చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కోర్టులో జగన్‌ కేసుల పేపర్లు ఏమైనా తగులబడ్డాయా?

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నలు

by చైతన్యరధం
Aug 23, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కోర్టులో జగన్‌ కేసుల పేపర్లు ఏమైనా తగులబడ్డాయా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజల్లో కోర్టుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
  • 12 ఏళ్లయినా విచారణ జరపకపోవడంలో అర్థమేంటి?
  • జగన్‌రెడ్డి, విజయసాయిలకు ఎందుకు శిక్ష పడలేదు?
  • సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టీస్‌ను కోరుతున్నా…జవాబు కావాలి
  • విచారణలో జాప్యంపై సమీక్ష చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా
  • రోజువారీ విచారణ చేసి తప్పు చేశారో..లేదో తేల్చాలి
  • న్యాయస్థానాల ఉదాశీనత వల్లే బయట తిరుగుతున్నారు
  • పేరుమోసిన ఆర్థిక నేరస్థుల కేసుల్లో ఎందుకంత జాప్యం
  • ఏ1, ఏ2లకు యూరప్‌లో ఏమున్నాయని వెళుతున్నారు
  • విచారణ పూర్తయ్యే వరకు విదేశీ పర్యటనకు అనుమతివ్వొద్దు
  • వారిద్దరికీ అనుమతిస్తే తిరిగి వస్తారన్న నమ్మకం లేదు
  • పదేపదే ఎందుకు వెళుతున్నారో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి
  • అక్రమాస్తులు ఉన్నాయా?పర్యటనకు డబ్బులెక్కడివి?
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నలు

