- అధికారంలోకి వచ్చిననాటి నుండి ఇబ్బందులు, కక్షసాధింపులు
- అంగన్వాడీల కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం
అమరావతి, చైతన్యరథం: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంగన్వాడీలను ఏదోరకంగా జగన్‌రెడ్డి ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు.వారికి జీతాలు పెంచ కుండా, నెలవారీ జీతాలు సకాలంలో ఇవ్వకుండా, వెట్టి చాకిరీ చేయిస్తూ తానే నిజమైన పెత్తందారు అని నిరూ పించుకుంటున్నాడు. తెలంగాణ కంటే వెయ్యి రూపా యిలు ఎక్కువే జీతం ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి తీరా అధికారంలోకి రాగానే నమ్మించి నట్టేట ముంచాడు. జగన్ ఇచ్చిన హామీని అమలు చేయమని ప్రజాస్వామ్యబద్ధంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వారిపై ఉక్కుపాదం మోపుతున్నాడు. అంగన్వాడీ కేం ద్రాల తాళాలు బద్దలుకొట్టడం, సచివాలయ ఉద్యోగు లతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ జగన్‌రెడ్డి నిరం కుశ పాలనకు నిదర్శనం. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి,తన బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి వేల కోట్లు మంచినీళ్ల ప్రాయంగా వెచ్చించే జగన్‌రెడ్డికి అంగన్వాడీలకు జీతం పెంచడాని కి మాత్రం మనసు రాకపోవడం దుర్మార్గం కాక మరే మిటి? జీతాలు పెంచడానికి ఇది సరైన సమయం కాదని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి మాట్లాడటం సిగ్గుచేటు.పైగా అంగన్వాడీల అన్ని డిమాండ్లను పరిష్క రించామని మంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.
జగన్‌రెడ్డి ప్రభుత్వం కంటే తక్కువ బడ్జెట్ ఉన్నప్ప టికీ చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచి సంక్షేమం అందించింది. 2014నాటికి అంగ న్వాడీల జీతం రూ.4,200లు కాగా చంద్రబాబు రూ. 10,500కు పెంచారు. అంటే ఏకంగా రూ.6,300 పెంచి వారికి ఆర్థిక చేయూత అందించారు. చంద్ర బాబు హయాం కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ జగన్ రెడ్డి అంగన్వాడీలను మోసం చేశాడు. ఒక్క చాన్స్ ఇవ్వండి తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని నమ్మబలికి తీరా అధికారంలోకి రాగానే కేవలం రూ. 1000 పెంచి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణలో అంగన్వాడీల జీతం రూ.13,500 కాగా ఏపీలో రూ. 11,500. పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతం పెం చకపోగా ఆదాయ పరిమితి అస్త్రంతో అంగన్వాడీలకు సంక్షేమంలో కోత పెట్టాడు.
టీడీపీ హయాంలో అంగన్వాడీలకు చేయూత
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనోవికాస కేం ద్రాలుగా పనిచేసిన అంగన్వాడీ కేంద్రాలు జగన్మోహ న్‌రెడ్డి అసమర్థ పాలనతో సమస్యల వలయంలో చిక్కు కుని విలవిల్లాడుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం జీతాల పెంపుతో పాటు ఐదేళ్లలో 18,301 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించింది. 55,607 అంగవాడీల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం నాడు ` నేడు కింద వేల కోట్లు ఖర్చు పెట్టి అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని ఊదరగొట్ట డంతోనే సరిపెడుతోంది. 17,984 నూతన అంగన్ వాడీ కేంద్రాలను నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అంగన్వాడీ సిబ్బందినే కాదు కేంద్రాల్లోని పిల్లలనూ జగన్‌రెడ్డి ఇబ్బందులపాలు చేస్తున్నాడు. గుజరాత్ సంస్థ అమూల్‌పై ఉన్న మమకా రం మన అంగన్వాడీ పిల్లలపై జగన్‌కు లేదు.రాజకీయ కక్షతో అంగన్వాడీ కార్యకర్తను పట్టపగలు వైసీపీ నేత ట్రాక్టర్‌తో తొక్కించి చంపడం, మరో వైసీపీ నేత వేధిం పులు తట్టుకోలేక అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయ త్నం చేయడం వంటి ఘటనలు జగన్‌రెడ్డి నిరంకుశ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యాలు.
అంగన్వాడీలకు అందని సంక్షేమం
జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలు సం క్షేమానికి పూర్తిగా దూరమయ్యారు. ఆదాయ పరిమితి నిబంధనతో పథకాల్లో కోత పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఆదాయ పరి మితి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించి సంక్షే మం అమలు చేయగా జగన్‌రెడ్డి రూ.10వేల లోపు ఆదాయం ఉన్న వారికే సంక్షేమ పథకాలు అమలు నిబంధనతో వారిని ఇబ్బందుల్లోకి నెట్టాడు. నవరత్నాల అమలుకు రూపొందించిన నిబంధనల ప్రకారం గ్రామీ ణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు మించరాదు.
ఈ నిబంధన వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 51,299 మంది అంగన్వాడీలు పథకాల ఆర్థికసాయం కోల్పోతున్నారు. అలాగే పింఛను, అమ్మఒడి సాయం, ఇళ్ల పట్టాలు, నిర్మాణ రాయితీలు అందడంలేదు. మినీ అంగన్వాడీ కార్యకర్తలతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయి స్తున్నప్పటికీ ఆయాకుఇచ్చే జీతమేఇస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం చెల్లించాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటివి అమలు చేయాలని నాలుగేళ్లుగా అంగన్వాడీ ఉద్యోగులు కోరు తున్నా జగన్ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. పాల బకాయిలు కోట్లలో ఉన్నాయి టీఏ బిల్లులు ఇవ్వడం లేదు. ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.5వేల నుంచి రూ.10వేల వరకు రావాల్సి ఉన్నా పట్టించు కోవడం లేదు. కేంద్రాల పర్యవేక్షణ పేరుతో వివిధ కమిటీలు, రాజకీయ నాయకులు అంగన్వాడీ సిబ్బందిని వేధిస్తూ అవమానాలకు గురిచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మినీవర్కర్లు మరింత ఇబ్బందులు పడుతున్నారు. 300 జనాభా దాటిన చోట ఉన్న మినీ సెంటర్‌ను మెయిన్ సెంటర్‌గా మార్చాలని, మినీ అంగన్వాడీ వర్కర్లకు ప్రమోషన్లుఇవ్వాలని, గ్రేడ్-2 సూపర్ వైజర్ పోస్టుల్లో అవకాశం కల్పించాలన్న అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.
అంగన్వాడీల డిమాండ్లు
- కనీస వేతనం రూ.26 వేలు చేయాలి. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి.
- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీి ఇవ్వాలి.
- రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, ఆఖరి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి.
- అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి.
- హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలి. పదోన్నతుల్లో రాజకీయ జోక్యం అరికట్టాలి.
- 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.
- అంగన్వాడీ విద్యను బలోపేతం చెయ్యాలి. పిల్లలకి యూనిఫామ్, అమ్మఒడి అమలు చెయ్యాలి.
- వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. వంట గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి. పెండిరగ్లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి.
- సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, బీమా అమలు చెయ్యాలి.
- హత్యకి గురైన హనుమాయమ్మ కుటుంబంలో ఒకిరికి ఉద్యోగం ఇవ్వాలి. నష్టపరిహారం చెల్లించాలి.
- గ్రేడ్ 2 సూపర్ వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలి. 2022లో పరీక్ష రాసి పెండిరగ్లో ఉన్న గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులలో మిగిలిన పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలి.