చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన దార్శనికుడు నమో!

సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం మోదీ!

చైతన్యరధం by చైతన్యరధం
April 12, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం మోదీ!
  • అన్నామలైని గెలిపిస్తే కోయంబత్తూరు గొంతుకై పోరాడతారు
  • కోయంబత్తూరు ఎన్నికల ప్రచారసభలో యువనేత నారా లోకేష్‌

కోయంబత్తూరు: సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని నరేంద్రమోదీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కొనియాడారు. తమిళనాడులోని కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కి మద్దతుగా పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యాన గురువారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో యువనేత లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం. మోదీ అంటే ప్రపంచం మెచ్చిన నాయకత్వం అన్నారు. అందుకే మోదీని మేకర్‌ ఆఫ్‌ డెవలప్డ్‌ ఇండియా అని యావత్‌ ప్రపంచం ప్రశంసిస్తోంది. ప్రధాన మంత్రి అన్న యోజన, ఆవాస్‌ యోజన, ఉజ్వల్‌ యోజన, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, పీఎం ఆయుష్మాన్‌ భారత్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ వంటి పథకాలతో సంక్షేమానికే మోదీ కొత్త నిర్వచనం చెప్పారు.

పదేళ్లలో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన దార్శనిక నేత నరేంద్ర మోదీ. ఒకపక్క సంక్షేమ పథకాలను అందిస్తూనే…..దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, గతి శక్తి, భారత్‌ మాల వంటి అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి సంపద సృష్టించారు.డీమానిటైజేషన్‌, జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేశారు. సబ్‌ కా సాత్‌ ` సబ్‌ కా వికాస్‌ ` సబ్‌ కా విశ్వాస్‌ అనే నినాదంతో దేశ ప్రజల్లో నమ్మకాన్ని నింపారు. మోదీ నేతృత్వంలో కోవిడ్‌ సంక్షోభాన్ని మన దేశం అధిగమించిన తీరు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. 100 దేశాలకు వ్యాక్సిన్‌ ఇచ్చి దేశ సమర్థతను మోదీజీ ప్రపంచానికి చాటి చెప్పారని లోకేష్‌ అన్నారు.

అమెరికా, చైనాలకు దీటుగా భారత్‌ ఆర్థిక వ్యవస్థ
ప్రపంచంలో 11 వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5 స్థానానికి తెచ్చిన సమర్థనేత నరేంద్ర మోదీ. రాబోయే 5 ఏళ్లలో అమెరికా, చైనాలతో పోటీ పడుతూ దీటైన ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చేందుకు ఆయన పనిచేస్తున్నారు. తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎంత గానో గౌరవిస్తారు. 74 వ యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ లో ప్రధాని తమిళంలో మాట్లాడారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. తమిళనాడు అభివృద్ధి కోసం సుమారుగా రూ. 2. 31 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. రైల్వేస్‌, రోడ్లు, ఆయుష్మాన్‌ భారత్‌ , బీమా యోజన, పరిశ్రమలకు రాయితీలు, తాగు, సాగునీటి ప్రాజక్టులు, స్మార్ట్‌ సిటీస్‌ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కేంద్రప్రభుత్వం అమలు చేసిందని లోకేష్‌ చెప్పారు.

తమిళ ప్రజల పట్టుదల అంటే నాకు ఇష్టం
దేశంలోనే అపార అభివృద్ధికి అవకాశాలున్న నేల కోయంబత్తూరు. మాంచెస్టర్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా పేరొందిన కోయంబత్తూర్‌ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోయంబత్తూర్‌ వచ్చాను. అనేకమంది పారిశ్రామికవేత్తలను, తెలుగు వారిని కలిసాను. ఎన్నికల ప్రచారానికి తమిళనాడు రావడం మాత్రం ఇదే మొదటి సారి… ఇదొక భిన్నమైన అనుభవం. తమిళ ప్రజల పట్టుదల నాకు ఇష్టం. తమిళ ప్రజలు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ఎంతగానో ప్రేమిస్తారు. తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంటారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రజలకి సేవ చెయ్యడానికి మీరు ఉద్యోగం వదులుకుంటారా? మీరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ లేదా ప్రభుత్వ ఉద్యోగం వదులుకొని ప్రజలకి సేవ చెయ్యడానికి ముందుకు వస్తారా? అలాంటిది చిన్న వయస్సులో ఐపీఎస్‌ వదులుకొని ప్రజలకు సేవ చేస్తానని ముందుకు వచ్చిన సింగం అన్నామలై అని లోకేష్‌ అన్నారు.

