 18, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
0
జెండాలు వేరైనా..అజెండా ఒక్కటే!
0
SHARES
213
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు
  • జగన్‌కు ఓటు వెయ్యవద్దని కుటుంబసభ్యులే విజ్ఞప్తి చేస్తున్నారు
  • మోదీ మద్దతుతో రాష్ట్రాన్ని నిలబెడతాం… ప్రజలను గెలిపిస్తాం
  • అరాచకం కావాలా… అభివృద్ధి కావాలా… ప్రజలు ఆలోచించాలి

అమరావతి(చైతన్యరథం): ఎన్డీఏ కూటమి పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని.. అది సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా, చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రగతి వాది అని కొనియాడారు. మోదీకి 5 కోట్ల తెలుగు ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామన్నారు. ఈ ప్రజాగళం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ. మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితం అయింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేసే సభ ఇది. ఐదేళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. అందుకే ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించడానికి మూడు పార్టీలు కలిశాయి.

మీ తీర్పుపైనే రాష్ట్ర భవిష్యత్‌
రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పే రాష్ట్ర భవిష్యత్తుకు నిర్ణయిస్తుంది. మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ మద్దతు, ఆశీస్సులు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. మూడు పార్టీల జెండాలు వేరు కావచ్చు..మా అజెండా ఒక్కటే. అదే సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ. ప్రజల కోసం తపించే పవన్‌ కు అభినందనలు తెలుపుతున్నా. మోదీ ఒక వ్యక్తి కాదు..భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. మోదీ అంటే సంక్షేమం…మోదీ అంటే అభివృద్ధి. మోదీ అంటే సంస్కరణలు, భవిష్యత్తు. మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అని చంద్రబాబు అన్నారు.

ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ
ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్రమోదీ. ప్రధాన మంత్రి అన్నా యోజన, ఆవాస్‌ యోజన, ఉజ్వల యోజన, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, పీఎం ఆయుష్మాన్‌ భారత్‌, జల్‌ జీవన్‌ లాంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. సంక్షేమ పథకాలతో పాటు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, గతిశక్తి, భారత్‌ మాల కార్యక్రమాలతో నరేంద్ర మోదీ ఎంతో అభివృద్ధి చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ. మోదీ నినాదం సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌ నినాదంతో దేశానికి నమ్మకాన్ని కలిగించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్రమోదీ అని చంద్రబాబు కొనియాడారు.

అవకాశాలను అందిపుచ్చుకుందాం
కోవిడ్‌ సమయంలో ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా నాడు వ్యవహరించి మన ప్రాణాలు రక్షించారు. వంద దేశాలకు వ్యాక్సిన్‌ ఇచ్చి దేశ సమర్థతను చాటిచెప్పారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తెచ్చారు. 5వ స్థానం నుండి రాబోయే రోజుల్లో 3వ స్థానంలోకి వస్తాం. అమెరికా, చైనా కంటే ధీటైన ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చే శక్తి, సామర్థ్యం మోదీకి ఉన్నాయి. వికసిత్‌ భారత్‌ నరేంద్ర మోదీ కల…వికసిత్‌ ఏపీ మన అందరి కల కావాలి. వికసిత భారత్‌ దిశగా దేశం దూసుకుపోతోంది. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఏపీ కూడా అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

పేదరికం లేకుండా చేయడమే మన సంకల్పం
పేదరికం లేని దేశం మోదీ సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం. మనమంతా ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలి. మోదీ జీ కా సందేష్‌ హై కి ’’వికసిత్‌ భారత్‌ కేలియే…యహీ సమయ్‌ హై..సహీ సమయ్‌ హై’’. మై కెహనా చాప్‌ా తా హూం కి ‘‘దేశ్‌ కో సహీ సమయ్‌ మే మోదీజీ జైసా సహీ నేతా మిలాహై…ఆప్‌ కి పూరీ కోషిషోం మే.. హమ్‌ ఆప్‌ కే సాత్‌ రహేంగే. ఏ హమారా వాదా హై’’. నేను ఒకటే చెప్తున్నా…భారత దేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్రమోదీ. వికసిత భారత్‌ ద్వారా ప్రపంచంలో నెంబర్‌ వన్‌ దేశంగా చేసే శక్తి, సామర్థ్యం ఒక్క మోదీకే ఉంది. భారతీయులు మొత్తం ప్రపంచంలో శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం. అది ఇప్పటికే జరుగుతోంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని పేదరికం లేని దేశంగా చేసే శక్తి ఉంది. దేశం దూసుకుపోతుందని చంద్రబాబు అన్నారు.

