చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీకి అథ:పాతాళమే!

‘‘జెండా’’ ఉమ్మడి సభలో పవన్‌ కళ్యాణ్‌

by చైతన్యరధం
Feb 29, 2024 at 8:09am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వైసీపీకి అథ:పాతాళమే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వామనుడిలా జగన్‌ను తొక్కేస్తాం
  • సిద్ధానికి మరిచిపోలేని యుద్ధాన్నిద్దాం
  • పొత్తు గెలవాలి- జగన్‌ పోవాలి
  • ఇదే మన ఎన్నికల నినాదం
  • సొంత కష్టంతోనే పార్టీ నడుపుతున్నా
  • నాతో నడిచేవాళ్లే.. నావాళ్లు
  • కలహించుకుంటే శత్రువుతో పోరాడలేం
  • మరోసారి జగన్‌ వస్తే సర్వనాశనమే
  • తల్లీచెల్లిని తరిమితే సైకో అనే అంటారు
  • ‘‘జెండా’’ ఉమ్మడి సభలో పవన్‌ కళ్యాణ్‌

తాడేపల్లిగూడెం (చైతన్యరథం): సిద్ధం… సిద్ధం… అంటున్న వైఎస్‌ జగన్‌రెడ్డికి 2024 ఎన్నికల్లో మరిచి పోలేని యుద్ధం ఇద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, వీటన్నింటికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. జనసేన- తెలుగు దేశం పార్టీల పొత్తు గెలివాలి… జగన్‌ పోవాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిగూడెం సమీపం లోని పత్తిపాడులో జనసేన -తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయ కేతనం ‘‘జెండా’’ భారీ బహిరంగ సభ నిర్వహించాయి. పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడు వేదికనుంచి నాయకులకు, శ్రేణులకు, ప్రజలకి అభివాదం చేసి ఇరు పార్టీల జెండాలను రెపరెపలాడిరచారు.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ `మన పోరాటానికి, విజయానికి స్ఫూర్తి జెండా. 2024 సార్వత్రిక ఎన్నిల్లో ఇరు పార్టీల పొత్తు విజ యానికి స్ఫూర్తిగా సభకు జెండా అని నామకరణం చేశాం. ఎలక్షన్‌ బూత్‌ల్లో వైసీపీ రౌడీలు, గూండాలు దౌర్జన్యాలకు పాల్పడితే ఇదే జెండా కర్రతో వాళ్లకు బుద్ధి చెప్పొచ్చు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయని,చదువులు పూర్తవ్వగానే విదేశాల్లో ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, మర్డర్లు, మానభంగాలు సినిమాల్లో తప్ప బయటెక్కడా లేవని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రోడ్లు మీద ప్రయాణించాలంటే రోజుల సమయం పడుతోంది. అందుకే ఆర్థికంగా కొంచెం కష్టమైనా హెలికాఫ్టర్లు తీసుకొచ్చి తిరుగుతున్నాం. ఓజీ పారితోషికంతో రాజకీయ సభలకు వెళ్తున్నా.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

ఆ ఐదుగురూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు..
మాట్లాడితే క్లాస్‌ వార్‌ … క్లాస్‌ వార్‌ అని మాట్లాడే జగన్‌… రాష్ట్రాన్ని ఐదుగురికి తాకట్టు పెట్టాడు. జగన్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి… వీళ్లయిదుగురు ప్రాంతా లతో సంబంధం లేకుండా పంచాయతీలు చేస్తూ కోట్లు కొల్లగొట్టి మనల్ని తిప్పలు పెడుతున్నారు. దీనిపై ఎవరైనా మాట్లాడితే వాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. వైసీపీ గూండాయిజాన్ని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక నేను, రాజకీయ ఉద్ధండు లు చంద్రబాబు ఉన్నాం. మా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలను బెదిరించినా… తెలుగుదేశం నాయకు లు, కార్యకర్తలు, మహిళలను భయపెట్టాలని చూసినా మక్కెలు విరగొట్టి మడత మంచం మీద పడుకోబెడతాం.

వామనుడిలా అథఃపాతాళానికి తొక్కుతాం
నేను తీసుకునే నిర్ణయాల్లో నా వ్యక్తిగత స్వార్థం ఉండదు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రజాకంటకుడి పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడానికే పొత్తు నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాల్లో సహకారం, సంఘర్షణ పక్కపక్కనే ఉంటాయి.2024 సహకరించాల్సిన సమయం. మనం సహకారం అందించకుంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకా రంలోకి వెళ్లిపోతుందని పవన్‌ వివరించారు. మనలో మనం కలహించుకుంటే ప్రజాకంటకుడు మళ్లీ పీట మెక్కుతాడు. చంద్రబాబులాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకు న్నామంటే దానికొక కారణముందన్నారు. చంద్రబాబు ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తి. రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలను తీసుకురాగలరు. ఆయన అనుభవం రాష్ట్రా నికి మేలు చేస్తుందని పొత్తు పెట్టుకున్నాం. పొత్తులో భాగంగా 24శాసనసభ స్థానాలు తీసుకుంటే ఇంతేనా? అని వైసీపీ వాళ్లు మాట్లాడుతున్నారు. వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే…బలి చక్రవర్తి కూడా వామనుడు మూడు అడుగులు అడిగితే ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి అథఃపాతాళానికి తొక్కితే కాని దాని లోతు ఎంతన్నది తెలియలేదు. రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా వైసీపీ వాళ్లకు మనం ఎంతన్నది తెలుస్తుంది. ఇంతింతై వటుడిరతై అన్న చందంగా వైసీపీని అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్‌ కళ్యాణ్‌ కాదు… నా పార్టీ జనసేన పార్టీ కాదు అని పవన్‌ ఉద్వేగంతో మాట్లాడారు.

రాత్రికి రాత్రే రోడ్లు వేశారు
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్క శాసనసభ స్థానం గెలిస్తేనే వైసీపీ వణికిపోయింది. రోడ్ల దుస్థితిపై రాజమండ్రి పర్యటనకు వస్తున్నానంటే 10వ తరగతి ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థిలా రాత్రికి రాత్రే రోడ్లు వేశారు. ఒక్క సీటు గెలిస్తేనే పరిస్థితి అలా ఉందంటే… రేపు 24 సీట్లు గెలిస్తే ఊహించుకోండి. వ్యూహం నాకు వదిలేయండి. జగన్‌ మాట్లాడితే నాకు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. నేను ఆయన వ్యక్తిగతం జీవితం గురించి మాట్లాడాలంటే టన్ను టన్నుల సమాచారం ఉంది. జూబ్లీహిల్స్‌ సొసైటీ పెట్టిన ప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. జగన్‌ ఇంతవరకు నా మంచితనం మాత్రమే చూశాడు. ఇక ఇప్పుడు యుద్ధం చూస్తాడు అని హెచ్చరించారు.

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిని 53 రోజులు కక్ష కట్టి వైసీపీ నాయకుడు జైల్లో నిర్భందించారు. ఆయన సతీమణిని వైసీపీ నాయకులు అనరాని మాటలన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారి సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి హత్యచేస్తే ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించు కోలేదు. అప్పుల పాలై కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఈ వైసీపీ నాయకుడు ఆదుకోలేదు. కౌలు రైతుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసంచేసిన వ్యక్తి జగన్‌. నేను వీళ్లకు ఈ రోజు నిలబడకపోతే రేపు మన నాయకులకు, జనసైని కులకు కష్టం వస్తే ఎవరూ రారు. గోబెల్స్‌ లా ప్రచారం చేసుకుంటున్న జగన్‌కు చివరకు గోబల్స్‌కు పట్టిన గతే పడుతుందని పవన్‌ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

