- వచ్చేది ఎన్డీయే కూటమి సర్కారు
- ప్రజల కోసం త్యాగాలకు సిద్ధం
- చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన
- టీడీపీలోకి ఎంపీ మాగుంట, మాజీ ఎమ్మెల్యేలు గరటయ్య, ఒంటేరు
- వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానన్న అధినేత
- పిఠాపురంలో భారీ మెజారిటీకి సూచన
- పవన్‌ను గెలిపించుకుంటామన్న వర్మ
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో సైకో పాలన పోయి, ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం తనను ఆదరిం చిన ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. చంద్రబాబు సమక్షంలో ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, తనయుడు మాగుంట రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణు గోపాల్ రెడ్డితోపాటు వారి అనుచరులు పెద్దఎత్తున శనివారం టీడీపీలో చేరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ‘ఈ రోజు ఒక శుభ దినం. ఎన్నికల కోడ్ వచ్చింది. ఇక ఎవరూ భయపడే పరిస్థితి లేదు. ఆది వారం ప్రజాగళం పేరుతో చిలకలూరిపేటలో బహి రంగ సభతో చరిత్ర సృష్టించబోతున్నాం. రాష్ట్రంలో నిన్నటి దాకా ప్రతిఒక్కరూ భయపడ్డారు. నా లాంటి వాడు తెగించాడు. నేను కూడా బయపడితే రాష్ట్రంలో మనుగడ సాధించలేం అన్నారు.
పవన్ కళ్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి
పొత్తులో భాగంగా పిఠాపురం స్థానం జనసేనకు వెళ్లింది. పిఠాపురాన్ని గతంలో వర్మ అభివృద్ధి చేశారు. కష్టాలు,ఇబ్బందులు ఎదురైనా వెనుతిరగలేదు. ఇప్పుడు పవన్‌కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో సీటును త్యాగం చేయాలని వర్మను కోరా. అందుకు వర్మ అంగీకరించారని చంద్రబాబు స్పష్టం చేశారు. 2014లోనూ పవన్ కళ్యాణ్ రాష్ట్రం బాగుండా లని పోటీ చేయకుండా సహకరించారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. వ్యతిరేక ఓటు చీలకూడదనే కలిసి పోటీకి వచ్చారు. త్వరలో ప్రకటించే ఎమ్మెల్సీ లల్లో వర్మ మొదటి వ్యక్తిగా ఉంటారు. వర్మను అభిమా నించే ప్రతిఒక్కరూ పవన్ కళ్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే వైసీపీ నేతలు ఈర్ష్యతో ప్రవర్తిస్తున్నారు. పిఠాపురంలో వర్మే అభ్యర్థి అనుకుని కార్యకర్తలు పనిచేసి పవన్‌ను మంచి మెజా రిటీతో గెలిపించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఒంగోలు ఎంపీ స్థానంలో టీడీపీదే గెలుపు
ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాకతో జిల్లాలో రాజకీయ పునరేకీకరణ సాధ్యమైంది. ఒంగోలు ఎంపీ స్థానంలో గెలుపు టీడీపీదే కాబోతోంది. దర్శి నియోజక వర్గంలోనూ ఉమ్మడి అభ్యర్థిని త్వరలోనే నియమిస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా పిఠా పురం తెదేపా ఇన్‌ఛార్జి వర్మ మాట్లాడుతూ ‘చంద్రబాబు ఆశీస్సులతో పిఠాపురంలో పార్టీని నిలబెట్టా. కార్యకర్తల ను చూసుకుంటున్నా. పురుషోత్తపట్నం ఎత్తిపోతల, ఏలూరు ఫేజ్-2 పనులు ఆగిపోయాయి. వాటిని పూర్తి చేయాలని కోరుతున్నా. చంద్రబాబుకు నేను తాలిబన్ లాంటి శిష్యున్ని. పవన్‌కళ్యాణ్‌ను పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం’ అని వర్మ పార్టీ అధినేత వద్ద ప్రమాణం చేశారు.