    మంగళగిరి(చైతన్యరథం): 12 ఏళ్లయినా జగన్‌ కేసులు విచారణ జరపకపోవడంలో అర్థమేంటి? జగన్‌రెడ్డి, విజయసాయిలకు ఎందుకు శిక్ష పడలేదు? కోర్టులో జగన్‌ కేసుల పేపర్లు ఏమైనా తగులబడ్డాయా? సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టీస్‌ను కోరుతున్నా…జవాబు కావాలి అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం మంగళగి రిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. సినిమా టికెట్‌ కొనడానికి డబ్బుల్లేని జీవితం గడిపిన జగన్‌, విజయసాయిలు నేడు యూరప్‌కు వెళ్లగలిగే స్థాయికి ఎలా ఎదిగారని ప్రశ్నించారు. జగన్‌, విజయసాయిరెడ్డి వంటి వారికి కోర్టులు వెసలుబాటు కల్పించడం కరెక్టు కాదన్నారు. ఏ1 ముద్దాయి జగన్‌, ఏ2 ముద్దాయి విజయసాయికి యూరప్‌లో ఏమున్నాయని పర్యటనలకు అనుమతి కోరుతున్నారు? వీరిపై విచారణ ఎందుకు జరగడం లేదు? వీరు కోర్టులకు ఎందుకు హాజరుకావడం లేదు? అని ప్రశ్నించారు. సీఎం కేజ్రీవాల్‌ సీఎం అయినా జైలులో ఉన్నాడు.. మరి జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు కేసులున్నప్పటికీ ఎందుకు బయట ఉన్నాడు? 12 ఏళ్ల పాటు జగన్‌, విజయసాయిలపై విచారణ జరపకపోవడంలో అర్థమేంటి? కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదాల నుంచి కాపాడాలని జస్టీస్‌ చంద్రచూడ్‌ను కోరుతున్నా ను. జగన్‌ కేసులో రోజువారీ విచారణ జరగాలి, జగన్‌ తప్పు చేశాడా లేదా అని త్వరితగ తిన కోర్టు తేల్చాలని విజ్ఞప్తి చేశారు.
    విదేశీ పర్యటనకు అనుమతివ్వొద్దు
    యూరప్‌ పర్యటనకు జగన్‌కు అనుమతి ఇస్తే ఇతర ముద్దాయిలు కూడా అనుమతి అడుగుతారని, అవినీతి, నేరచరిత్ర ఉన్న జగన్‌, విజయసాయిలు బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే బాధేస్తోందన్నారు. జగన్‌ విదేశాలకు వెళితే ఏం జరుగుతుందో కోర్టు పున:పరిశీలన చేయాలని, కేసుల విచారణ పూర్తయ్యే వరకు జగన్‌ విదేశాలకు వెళ్లకుండా చూడాలని కోరారు. మన దురదృష్టం వల్ల జగన్‌ మొన్నటివరకు మన రాష్ట్రానికి ముఖ్యమం త్రి. ప్రస్తుతం ఆయనకు దురదృష్టం వెంటాడి 150 సీట్ల నుంచి మధ్యలోని 5 ఎగిరిపోయి 11 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. నెత్తిన కొట్టి కూర్చోబెట్టారు. ఏ1 ముద్దాయి జగన్‌ 11 కేసుల్లో చార్జ్‌షీట్లు ఎదు ర్కొంటున్నాడు. 12 ఏళ్ల క్రితం చేసిన నేరాలు అలాగే ఉన్నాయి. ఇక ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. మంచి రికార్డులున్న వారు, పెద్దలు మాత్ర మే రాజ్యసభలో ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలా విజయసాయి ఎంపీగా ఉన్నాడు. లోక్‌సభలో పాస్‌ అయిన బిల్లులను రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభలో ఆమోదం పొందాక ఆ బిల్లులు అమలులోకి వస్తాయి. అలాంటి అత్యున్నత సభలో విజయసాయి ఉండడం బాధాకరమన్నారు. 3 సార్లు ఎంపీగా ఉండి విజయసాయి సాధించింది శూన్యమని వ్యాఖ్యానించారు.
    ఎందుకు వారికి శిక్ష పడటం లేదు?
    జగన్‌ను కోర్టులో జగన్‌.. జగన్‌.. జగన్‌ అని పిలిస్తే జగన్‌తో పాటు విజయసాయి కూడా హాజరవుతారు. రాష్ట్ర ప్రజల సొమ్ము దాదాపు రూ.43 వేల కోట్లు కొట్టేశారు. అయి నా న్యాయస్థానాల ఉదాశీనత ఎందుకు? కేసుల్లో చొరవ చూపకపోవడం ఏమిటి? కోర్టులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల 12 ఏళ్లుగా విచారణ లేకుండా ఇష్టమొచ్చి నట్లుగా తిరుగుతున్నారు. సీబీఐ వారి అవినీతిని బహిర్గతం చేసినా శిక్ష మాత్రం పడలేదు. వీరంతా ముద్దాయిలని అందరికీ తెలుసు. ఏ తప్పు చేయని పవిత్రుల్లాగా బాహ్య ప్రపంచం లో తిరుగుతుంటే బాధేస్తుంది. ఎందుకు వీరికి కోర్టులచే శిక్షపడడం లేదని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టీస్‌ చంద్రచూడ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. కోర్టులో వీరి కేసుల పేపర్లేమైనా తగులబడ్డా యా? అనే అనుమానం కలుగుతోంది. కోర్టును తప్పు పట్టడం లేదు కానీ వీరికి శిక్ష ఎందు కు పడడం లేదో నాకు సమాధానం కావాలి. తప్పు చేసి, అవినీతికి పాల్పడి ఏ విచారణ లేకుండా నిస్సిగ్గుగా, బేసిగ్గుగా జగన్‌, విజయసాయిలు తిరుగుతున్నారు. 