- గ్రీవెన్స్‌ను జీరో స్థాయికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి
- ప్రజలను పదేపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు
- ఈ నెలాఖరుకు ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తిచేయాలి
- చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసిన వాటిపై న్యాయ సలహా కోరతాం
- పొలాలతో పాటు ఇళ్లు, స్థలాలకు కూడా జియో ట్యాగింగ్ తెస్తాం
- త్వరలోనే రెవెన్యూ సదస్సులు..రీ సర్వేలో పొరపాట్లను సరిదిద్దుతాం
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి అనగాని సత్యప్రసాద్
మంగళగిరి(చైతన్యరథం): తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రీవెన్స్‌ను జీరో స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రజలను పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని హితవుపలికారు. మంగళవారం మంగళగిరి సీసీఎల్ఎ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాల్సిందేనని, అధికారులంతా ఆ రోజు కార్యాలయాల్లో ఉండాల్సిందేనని ఆదేశిం చారు. పంట పొలాలకు మాత్రమే కాక త్వరలో ఇళ్లకు, ఇంటి స్థలాలకు కూడా జియో ట్యాగింగ్‌ను తీసుకువస్తామని చెప్పారు. దీనివల్ల భూముల యాజమాన్య హక్కులకు సంబం ధించి వివాదాలు తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, ఏకకాలంలో రెవెన్యూ సదస్సులతో పాటు రీ సర్వేలో జరిగిన పొరపాట్లను కూడా సరిచేయాల్సి ఉందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కలెక్టర్లు తగిన గౌరవం ఇవ్వా లని, వారు తెచ్చిన సమస్యలను నిబంధనలకు అనుగుణంగా ఉంటే వెంటనే పరిష్కరించా లని, పొలిటికల్ గవర్నెన్స్ కూడా చాలా ముఖ్యమని సూచించారు. ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, రిజిస్టర్ అయిన ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, ప్రజల నుంచి వచ్చిన అర్జీల కు పరిష్కారం, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ అంశాలపై సమీక్షించారు.
ఈ నెలాఖరు నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి
ఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూములపై వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసి కొంతమంది అనుచిత లబ్ధిపొందారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ భూములను వెరిఫై చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 13,59,804 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయగా ఇప్పటివరకు 4,17,640 ఎకరాలను వెరిఫై చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా 91,739 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. అలాగే ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో ఇప్పటివరకు 25,230 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయగా అందులో నిబంధనలకు విరుద్ధంగా 4,245 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. అయితే ఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఫ్రీహోల్డ్ భూములపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు.
అర్జీల పరిష్కారంలో జాప్యంపై సీఎస్ సీరియస్
అర్జీల పరిష్కారంలో జరుగుతన్న జాప్యంపై రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.పి. సిసోడియా సీరియస్ అయ్యారు. రెవెన్యూ మంత్రి కార్యాలయం నుంచి 1414 అర్జీలు పరిష్కారం కోసం కలెక్టర్లకు పంపగా కేవలం 16 అర్జీలకు మాత్రమే తిరిగి సమాధానం రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో నుంచి, రెవెన్యూ మంత్రి కార్యాలయం నుం చి, తన కార్యాలయం నుంచి గానీ వచ్చిన అర్జీలకు సరైన సమయంలో స్పందించకుంటే ఆయా కలెక్టర్లపై తగు చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ మూడు కార్యాలయాల నుంచి ఏ సమాచారం అడిగినా వెనువెంటనే స్పందించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా, సీసీఎల్ఏ జయలక్ష్మి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ శేషగిరిబాబు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.