చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఒక్క ఛాన్స్‌తో సర్వనాశనం

ఆలూరు ప్రజాగళం సభలో జగన్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు

చైతన్యరధం by చైతన్యరధం
April 20, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఒక్క ఛాన్స్‌తో సర్వనాశనం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అధికారముందనే అహంకారంతో దోపిడీ, విధ్వంసం
  • పాలించమని అవకాశమిస్తే వ్యవస్థలన్నీ నాశనం
  • ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ప్రాణాలతో ఆటలు
  • కూటమి ప్రభుత్వం రాగానే సర్పంచులకు విధులు, నిధులు
  • సీమలో జగన్‌ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు
  • జగన్‌ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు
  • ఇక్కడ పులి, ఢల్లీిలో పిల్లి
  • మాదాసి కురబలను ఎస్సీల్లో చేర్చుతాం
  • సామాన్యులకు టికెట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది

ఆలూరు (చైతన్యరథం): రాష్ట్రాన్ని పాలించేందుకు జగన్‌రెడ్డికి ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే సర్వనాశనం చేశాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆలూరులో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికలు ఏపీ చరిత్ర, ప్రజల భవిష్యత్‌ మార్చేవన్నారు. నా ప్రాణ సమానమైన కార్యకర్తలు కసిగా పనిచేయాలి.. దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.. మీ ఓటుతో సైకో రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. సాధారణ కార్యకర్త వీరభ్రద గౌడ్‌ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఒక ఎంపీటీసీని …ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాం. కురబ కులస్థుడు బెస్త నాగరాజు ఎంపీగా గెలిచి ఢల్లీికి వెళతాడని మీరు ఊహించారా? వీరిద్దరినీ గెలిపించడం ప్రజాస్వామ్యానికి మీరిచ్చే గౌరవం. వీరిద్దరినీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. ఆలూరు ప్రజలు అదరగొడుతున్నారు. ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కదం తొక్కుతోందని చంద్రబాబు అన్నారు.
ముస్లింలకు న్యాయం చేసేది టీడీపీనే
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు అండగా నిలబడాలని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచాలనే ఉద్దేశంతో పొత్తుకు ముందుకొచ్చాం. మేము సైతం కలిసి పనిచేస్తామని జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. కేంద్రంలో రాబోయేది ఎన్డీఏనే. మన రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ సహకారం ఎంతో అవసరం. అందుకే జట్టు కట్టాం. మైనారిటీ సోదరులందరూ ముందుకొచ్చి కూటమి గెలుపు కోసం కృషిచేయాలి. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. అధికారంలోకి వచ్చాక ముస్లింలకు అండగా నిలబడతాం. ఆర్థికంగా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇక్కడ పులి అంటాడు…ఢల్లీిలో పిల్లిలా ఉంటాడు
ముఖ్యమంత్రిగా గెలిపిస్తే జగన్‌ రెడ్డి ఏం చేశాడు? ఢల్లీి వెళ్లి పైరవీలు చేసుకున్నాడు. రాష్ట్రాన్ని గాలికొదిలేశాడు. 13 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. కేంద్రం సహకారంతో భవిష్యత్‌ లో అందరి జీవితాల్లో వెలుగులు తెస్తాం. ఆలూరు ఎప్పుడొచ్చినా వైకుంఠం శ్రీరాములు నాకు గుర్తు వస్తాడు. కొందరు స్వార్థంతో పక్కకు పోయినా వైకుంఠం టీడీపీతోనే ఉండిపోయాడు. శివప్రసాద్‌, జ్యోతిని పార్టీ ఆదరించి ఆదుకుంటుంది. కప్పట్రాల కుటుంబానికి అండగా నిలబడతాం. దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు కొందరు నాయకులు త్యాగాలు చేయాల్సి వచ్చింది. అందుకు కోట్ల కుటుంబం ముందుకొచ్చింది. కోట్ల సుజాతమ్మకి అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం ఇస్తాం. వెనుకబడిన కర్నూలు జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా. అధికార మదంతో విర్రవీగుతున్న జగన్‌ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి. జగన్‌రెడ్డికి జే గన్‌ రెడ్డిగా నామకరణం చేస్తున్నాను. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తిని ఇలా కాక మరెలా పిలుస్తాం. అన్ని రంగాలను జగన్‌ నాశనం చేశాడు. నిన్నటి వరకూ పరదాలు కట్టుకుని తిరిగాడు. నేడు నెత్తిన చేయిపెడుతున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు.
సీమలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు
టీడీపీ హయాంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు నేను రూ. 12 వేల కోట్లు ఖర్చు చేశా. ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా జగన్‌ పూర్తి చేయలేదు. సాగు, తాగునీరు ఇవ్వలేదు. దమ్ముంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సీమకు ఒక్క పరిశ్రమ తెచ్చాడా. ఉద్యోగం ఇచ్చాడా, డీఎస్సీ తెచ్చాడా. వాలంటీర్‌ ఉద్యోగం ఇస్తే ఉపాధి కల్పించినట్టేనా. జగన్‌ రెడ్డి మాత్రమే పెత్తనం చేస్తూ మనమంతా బానిసలుగా ఉండాలి. మీ జీవితాలు బాగుపడ్డాయా, మీ ఆదాయాలు పెరిగాయా, మీ కష్టాలు తీరాయా? వరి, టమాటా, మిరప, పత్తి, రైతులు బాగున్నారా? రైతు భరోసా కేంద్రాలు అంటూ గొప్పలు చెబుతున్నారు.. అవి రైతు దగా కేంద్రాలు. నీరిస్తే రాయలసీమ పొలాల్లో బంగారు పంటలు పండుతాయి. కానీ దుర్మార్గుడు నీరివ్వకుండా ప్రగల్భాలు పలుకుతున్నాడు. పాఠశాలల గోడలకు రంగులు కొడితే నాణ్యత పెరుగుతుందని ఆలోచించే దుర్మార్గుడు జగన్‌ రెడ్డి అని చంద్రబాబు దుయ్యబట్టారు.
పేదల ఆరోగ్యంతో ఆటలు
విద్యపై పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఫలితాలు ఎంత, దోచుకుని, దాచుకున్నది ఎంతో జగన్‌ సమాధానం చెప్పాలి. ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి మరింత ఘోరం. కనీసం దూదికి కూడా దిక్కులేదు. పేదలకు కనీసం మందులైనా ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందడం లేదు. టీడీపీ హయాంలో కరువు సీమ రాయలసీమను ఆదుకున్నాను. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలు అందించాను. సీమలో 90 శాతం రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇచ్చాం. అనంతపురంలో కియా మోటార్స్‌ తీసుకువచ్చాం. కడప విమానాశ్రయాన్ని టీడీపీ హయాంలోనే అభివృద్ధి చేశాం. మద్యపాన నిషేధం పేరుతో ప్రజలను జగన్‌ రెడ్డి నిండా ముంచాడు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నాడు. ఏమైంది? వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామన్న హామీ ఏమైంది? మాట తప్పిన జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉందా అని చంద్రబాబు నిలదీశారు.
బలహీన వర్గాలకు అండగా టీడీపీ
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అందులో భాగంగానే మాదాసి కురబలను ఎస్సీ జాబితాలో చేరుస్తాం. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాల్సి ఉంది. కూటమి వచ్చాక సర్పంచులకు నిధులు, విధులు ఇస్తాం. జగన్‌ శవరాజకీయాలు చేస్తున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కురుక్షేత్ర యుద్దంలో ధర్మానిదే విజయం. సంపద సృష్టించి ఆదాయం పెంచి ప్రజలకు పంచుతామని ఆలూరు సాక్షిగా హామీ ఇస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.

Previous Post

మోసం.. జగన్‌ నైజం!

Next Post

వడ్డెర బిడ్డలను బలిచేస్తారా

Next Post

వడ్డెర బిడ్డలను బలిచేస్తారా

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.