గుంటూరు (చైతన్య రథం): మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో వైకాపా సోషల్ మీడియా సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు. హోంమంత్రి అనితపై పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన కార్యకర్త రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడు. దీనిపై నూజివీడులో కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజశేఖర్ కోసం కొన్ని రోజులుగా గాలిస్తున్నారు. నకరికల్లులో అతడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం అంబటి రాంబాబు స్పందిస్తూ రాజశేఖర్ తమ ఇంట్లోనే ఉన్నాడని.. సంబంధిత ఆధారాలుంటే అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. దీంతో బుధవారం నూజివీడు పోలీసులు.. గుంటూరులో అంబటి ఇంటికి వెళ్లారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను చూపించి రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.