దమ్మున్న నాయకుడు అన్నామలైని గెలిపించండి
కర్ణాటకలో ఆయన సింగం … ఐపీఎస్‌. తమిళనాడులో ఆయన టీపీిఎస్‌. టీపీిఎస్‌ అంటే తమిళ్‌ పీపుల్‌ సర్వీస్‌. నేను అన్నామలై అభిమానిని. అన్నామలై నాకు మంచి మిత్రుడు. అన్నామలై ఒక దమ్మున్న నాయకుడు. కోయంబత్తూరు సర్వతోముఖాభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోండి. అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ నేను మీడియాలో కొన్ని కథనాలు చూశాను. అయితే ఆయన వివాదాలతో ఎదిగిన నాయకుడు కాదు. సొంత సామర్థ్యంతో ఎదిగిన వ్యక్తి. అన్నామలై కి ఒక విజన్‌ ఉంది, తమిళనాడు దశ, దిశా మార్చే మాస్టర్‌ ప్లాన్‌ అన్నామలై దగ్గర ఉంది. నా మిత్రుడు అన్నామలై తరపున ప్రచారం చెయ్యడానికి ఇక్కడికి వచ్చాను. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఐపీఎస్‌ సాధించారు. సామాన్యుడి బాధలు చూసి నాయకుడిగా మారాడు. ఎన్‌ మన్‌, ఎన్‌ మక్కల్‌ పాదయాత్ర ఒక చరిత్ర… అన్నామలై తమిళ ప్రజల మనస్సు గెలుచుకున్నారు. అన్నామలై కి రైతు కష్టం తెలుసు, ఉద్యోగాలు లేక యువత పడుతున్న బాధలు తెలుసు, మహిళల సమస్యలు తెలుసు, పారిశ్రామిక వేత్తలు పడుతున్న ఇబ్బందులు తెలుసు. అన్నామలై మార్పు కోసం పోరాడుతున్నారు. ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు ప్రజలు అన్నామలైని ఆశీర్వదించాల్సిందిగా లోకేష్‌ విజ్ఞప్తి చేశారు.

అన్నామలై కల ` వికసిత్‌ కోయంబత్తూరు
అన్నామలై కల వికసిత్‌ తమిళనాడు – వికసిత్‌ కోయంబత్తూరు. ఆయనను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మీ సమస్యలు తీరుస్తారు. గతంలో సీపీ రాధాకృష్ణన్‌ లాంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ ఎంపీగా పనిచేసారు. ఇప్పుడు యువకుడు అన్నామలైకి అవకాశం ఇవ్వండి. ప్రస్తుతం కోయంబత్తూరు పార్లమెంట్‌ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. కోయంబత్తూరు సిటీ కూడా ఒక దశ వరకూ అభివృద్ధి చెంది ఆగిపోయింది. యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, తాగునీటి సమస్య, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇక్కడ ఉన్న ఫౌండరీలు ఎదుర్కుంటున్న సమస్యలు, పవర్‌ లూమ్‌, హ్యాండ్‌ లూమ్స్‌ సమస్యలు, ఆటోమొబైల్‌ అనుబంధ పరిశ్రమల సమస్యలు, అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు అన్నీ అన్నామలై కి తెలుసు. కోయంబత్తూరులో అన్నామలైని గెలిపిస్తే, మీకు ఆయనను ప్రశ్నించే హక్కు వస్తుందని లోకేష్‌ అన్నారు.

