శ్రీకాకుళం: దుర్మార్గుడు జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం ఆందోళనాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎన్‌టీయూసీ కార్మిక చైతన్య బస్సుయాత్రను శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్మిక చైతన్య బస్సు యాత్ర టెక్కలి నుంచి కుప్పం వరకు యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జీతాలు పెంచాలంటూ అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ఎస్మా ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. మరో 3 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. అంగన్వాడీలకు న్యాయం చేస్తాం. ఎస్మా జీఓ జగన్ రెడ్డి మడిచి జేబులో పెట్టుకోవాలి. జగన్ ఎప్పుడూ నా ఎస్సీ, నా బీసీ అని చెబుతుంటారు.. ఇటీవలి ఎమ్మెల్యేల బదిలీల్లో ఎక్కువశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. నీకు దమ్ముంటే పుంగనూరు పెద్దిరెడ్డిని మార్చు. అంబటి రాయుడు తెలియక వైసీపీలో చేరాడు. పది రోజుల్లోనే అంబటి రాయుడుకి జగన్ మనస్తత్వం అర్ధమయ్యింది. కొద్దిరోజులకే డక్ ఔట్ అయ్యిపోయాడని అచ్చెన్నాయుడు అన్నారు.
వైసీపీ మూనిగిపోతున్న నావ. దీనికి నిదర్శనం జగన్ వదిలిన బాణం చెల్లమ్మ పక్కకు వెళ్లిపోవటమే. ఎన్నికల ముందు అందరికీ ముద్దులు పెట్టి.. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారు. చివరికి సొంత కుటుంబ సభ్యులనూ వదలడం లేదు. శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర చేసిన కార్యకర్తలపై పెద్దిరెడ్డి దాడి చేశారు. ఇప్పుడు బస్సు పంపుతున్నాం ఏమి చేస్తావో చూస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.