6 నెలల పాటు యూరప్‌కు వెళ్లాలని పర్మిషన్‌ అడుగుతున్నారు. యూరప్‌ వెళితే ఈ అవినీతి పరులు తిరిగి వస్తారా అనే అనుమానం కలుగుతోంది. వీరి వెనుక చాలా నేర చరిత్ర ఉంది. వీరు యూరప్‌ వెళ్లటానికి వీలు లేదని సీబీఐ చెప్పింది. వీరు యూరప్‌ వెళితే కోర్టును ప్రభావితం చేయగలరు. వీరేమీ అవినీతిరహితులు కారు. పెద్ద పెద్ద నేర చరిత్ర కలవారు. పెద్ద పెద్ద నేరస్థులందరూ లండన్‌లో దిగుతున్నారట. జగన్‌ కూడా లండన్‌కు వెళతాననడంలో అర్థమే మిటి? నేరస్థులుగా ఉండి 6 నెలలు, 3 నెలలు విదేశాలేమిటి? వారికి విదేశాల్లో ఏముందో తెలియాలి. అక్రమాస్తులేమైనా నిక్షిప్తం చేశారా? లేకపోతే ఎందుకు వీరికి యూరప్‌ ప్రయా ణం? యూరప్‌లో తిరగడానికి డబ్బులెక్కడివి? అని ప్రశ్నించారు.
    12 ఏళ్లయినా విచారణ లేకపోవడం అనుమానంగా ఉంది
    ఎన్నో కేసుల్లో ఏ1గా ఉన్న వ్యక్తి ఇప్పుడు విదేశాలకు వెళ్లడానికి అనుమతిస్తే ఆయన తిరిగి భారతదేశానికి వస్తాడన్న నమ్మకం లేదు. ఏ2గా ప్రతీ కేసులో ఏ1కు తోడు నీడగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఈ పరిస్థితుల్లో విదేశాలకు పోవడానికి కోర్టు అనుమతి ఇవ్వకూడదు. ఇస్తే తిరిగి రారు. 12 సంవత్సరాల క్రితం వీరిద్దరిరిపై సీబీఐ చార్జ్‌షీట్‌లు వేస్తే ఇంతవరకు విచారణ మొదలుపెట్టలేదు. విచారణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. మామూలు ముద్దాయిల పట్ల ఎంతో పకడ్బందీగా వ్యవహరించే న్యాయస్థానాలు, పేరు మోసిన ఈ ఇద్దరి ఆర్థిక నేరస్థుల పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారనే అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతోందని వ్యాఖ్యానించారు. జగన్‌కు బెయిల్‌ ఇచ్చేటప్పుడే సుప్రీంకోర్టు ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్లు ఎలా సంపాదించారని వ్యాఖ్యానించింది.. అటువం టిది ఈ కేసుల్లో విచారణ 12 ఏళ్లయినా మొదలు పెట్టకపోవడం అనుమానాలకు రేకె త్తిస్తుంది. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ముద్దాయిల వ్యవహారశైలి పట్ల, కేసుల విచారణలో జాప్యం పట్ల సమీక్ష చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ హైకోర్టు కూడా ఈ ముద్దాయిల కేసుల విచారణలో జాప్యంపై సమీక్ష చేయాలని కోరారు.
    విదేశీ పర్యటనలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి
    ఏ1, ఏ2లు ఎందుకు యూరప్‌ వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు? అక్కడ ఇన్ని రోజులు ఏమి చేయాలనుకుంటున్నారు? సీబీఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరారు. రూ.43 వేల కోట్లు అన్యాక్రాంతం చేశారని ఓ పక్క సీబీఐ చార్జిషీట్‌లు, మరో పక్క ప్రజాధనాన్ని కొల్ల గొట్టారని అరోపణలెదుర్కొంటున్న వీరిద్దరూ పదేపదే లండన్‌ ఎందుకు వెళుతున్నారో విచారణ చేయాల్సిన బాధ్యత సీబీఐ మీద ఉందన్నారు. ఇప్పటికైనా న్యాయస్థానాలు ఏ1, ఏ2 కేసులపై రోజువారీ ప్రాతిపదికన విచారణ చేపట్టి త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిజానిజాలు వెలికితీయాలని కోరారు. తొందరపడి ఏ1, ఏ2కు విదేశీ యాత్రకు అనుమ తిస్తే తిరిగొస్తారన్న గ్యారంటీ లేదు. ఈ కేసుల్లో విచారణ పూర్తయ్యేంత వరకు ముద్దాయిల కు విదేశీ యాత్రలకు అనుమతి ఇవ్వకూడదని కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

Previous Post

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ‘ఆరియా గ్లోబల్‌’

Next Post

పెట్టుబడులు! ఉపాధి కల్పన!!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026

కార్యకర్త
@ August 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

కార్యకర్త
@ August 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

కార్యకర్త
@ August 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist