- సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వంతో
- పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగిస్తున్నారు
- విశాఖ సీఐఐకు శాశ్వత వేదికగా మారుతోంది
- నీరు, నిప్పులా అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు
- తెలుగు భాష తీయనిది.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి
- సీఐఐ సమ్మిట్ లో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్
విశాఖపట్నం(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం సీఐఐ భాగస్వామ్య సదస్సుకు శాశ్వత వేదికగా మారుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొ న్నారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ పెట్టుబడుల సదస్సు నిర్వహించటం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. పెట్టుబడుల సదస్సు కూడా దేశ వాణిజ్యాన్ని వృద్ధి చేస్తోందని తెలిపారు. ఇటీవలే రెండు తుఫాన్లు ఏపీ తీరాన్ని తాకి విధ్వంసం సృష్టించాయి. కానీ నష్టం జరిగినా వెంటనే కోలు కుని విశాఖ నగరం పెట్టుబడుల సదస్సుకు వేదిక అయిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు, ఆయా దేశాల రాయబారులను, ప్రతినిధులను ఆహ్వానించారు. కాలం కంటే ముందు ఆలోచన చేసి ఏఐ, క్వాంటం లాంటి టెక్నాలజీల గురించి మాట్లాడిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని కొనియాడారు.
అంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తున్నారు. పెట్టుబడి దారుల్లో విశ్వాసాన్ని పెంచేలా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించేందుకు ఎస్క్రోఖాతాను ఏపీ ప్రారంభిం చింది. 2024లో సీఎం చంద్రబాబు అధికారం చేపట్టినప్పుడు రాష్ట్రానికి పెద్దఎత్తున అప్పులు, విధ్వంసమైన వ్యవస్థలు ఆయన చేతికి వచ్చాయి. అయినా ఏపీని వేగంగా పునరుద్ధరించి వ్యవస్థలను చక్కదిద్దుతూ పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీని తయారు చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంసిం చారు.
నీరు, నిప్పులా పనిచేస్తున్నారు
3 ఆర్ఆర్ఆర్ సినిమాలోలాగా సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ నీరు, నిప్పులా అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం, సవాళు పోటీ నెలకొన్నాయి. ఇలాంటి విపత్కర సమ యంలోనే పెట్టుబడిదారులకు భారత్ భరోసాగా నిలుస్తోంది. అప్పట్లో ఆంధ్ర ప్రాంత పాలకుడైన కాకతీయ రాజు గణపతి దేవుడు అప్పట్లోనే విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించేలా కొన్ని శాసనాలు చేశారు. అప్పుడూ ఇప్పుడూ భారత్ విదేశీ పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంది. భారత జీడీపీ పెరుగుదలలో విదేశీ పెట్టుబడులకు నైపుణ్యం ఉన్న యువత కూడా అంతే స్థాయిలో సహకారం అందిస్తున్నాయి. భారతీయ యువత ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. విశాఖ నగరం స్టీల్ నుంచి సిలికాన్ సిటీగా ఎదుగుతోంది. ఓర్వకల్లు, పూడిమడక లాంటి ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ కేంద్రాలుగా మారుతున్నాయి.
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌ను భారత్ పూర్తిగా గౌరవిస్తుంది. సహకారం అందిస్తుంది. భారత్ ఎప్పుడూ టెక్నాలజీ ట్రాన్సఫర్ గురించి కోరదు.. అలాగే వారి మేధోసంపత్తిని చౌర్యం చేయదని అన్నారు. నాణ్యమైన ఉత్ప త్తులను అత్యంత చౌకగా, వేగంగా ఉత్పత్తి చేసుకునేలా పరిశ్రమ లకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. భారత్, ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. తయారీ రంగం, పర్యాటక రంగంలో వేర్వేరు రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. దేశభాషలందు తెలుగు భాష తీయనైనదని శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో చెప్పారు. అలాం టి ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.


















