చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

2న అన్నదాత సుఖీభవ

జిల్లా కలెక్టర్లకు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

చైతన్యరధం by చైతన్యరధం
August 1, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
2న అన్నదాత సుఖీభవ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 46,85,838 మంది రైతులకు పథకంతో లబ్ది
  • మొదటివిడతలో ఒక్కో రైతుకు రూ.5,000
  • రూ.2,342.92 కోట్ల నిధుల కేటాయింపు
  • కేంద్రం ఇచ్చే రూ.2 వేలు కలిపి రూ.7 వేలు జమ
  • ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
  • ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా లబ్దిదారులకు సందేశం
  • సాగునీటి ఎద్దడి, ఎరువుల కొరత రానివ్వకండి
  • జిల్లా కలెక్టర్లకు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
  • సందేహాల నివృత్తికి 155251 టోల్‌ ఫ్రీ నెంబర్‌

అమరావతి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఆగస్ట్‌ 2న అమలు చేయాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు లబ్ది పొందుతారు. మొదటి విడతలో రాష్ట్రవాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్ల నిధుల్ని వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.

రైతులకు సాయం భారం కాదు… బాధ్యత
‘అన్నదాత సుఖీభవ’ అమలు సన్నద్ధతపై గురువారం సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, జలవనరులు, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతీ రైతుకూ అన్నదాత సుఖీభవ అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదు.. బాధ్యతగా గుర్తెరగాలని సీఎం సూచించారు. రైతులకు నిధులే కాదు.. నీళ్లూ ఇస్తున్నామని చెప్పారు.
ప్రజల విశ్వసాన్ని నిలబెట్టుకున్నాం

‘ఆగస్ట్‌ 2న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలి. గ్రామ సచివాలయం నుంచి పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో కార్యక్రమం నిర్వహించాలి. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ చిన్నాభిన్నం చేసింది. నాడు ఆర్థిక విధ్వంసం జరిగింది. ప్రతీ వ్యవస్థనూ పునర్నిర్మిస్తున్నాం. ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులకు హామీ ఇచ్చినట్టుగానే ‘అన్నదాత సుఖీభవ’ను అమలు చేసి చూపించాం. పథకాలు అమలు చేస్తూ ప్రజల విశ్వసాన్ని నిలబెట్టుకున్నాం. చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి. రాజకీయ నేతలు పాలసీలు మాత్రమే తయారు చేస్తారు. వాటిని అమలు చేసేది అధికారులే. వ్యవస్థలో అందరూ జావాబుదారీతనంతో వ్యవహరించాలి. అన్నదాత సుఖీభవ అందుకునే రైతులకు సెల్‌ ఫోన్లకు ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు వెళ్లాలి. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్‌ చేసుకునేలా వారికి అవగాహన కల్పించండి’ అని ముఖ్యమంత్రి సూచించారు.
వ్యవసాయ ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం
‘ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బొప్పాయి ధర తగ్గిందని కథనాలు వస్తున్నాయి. వాటిపైనా సమీక్ష చేసి రైతులకు న్యాయం చేయాలి. ఎరువుల విషయంలో కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కడా కొరత రానీయొద్దు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద కొనసాగుతోంది. గండికోట, బ్రహ్మంసాగర్‌, సోమశిల, కండలేరు ప్రాజెక్టులను వందశాతం నీటితో నింపాలి. రిజర్వాయర్లలో ఎంత నీరుందనే సమాచారం ఉండాలి. నీటి నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలి. భారత్‌పై అమెరికా 25శాతం సుంకాలు విధించింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనాలి. ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం అందించిన సాయం, ఇతర వివరాలతో కరపత్రం రూపొందించి క్షేత్రస్థాయిలో ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు సూచించారు.

ఆగస్ట్‌ 2న ఒక్కో రైతుకు రూ.7,000 జమ
ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏటా రూ.20,000 చొప్పున అందిస్తామన్న కూటమి హామీని ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్‌’ అమలుతో నెరవేర్చినట్టయ్యింది. ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14,000 ఇవ్వనుంది. మొదటి, రెండో విడత రూ.5 వేల చొప్పున, అలాగే మూడో విడత రూ.4 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రూ.14 వేలను 3 విడతలుగా అందించాలని గతంలోనే నిర్ణయించారు. కేంద్రం మొదటివిడతగా రూ.2,000 చొప్పున రూ.831.51 కోట్లు రైతులకు సాయం చేయనుంది. దీంతో ఆగస్ట్‌ 2న కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7,000 జమ చేసినట్టవుతుంది. మరోవైపు ‘అన్నదాత సుఖీభవ’కు సంబంధించి 59,750 గ్రీవెన్సులు నమోదుకాగా… వాటిలో 58,464 దరఖాస్తులను పరిష్కరించారు. ఈ పథకంపై సందేహాలను నివృత్తి చేసేందుకు 155251 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచారు. సమీక్షలో సీఎస్‌ కె విజయానంద్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయలక్ష్మీ, సీఎం ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పియూష్‌ కుమార్‌, సీఎం కార్యదర్శి రాజమౌళి, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ ఢల్లీిరావు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Previous Post

విశ్వాస పునరుద్ధరణ!

Next Post

ప్రకృతి ఒడిలో అమరావతి

Next Post
ప్రకృతి ఒడిలో అమరావతి

ప్రకృతి ఒడిలో అమరావతి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.