అన్నామలైని గెలిపిస్తే పోరాడి నిధులు తెస్తాం
కోయంబత్తూరు అభివృద్ధి, ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చడానికి అన్నామలై కి ఒక విజన్‌ ఉంది. ఒక్క కంపెనీ, ఒక్క ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ తీసుకురావడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. ఇక్కడ ఫౌండరీలను లేటెస్ట్‌ టెక్నాలజీతో అప్‌గ్రేడ్‌ చెయ్యాలి. పవర్‌ లూమ్‌, హ్యాండ్‌ లూమ్‌ కార్మికులను , పరిశ్రమను ఆదుకోవాలి. ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ అభివృద్ధి కి స్పెషల్‌ జోన్స్‌ ఏర్పాటు చెయ్యాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్స్‌ ఏర్పాటు చెయ్యాలి. స్టార్ట్‌ అప్‌ కంపెనీలు అభివృద్ధి చెయ్యడానికి పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలి. డిఫెన్స్‌ కారిడార్‌ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, దానిని అభివృద్ధి చెయ్యాలి. తాగునీటి సమస్య, రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలి. కోయంబత్తూరు పార్లమెంట్‌ కి ఏం కావాలో అన్నామలైకి తెలుసు. పంచాయతీ ప్రెసిడెంట్‌ నుండి పార్లమెంట్‌ వరకూ ఒకే పార్టీ ఉంటే ప్రశ్నించే వారు ఉండరు, అన్నామలైని గెలిపిస్తే ఇక్కడి సమస్యలపై పోరాడతారు. కేంద్రంనుంచి నిధులు తెచ్చి పెద్దఎత్తున అభివృద్ధి చేస్తారని యువనేత లోకేష్‌ పేర్కొన్నారు.
కాగా శుక్రవారం ఉదయం 8 గంటలకు సింగనల్లూర్‌ ఇందిరా గార్డెన్స్‌ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమై అన్నామలై విజయానికి సహకరించాలని లోకేష్‌ కోరతారు. అనంతరం కోయంబత్తూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి వచ్చి, సాయంత్రం యథావిధిగా మంగళగిరి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాలకు హాజరవుతారు.

ఏపీలో కూటమి గెలుపు ఖాయం: అన్నామలై
ఈ సభలో కోయంబత్తూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ ప్రపంచ దేశాల నుండి కంపెనీలు తెచ్చి హైదరాబాదును ఐటీి రంగంలో అంతర్జాతీయ స్ధాయిలో అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఏపీలో కూటమి గెలుపును ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. తమిళనాడులో డీఎమ్‌కే చేస్తున్నట్లుగానే ఏపీలోను అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అన్యాయంగా అక్కడి అధికార పార్టీ అరెస్టు చేసింది. ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూటమి వైపు చూస్తున్నారు. ఏపీ రానున్న రోజుల్లో అభివృద్ధిలో దూసుకుని వెళుతుంది…దాన్ని మనం కళ్ళారా చూస్తాము. అలానే ఇక్కడ కోయంబత్తూరు అభివృద్ది చెందుతుంది. కోయంబత్తూరులో ఉన్న తెలుగు ప్రజల కోసం నారా లోకేష్‌ వచ్చారంటూ తన గెలుపు కోసం వచ్చిన లోకేష్‌లు ధన్యవాదాలు తెలిపారు.

Tags: అభివృద్ధిఎన్నికల ప్రచారంకోయంబత్తూరునారా లోకేష్మోదీసంక్షేమంసంస్కరణ
Previous Post

ప్రజాస్వామ్యం గెలవాలి…రాక్షస పాలన పోవాలి

Next Post

బాధపడొద్దు..బాసటగా ఉంటాం

Next Post
బాధపడొద్దు..బాసటగా ఉంటాం

బాధపడొద్దు..బాసటగా ఉంటాం

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.