చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

17 ఏ పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

సీఐడీ వాదనలను సూటిగా, గట్టిగా తిప్పికొట్టిన హరీష్‌ సాల్వే

by చైతన్యరధం
October 10, 2023
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
17 ఏ పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మొదటి ఎఫ్‌ఐఆర్‌ లో చంద్రబాబు పేరు లేకపోవడంపై విస్తుపోయిన న్యాయమూర్తి
  • 17ఏ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వచ్చినా పలు ఐపీసీ కేసులు కొనసాగుతాయన్న సీఐడీ న్యాయవాది
  • కాదు.. అన్ని కేసులు ఎగిరిపోతాయన్న సాల్వే
  • ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో ముందస్తు బెయిల్‌పై  శుక్రవారం నాడు తీర్పు

 

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో అవినీతి నిరోధక సవరణ చట్టం, 2018 లోని సెక్షన్‌ 17 ఏ కింద రక్షణ లభిస్తుందా అనే అంశంపై సుప్రీం కోర్టులో 5 రోజులుగా కొనసాగిన వాద, ప్రతివాదనలు నిన్న ముగిశాయి. ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. 17 ఏ విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే జగన్‌ ప్రభుత్వం రాజకీయ కక్షతో నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసుతోపాటు ఇతర కేసులన్నీ నిరర్థకమవుతాయని న్యాయ నిపుణుల అభిప్రాయం. అందుకనే.. తీర్పు ఎప్పుడు వస్తుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

17 ఏ వేధింపుల నుండి రక్షణ కవచం

సెక్షన్‌ 17 ఏ  కక్షపూరిత కేసుల నుండి రక్షణ కల్పించే ఒక కవచం వంటిదని చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే గట్టిగా వాదించారు. ఈ సెక్షన్‌ జులై 2018లో  అవినీతి నిరోధక చట్టం సవరణ ద్వారా  వచ్చిందని, అంతకుముందు మరియు ఆ తరువాత నమోదయ్యే కేసులన్నింటికి అది వర్తిస్తుందని.. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబుకు ఈ మేరకు రక్షణ లభిస్తుందని ఆయన వివరించారు. ఈ అంశంలో సీఐడీ తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలను ఆయన సూటిగా, గట్టిగా తిప్పికొట్టారు.

సెక్షన్‌ 17 ఏ కింద కేవలం అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసులకే కాకుండా అన్ని రకాల కేసులకు వర్తిస్తుందని.. దీని ప్రకారం విచారణ చేపట్టే ముందు సంబంధిత ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని.. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు  విరుద్ధంగా వ్యవహరించిందని వివరించారు.

స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టు రూపకల్పన, అమలులో పలువురు అధికారుల పాత్ర ఉన్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. అలా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యవహరించిందో సాల్వే వివరించారు. అధికారులపై స్కిల్‌ కేసులో విచారణ చేపట్టాలనుకుంటే తప్పక గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సి వస్తుందని.. అందుకు గవర్నర్‌ అనుమతించరు కనుకనే అధికారులను తప్పించారని సాల్వే అన్నారు.

ఎన్నికల తరుణంలో కక్షపూరిత కేసులతో ప్రత్యర్థులను వేధించటాన్ని నిరోధించటానికే సెక్షన్‌ 17 ఏ ని పొందుపరచారని.. అయితే రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవటం నా హక్కు అని కొందరు ముఖ్యమంత్రులు భావిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని సాల్వే కోర్టుకు తెలిపారు.

