- ప్రజల్లో కోర్టుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
- 12 ఏళ్లయినా విచారణ జరపకపోవడంలో అర్థమేంటి?
- జగన్‌రెడ్డి, విజయసాయిలకు ఎందుకు శిక్ష పడలేదు?
- సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌ను కోరుతున్నా…జవాబు కావాలి
- విచారణలో జాప్యంపై సమీక్ష చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా
- రోజువారీ విచారణ చేసి తప్పు చేశారో..లేదో తేల్చాలి
- న్యాయస్థానాల ఉదాశీనత వల్లే బయట తిరుగుతున్నారు
- పేరుమోసిన ఆర్థిక నేరస్థుల కేసుల్లో ఎందుకంత జాప్యం
- ఏ1, ఏ2లకు యూరప్‌లో ఏమున్నాయని వెళుతున్నారు
- విచారణ పూర్తయ్యే వరకు విదేశీ పర్యటనకు అనుమతివ్వొద్దు
- వారిద్దరికీ అనుమతిస్తే తిరిగి వస్తారన్న నమ్మకం లేదు
- పదేపదే ఎందుకు వెళుతున్నారో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి
- అక్రమాస్తులు ఉన్నాయా?పర్యటనకు డబ్బులెక్కడివి?
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నలు
మంగళగిరి(చైతన్యరథం): 12 ఏళ్లయినా జగన్ కేసులు విచారణ జరపకపోవడంలో అర్థమేంటి? జగన్‌రెడ్డి, విజయసాయిలకు ఎందుకు శిక్ష పడలేదు? కోర్టులో జగన్ కేసుల పేపర్లు ఏమైనా తగులబడ్డాయా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌ను కోరుతున్నా…జవాబు కావాలి అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం మంగళగి రిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. సినిమా టికెట్ కొనడానికి డబ్బుల్లేని జీవితం గడిపిన జగన్, విజయసాయిలు నేడు యూరప్‌కు వెళ్లగలిగే స్థాయికి ఎలా ఎదిగారని ప్రశ్నించారు. జగన్, విజయసాయిరెడ్డి వంటి వారికి కోర్టులు వెసలుబాటు కల్పించడం కరెక్టు కాదన్నారు. ఏ1 ముద్దాయి జగన్, ఏ2 ముద్దాయి విజయసాయికి యూరప్‌లో ఏమున్నాయని పర్యటనలకు అనుమతి కోరుతున్నారు? వీరిపై విచారణ ఎందుకు జరగడం లేదు? వీరు కోర్టులకు ఎందుకు హాజరుకావడం లేదు? అని ప్రశ్నించారు. సీఎం కేజ్రీవాల్ సీఎం అయినా జైలులో ఉన్నాడు.. మరి జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేసులున్నప్పటికీ ఎందుకు బయట ఉన్నాడు? 12 ఏళ్ల పాటు జగన్, విజయసాయిలపై విచారణ జరపకపోవడంలో అర్థమేంటి? కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదాల నుంచి కాపాడాలని జస్టీస్ చంద్రచూడ్‌ను కోరుతున్నా ను. జగన్ కేసులో రోజువారీ విచారణ జరగాలి, జగన్ తప్పు చేశాడా లేదా అని త్వరితగ తిన కోర్టు తేల్చాలని విజ్ఞప్తి చేశారు.
విదేశీ పర్యటనకు అనుమతివ్వొద్దు
యూరప్ పర్యటనకు జగన్‌కు అనుమతి ఇస్తే ఇతర ముద్దాయిలు కూడా అనుమతి అడుగుతారని, అవినీతి, నేరచరిత్ర ఉన్న జగన్, విజయసాయిలు బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే బాధేస్తోందన్నారు. జగన్ విదేశాలకు వెళితే ఏం జరుగుతుందో కోర్టు పున:పరిశీలన చేయాలని, కేసుల విచారణ పూర్తయ్యే వరకు జగన్ విదేశాలకు వెళ్లకుండా చూడాలని కోరారు. మన దురదృష్టం వల్ల జగన్ మొన్నటివరకు మన రాష్ట్రానికి ముఖ్యమం త్రి. ప్రస్తుతం ఆయనకు దురదృష్టం వెంటాడి 150 సీట్ల నుంచి మధ్యలోని 5 ఎగిరిపోయి 11 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. నెత్తిన కొట్టి కూర్చోబెట్టారు. ఏ1 ముద్దాయి జగన్ 11 కేసుల్లో చార్జ్‌షీట్లు ఎదు ర్కొంటున్నాడు. 12 ఏళ్ల క్రితం చేసిన నేరాలు అలాగే ఉన్నాయి. ఇక ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. మంచి రికార్డులున్న వారు, పెద్దలు మాత్ర మే రాజ్యసభలో ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలా విజయసాయి ఎంపీగా ఉన్నాడు. లోక్‌సభలో పాస్ అయిన బిల్లులను రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభలో ఆమోదం పొందాక ఆ బిల్లులు అమలులోకి వస్తాయి. అలాంటి అత్యున్నత సభలో విజయసాయి ఉండడం బాధాకరమన్నారు. 3 సార్లు ఎంపీగా ఉండి విజయసాయి సాధించింది శూన్యమని వ్యాఖ్యానించారు.
ఎందుకు వారికి శిక్ష పడటం లేదు?
జగన్‌ను కోర్టులో జగన్.. జగన్.. జగన్ అని పిలిస్తే జగన్‌తో పాటు విజయసాయి కూడా హాజరవుతారు. రాష్ట్ర ప్రజల సొమ్ము దాదాపు రూ.43 వేల కోట్లు కొట్టేశారు. అయి నా న్యాయస్థానాల ఉదాశీనత ఎందుకు? కేసుల్లో చొరవ చూపకపోవడం ఏమిటి? కోర్టులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల 12 ఏళ్లుగా విచారణ లేకుండా ఇష్టమొచ్చి నట్లుగా తిరుగుతున్నారు. సీబీఐ వారి అవినీతిని బహిర్గతం చేసినా శిక్ష మాత్రం పడలేదు. వీరంతా ముద్దాయిలని అందరికీ తెలుసు. ఏ తప్పు చేయని పవిత్రుల్లాగా బాహ్య ప్రపంచం లో తిరుగుతుంటే బాధేస్తుంది. ఎందుకు వీరికి కోర్టులచే శిక్షపడడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ చంద్రచూడ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. కోర్టులో వీరి కేసుల పేపర్లేమైనా తగులబడ్డా యా? అనే అనుమానం కలుగుతోంది. కోర్టును తప్పు పట్టడం లేదు కానీ వీరికి శిక్ష ఎందు కు పడడం లేదో నాకు సమాధానం కావాలి. తప్పు చేసి, అవినీతికి పాల్పడి ఏ విచారణ లేకుండా నిస్సిగ్గుగా, బేసిగ్గుగా జగన్, విజయసాయిలు తిరుగుతున్నారు. 6 నెలల పాటు యూరప్‌కు వెళ్లాలని పర్మిషన్ అడుగుతున్నారు. యూరప్ వెళితే ఈ అవినీతి పరులు తిరిగి వస్తారా అనే అనుమానం కలుగుతోంది. వీరి వెనుక చాలా నేర చరిత్ర ఉంది. వీరు యూరప్ వెళ్లటానికి వీలు లేదని సీబీఐ చెప్పింది. వీరు యూరప్ వెళితే కోర్టును ప్రభావితం చేయగలరు. వీరేమీ అవినీతిరహితులు కారు. పెద్ద పెద్ద నేర చరిత్ర కలవారు. పెద్ద పెద్ద నేరస్థులందరూ లండన్‌లో దిగుతున్నారట. జగన్ కూడా లండన్‌కు వెళతాననడంలో అర్థమే మిటి? నేరస్థులుగా ఉండి 6 నెలలు, 3 నెలలు విదేశాలేమిటి? వారికి విదేశాల్లో ఏముందో తెలియాలి. అక్రమాస్తులేమైనా నిక్షిప్తం చేశారా? లేకపోతే ఎందుకు వీరికి యూరప్ ప్రయా ణం? యూరప్‌లో తిరగడానికి డబ్బులెక్కడివి? అని ప్రశ్నించారు.
12 ఏళ్లయినా విచారణ లేకపోవడం అనుమానంగా ఉంది
ఎన్నో కేసుల్లో ఏ1గా ఉన్న వ్యక్తి ఇప్పుడు విదేశాలకు వెళ్లడానికి అనుమతిస్తే ఆయన తిరిగి భారతదేశానికి వస్తాడన్న నమ్మకం లేదు. ఏ2గా ప్రతీ కేసులో ఏ1కు తోడు నీడగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఈ పరిస్థితుల్లో విదేశాలకు పోవడానికి కోర్టు అనుమతి ఇవ్వకూడదు. ఇస్తే తిరిగి రారు. 12 సంవత్సరాల క్రితం వీరిద్దరిరిపై సీబీఐ చార్జ్‌షీట్‌లు వేస్తే ఇంతవరకు విచారణ మొదలుపెట్టలేదు. విచారణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. మామూలు ముద్దాయిల పట్ల ఎంతో పకడ్బందీగా వ్యవహరించే న్యాయస్థానాలు, పేరు మోసిన ఈ ఇద్దరి ఆర్థిక నేరస్థుల పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారనే అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతోందని వ్యాఖ్యానించారు. జగన్‌కు బెయిల్ ఇచ్చేటప్పుడే సుప్రీంకోర్టు ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్లు ఎలా సంపాదించారని వ్యాఖ్యానించింది.. అటువం టిది ఈ కేసుల్లో విచారణ 12 ఏళ్లయినా మొదలు పెట్టకపోవడం అనుమానాలకు రేకె త్తిస్తుంది. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ముద్దాయిల వ్యవహారశైలి పట్ల, కేసుల విచారణలో జాప్యం పట్ల సమీక్ష చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ హైకోర్టు కూడా ఈ ముద్దాయిల కేసుల విచారణలో జాప్యంపై సమీక్ష చేయాలని కోరారు.
విదేశీ పర్యటనలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి
ఏ1, ఏ2లు ఎందుకు యూరప్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు? అక్కడ ఇన్ని రోజులు ఏమి చేయాలనుకుంటున్నారు? సీబీఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరారు. రూ.43 వేల కోట్లు అన్యాక్రాంతం చేశారని ఓ పక్క సీబీఐ చార్జిషీట్‌లు, మరో పక్క ప్రజాధనాన్ని కొల్ల గొట్టారని అరోపణలెదుర్కొంటున్న వీరిద్దరూ పదేపదే లండన్ ఎందుకు వెళుతున్నారో విచారణ చేయాల్సిన బాధ్యత సీబీఐ మీద ఉందన్నారు. ఇప్పటికైనా న్యాయస్థానాలు ఏ1, ఏ2 కేసులపై రోజువారీ ప్రాతిపదికన విచారణ చేపట్టి త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిజానిజాలు వెలికితీయాలని కోరారు. తొందరపడి ఏ1, ఏ2కు విదేశీ యాత్రకు అనుమ తిస్తే తిరిగొస్తారన్న గ్యారంటీ లేదు. ఈ కేసుల్లో విచారణ పూర్తయ్యేంత వరకు ముద్దాయిల కు విదేశీ యాత్రలకు అనుమతి ఇవ్వకూడదని కోరారు.