భ్రష్టుపట్టించిన జగన్‌రెడ్డి
రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. 2014లో విభజన తర్వాత సవాళ్లు, సమస్యలను అధిగమించాం. ఎన్డీఏ భాగస్వామిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాం. నాడు 11 జాతీయ విద్యాసంస్థలు కేంద్ర సాహకారం తో తెచ్చాం. మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మణం చేపట్టాం… అదే పూర్తైతే దేశంలో మంచి నగరంగా అమరావతి తయారయ్యేది. 3 ముక్కలతో అమరావతిని నాశనంచేసి భ్రష్టుపట్టించాడు జగన్మోహన్‌రెడ్డి. కేంద్ర సాకారంతో పోలవరం 72 శాతం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం గోదావరిలో కలిపిం ది. ఇలా అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వన రులు దోచేశారు. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, అన్నింటిలో వేల కోట్లు దోచుకున్నారు. జె.బ్రాండ్‌ లిక్కర్‌ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు జగన్‌.

ఓటేసిన ప్రజలను పన్నుల భారంతో కాటేశాడు. పెట్టుబడులు తరిమేశాడు. ఐదేళ్లుగా రోడ్లు, ప్రాజెక్టుల, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి అన్న మాటే లేదు. ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు. అంతా గంజాయి, అంశాంతి, అభద్రత, ఆందోళనతో బంగా రం లాంటి రాష్ట్రాన్ని జగన్‌ చీకటి చేశారు. విధ్వంసం మే తన విధానంతో రాష్ట్రాన్ని కూల్చేశాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్‌ అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశాడు. కక్ష సాధింపుతో ప్రశ్నించేవారిని, మీడియా వారిని అణచివేసేందుకు పోలీసులను జేబు సంస్థగా మార్చుకున్నారు. చివరికి జగన్‌ అధికార దాహానికి, వంచనకు బాబాయ్‌ బలయ్యారు. ఇద్దరు చెల్లెల్లు రోడ్లెక్కి వైసీపీ పునాదులు రక్తంలో తడిచిపోయాయని ఘోషిస్తునంనారు. జగన్‌ కు ఓటేయొద్దని వారే చెప్తున్నారు 5 కోట్ల ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

చెత్త పాలనతో ఇబ్బందులు
రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా…రైతులు బాగున్నారా… యువతకు ఉద్యోగాలు వచ్చాయా.? మహిళలకు భద్రత ఉందా.? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేలు జరిగిందా? అందరూ నఫ్టపోయారు. మోదీకి విన్నవిస్తున్నా…ఏపీ చెత్తపాలనతో ఇబ్బంది పడుతోంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇవి తెలిస్తే మీకు షాక్‌ అవుతారు…అప్పుల కోసం కలెక్టర్‌ కార్యాలయాలు, రైతు బజార్లు, ప్రభుత్వ కాలేజీ స్థలాలు తాకట్టు పెట్టారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

రాష్ట్రాన్ని నిలబెట్టేందుకే పొత్తు
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరంతా సిద్దమా? ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలి..మనబిడ్డలు జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది..ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకు 400కుపైగా సీట్లు వస్తాయి. ఏపీలో 25 ఎంపీ సీట్లును గెలిపించాల్సిన బాధ్య మీదే. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. మోదీ నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తే..ఎన్డీఏ పాలనలో ఏపీని బాగుచేసుకుందాం. అందరూ సహకరించండి.మద్దతుగా నిలవండి అని కోరుతున్నా అని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. జై ఆంధ్రప్రదేశ్‌, జైభారత్‌, జైహింద్‌ అని నినదించారు.

Previous Post

మీకు అండగా ఉంటా..

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2024

Next Post
చైతన్యరధం ఈ పేపర్ 18-03-2024

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2024

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.