సెక్షన్‌ 17 ఏ జులై 2018 కి ముందు నుంచి కూడా వర్తిస్తుందని చెబుతూ హరీష్‌ సాల్వే పలు సుప్రీం కోర్టు తీర్పులను ఉదహరించారు. రతన్‌ లాల్‌ కేసులో.. 17 ఏ వర్తింపు విషయంలో సందిగ్ధత ఉంటే నిందితుని యొక్క స్వేచ్ఛను రక్షించే విధంగా దానిని అన్వయించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. అలాగే ఆర్‌ ఆర్‌ కిశోర్‌ కేసులో సెక్షన్‌ 17 ఏ కేవలం అవినీతి నిరోధక కేసులకే కాకుండా అన్ని రకాల కేసులకు వర్తిస్తుందని ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ ఈ విషయంలో రోహత్గీ చేసిన వాదనను తిప్పికొట్టారు. సీఐడీ న్యాయవాది రోహత్గీ నిన్న ఒక కొత్త కోణం నుంచి వాదిస్తూ.. 17 ఏ వర్తింపు విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఎఫ్‌ఐఆర్‌ లో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో విచారణ కొనసాగవచ్చని వాదించారు.

ఏ శ్రీనివాసరెడ్డి కేసులో సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం సెక్షన్‌ 17ఏ కింద ఉన్నత అధికారుల అనుమతి తీసుకోవటం తప్పనిసరి అని స్పష్టం చేసిందని.. ఈ అంశంపై ఒకసారి చేసిన వాదనను 6 సార్లు చెప్పినా నిలబడదని సాల్వే చురక వేశారు.

సెక్షన్‌ 17 ఏ నేర విచారణ పద్ధతికి సంబంధించినది మాత్రమే కాకుండా నిందితునికి కొన్ని అదనపు ప్రయోజనాలు కలిగించే విస్తృతి పరిధిగల వ్యవస్థ కనుక ఇది 2018 తర్వాత చేపట్టే కేసులకే అన్వయిస్తుందని సీఐడీ న్యాయవాది రోహత్గీ వాదించగా.. చంద్రబాబు న్యాయవాది సాల్వే గట్టిగా ప్రతిఘటించారు. ప్రాస్పెక్టివ్‌ వర్తింపు (2018 తర్వాత అన్వయింపు) కు సంబంధించి తాము లేవనెత్తిన ఏ అంశానికి రోహత్గీ సరైన స్పందన ఇవ్వలేదని.. ఎందుకంటే ఆయన దగ్గర దానికి సమాధానం లేదని సాల్వే అన్నారు.

17 ఏ అమాయకులకు వర్తించదు, తప్పు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందన్నట్లుగా సీఐడీ న్యాయవాది వాదిస్తున్నారని సాల్వే ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబుపై మోపబడిన నేరం ఆయన అధికార విధులకు సంబంధించిందా కాదా అన్న విషయం ఏసీబీ కోర్టులో మాత్రమే తేల్చుకోవాలంటూ రోహత్గీ చేసిన వాదనలు విడ్డూరంగా ఉన్నాయని, విచారణ అనంతరం నిర్దోషిగా తేలితే ఇక గవర్నర్‌ చేసేది ఏముంటుందని, అంతకాలం తప్పు చేయనివారిని ఎలా వేధిస్తారని సాల్వే ప్రశ్నించారు.

ఎఫ్‌ఐఆర్‌ లో చంద్రబాబు పేరే లేదా అంటూ విస్తుపోయిన న్యాయమూర్తి

తమ వాదనలలో భాగంగా.. ప్రస్తుతం మనం ఒక వ్యక్తి (చంద్రబాబు)ని కాకుండా కేవలం ఎఫ్‌ఐఆర్‌ ని మాత్రమే చూడాలని రోహత్గీ వాదించగా.. అయితే ఎఫ్‌ఐఆర్‌ లో అసలు చంద్రబాబు పేరే లేదని హరీష్‌ సాల్వే తెలిపారు. ఔనా.. ఇప్పటిదాక ఎఫ్‌ఐఆర్‌ లో చంద్రబాబు పేరు ఉందనుకుంటున్నాము అంటూ న్యాయమూర్తి జస్టీస్‌ బేలా ఎం. త్రివేది వ్యాఖ్యానించగా.. ఔను ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌ లో లేదంటూ మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా ధర్మాసనానికి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన రెండు సంవత్సరాల తరువాత చంద్రబాబును 37వ నిందితునిగా చేర్చారని ఆయన వివరించారు.

అరగంట చాలని గంటన్నర వాదించిన సీఐడీ న్యాయవాది

సుప్రీం కోర్టులో గత శుక్రవారంనాడు విచారణ సందర్భంగా కోర్టు సమయం ముగుస్తున్న వేళలో మరో అరగంటపాటు తమ వాదనను వినిపిస్తానన్న సీఐడీ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ఈరోజు ఇంతకు ముందు చెప్పిందే చెబుతూ సుమారు గంటన్నర సేపు వాదించారు. ఒకదశలో హరీష్‌ సాల్వే ఇది పద్ధతి కాదంటూ అభ్యంతరం తెలిపారు. తమ వాదనలో బలం లేనప్పుడు, విచారణను పొడిగిస్తూ జైల్లో ఉన్నవారిని ఏదో విధంగా ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టటానికి న్యాయస్థానాల్లో న్యాయవాదులు అనుసరించే ప్రక్రియ ఇదని కొందరు న్యాయ నిపుణులు తెలిపారు.

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ కోరిన సాల్వే

17 ఏ అంశంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఇతర పలు ఐపీసీ కేసులు ఆయనకు వ్యతిరేకంగా కొనసాగుతాయని సీఐడీ న్యాయవాది చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాదనలు ముగింపు సమయంలో 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు దాదాపు 40 రోజులుగా జైల్లో ఉన్నారని.. ఆయన వయసు, ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని సాల్వే ధర్మాసనాన్ని కోరారు. దీనిపై సీఐడీ తరపు మరో న్యాయవాది అయిన నిరంజన్‌ రెడ్డి అభ్యంతరం తెలిపారు.

సుప్రీం తీర్పు ఎప్పుడు రావొచ్చు?

దసరా పండగ సందర్భంగా ఈ శనివారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవుదినాలు. ధర్మాసనం ఈ శుక్రవారంలోగా తీర్పు ఇస్తుందా? లేక సెలవుల అనంతరం  వెల్లడిస్తుందా అన్న చర్చ నడుస్తోంది. 17ఏ వర్తింపుపై శుక్రవారంలోగా తీర్పు ఇవ్వకుండా.. హరీష్‌ సాల్వే నిన్న కోరిన మేరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చి తుదితీర్పును సెలవుల అనంతరం వెల్లడిస్తుందా అన్న ప్రశ్నపై చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠ వీడడానికి మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పై శుక్రవారం విచారణ

ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ పై నిన్న సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు క్లుప్తంగా విచారణ జరిగింది. సమయాభావం వలన ఈ పిటిషన్‌ ను శుక్రవారంనాడు విచారిస్తామని, అప్పటి దాక చంద్రబాబును అరెస్టు చేయరాదని ధర్మాసనం తెలిపింది.

Tags: ఎఫ్‌ఐఆర్‌చంద్రబాబునాయుడుఫైబర్‌ గ్రిడ్‌ముందస్తు బెయిల్‌సీఐడీసుప్రీం కోర్టుసెక్షన్‌ 17 ఏస్కిల్‌ డెవలప్‌ మెంట్‌
Previous Post

సిఐడి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

Next Post

కొత్త అప్పులతో.. పాత అప్పులు తీరుస్తూ ఉద్యోగుల వేతనాలకు ప్రభుత్వం ఎగనామం అశోక్ బాబు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

November 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

November 14, 2026
పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

November 14, 2026
ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

November 14, 2026
ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

November 14, 2026
సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

November 14, 2026
Next Post
Ashok Babu-tdp-mlc

కొత్త అప్పులతో.. పాత అప్పులు తీరుస్తూ ఉద్యోగుల వేతనాలకు ప్రభుత్వం ఎగనామం అశోక్ బాబు

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

by కార్యకర్త
November 15, 2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

by కార్యకర్త
November 14, 2026

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

by చైతన్యరధం
November 14, 2026

ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

by చైతన్యరధం
November 14, 2026

ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.