మోడీగారు అప్పుడే చెప్పారు
జగన్‌ మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఎవరైనా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి.ఈ ముఖ్యమంత్రి రాజ ధాని వికేంద్రీకరణ చేశాడు. నేను మరోసారి ఉద్ఘాటి స్తున్నాను.ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని.2014 లో నరేంద్రమోదీయే చెప్పారు. జగన్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రాను స్కాం ఆంధ్రాగా మారుస్తాడని. ఈ రోజు రాష్ట్రాన్ని దోపీడీ ఆంధ్రాగా జగన్‌ మార్చాడని పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధిలేక వలసలు వెళ్లిపోతున్నారని, ఎంతసేపూ సంక్షేమం అందిస్తున్నాం…సంక్షేమం అంది స్తున్నాం అని మాట్లాడుతున్నారు. మీ తాత సంపాదిం చిన ముల్లె నుంచి ప్రజలకు ఇస్తున్నావా అని నిల దీశారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టి.. మీదేదో ఇచ్చినట్లు బిల్డప్‌ ఎందుకు? సీపీఎస్‌ పేరిట ప్రభుత్వ ఉద్యోగులను మోసంచేశాడు.ఇళ్లపట్టాల పేరుతో ప్రజల ను మోసం చేశాడని దుయ్యబట్టారు. యువత కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. రూ.10 వేలు చేతిలో పెట్టే ముఖ్యమంత్రి కావాలా? లేక మీరు రూ.లక్ష సం పాదించే మార్గం చూపించే ముఖ్యమంత్రి కావాలా? మీరే నిర్ణయించుకోండి. మనం చిన్న ఉద్యోగం చేయా లంటే కాండాక్ట్‌ సర్టిఫికేట్‌ కావాలి. ముఖ్యమంత్రి, గుండా ఎమ్మెల్యేలకు కాండాక్ట్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదా? మనల్ని పాలించేవాడు మనకంటే ఉన్నతంగా ఉండాలి. అంతే తప్ప దొంగల్ని, దోపిడీదారులను ఎన్నుకుంటే మనమే బాధపడాల్సి వస్తుందని పవన్‌ కల్యాణ్‌ పజలకు నచ్చజెప్పారు.

పోల్‌ మేనేజ్మెంట్‌ తెలుసా?

జనసైనికుల సిద్ధంగా ఉన్నా… ప్రజలు మన వైపు ఉన్నా… పోల్‌ మేనేజ్మెంట్‌ మనకు తెలుసా? అన్ని బూట్‌ లకు ఏజెంట్లు ఉన్నారా? అనేది మనమంతా ఆలోచించాలి. ఇదంతా అర్ధం చేసుకొనే పొత్తుకు సిద్ధ పడ్డాను. ప్రజాస్వామ్యాన్ని నెగ్గించడం కోసం కాస్త తగ్గా ను. కొంతమంది మద్దతుదారులు నా నిర్ణయాన్ని ప్రశ్ని స్తున్నారు.జగన్‌వాళ్ల బాబాయ్‌ను మర్డర్‌చేసినా… లక్షల కోట్లు దోచుకున్నా… దళితుడిని చంపి డోర్‌ డెలవరీ చేసినా వాళ్ల మద్దతుదారులు ఆయన్ను వెనకేసుకొస్తా రు. నేనుపదేళ్లలో ఎలాంటి అవినీతి చేయకపోయినా… ఇప్పటి వరకు పదవులు అనుభవించకపోయినా.. కష్టపడి సంపాదించిన సొమ్ము పార్టీ కోసం ఖర్చు చేసినా నన్ను ప్రశ్నిస్తారు. మీరు నిజంగా నా వాళ్లు అయితే నాతో నడుస్తారు. నన్ను శంకించేవాడు నా వాడు ఎప్పటికీ కాడని తెగేసి చెప్పారు.

సలహాలిచ్చేవాళ్లు కాదు… యుద్ధం చేసేవాళ్లు కావాలి
ముఖ్యమంత్రి జగన్‌లా మన దగ్గర లక్షల కోట్ల ఆస్తులు లేవు. తెలుగుదేశం పార్టీలా అనుభవం ఉన్న వ్యవస్థలు లేవు. నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఖర్చు చేసే నాయకులు లేరు. ఇటుక ఇటుక పేర్చి ఇళ్లు కడుతున్నాం. అతి త్వరలోనే కోట కడతాం. సామాన్యుడి రాజకీయం చేస్తే వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. అధికారం ఎప్పుడు వాళ్ల కోటలోనే ఉండాలనుకుంటున్నారు. మనం వ్యూహాలు వేస్తే భరించలేకపోతున్నారు. సామాన్యుడు రాజకీ యం చేస్తే ఎలా ఉంటుందో వైసీపీకి చూపిస్తాం. పొత్తులు పెట్టుకుంటాం… వైసీపీ ఫ్యాక్షన్‌ కోటలు బద్ధలు కొడతాం. నాకు సలహాలు సూచనలు అవసరం లేదు. యుద్ధం చేసే నాయకులు కావాలి. జగన్‌ దాష్టీకానికి ఎదురొడ్డి నిలబడే యువత కావాలి. నాకు సలహాలిచ్చే వాళ్లకు ఒకటే చెబుతున్నా ను. సొంత బాబాయ్‌ని హత్య చేసినవాడు.. తోడ బుట్టిన చెల్లిని గోడకేసి కొట్టినవాడితో యుద్ధం చేస్తు న్నాం. మనం యుద్ధం చేస్తేనే జగన్‌లాంటి దుర్మార్గు డు తగ్గుతాడు. యుద్ధం చేసి కూలగొడితేనే మూల కూర్చుంటాడు అని పవన్‌ ఉద్వేగంతో మాట్లాడారు.

తల్లి, చెల్లిని తరిమేసినవాడిని సైకో అనకపోతే ఏమంటారు..?
పవన్‌ కళ్యాణ్‌తో స్నేహమంటే చచ్చేవరకు… పవన్‌ కళ్యాణ్‌తో శత్రుత్వం అంటే అవతలివాడు పోయే వరకు అన్నారు పవన్‌. జగన్‌ ఇద్దరు కలిస్తే చూడలేడని, నలుగురు నవ్వుకుంటే ఓర్వలేడని, పదిమంది పచ్చగా ఉంటే భరించలేడని ఎద్దేవా చేశారు. బాబాయ్‌ను చంపి, సొంత తల్లి, చెల్లిని తరిమేసినవాడిని ఏమంటారు… దాష్టీకుడు, సైకో అంటారు. జగన్‌కు తెలిసినంత వరకు పవన్‌ కళ్యాణ్‌ అంటే మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు అని మాట్లాడతాడు. నాలుగు పెళ్లిళ్లు అని కూడా అంటాడు. నాకు నాలుగో పెళ్లి ఎప్పుడు జరిగిందో నాకే తెలియదు.

ఒకవేళ నాలుగో పెళ్లాం జగనై ఉండొచ్చు. అందుకే నాలుగో పెళ్లాం అంటూ మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. నిజానికి పవన్‌ కళ్యాణ్‌ అంటే … ఎగిరే జాతీయ జెండా, ఆంధ్ర ప్రజల భవిష్యత్తు, కన్నీళ్లు తుడిచే చేయి, పెద్దోళ్ల భుజంపై కండువా, ప్రాణాలు కాపాడే 108, ఆడబిడ్డలకు అండగా ఉండే రాఖీ… నిన్ను పాతాళానికి తొక్కే వామనుడు. తాడేపల్లిగూడెం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాను. వైసీపీ విధ్వంస పాలనకు చరమ గీతం పాడుతాం. శాంతి, సుస్థిరత ఏర్పాటు చేస్తాం. పొత్తు గెలవాలి జగన్‌ పోవాలి. వైసీపీ నేలమట్టం అవ్వాలి’’ అన్నారు పవన్‌ కల్యాణ్‌.

Previous Post

జెండాపై పవన చంద్రులు

Next Post

ఎన్నికల కురుక్షేత్రంలో అభినవ కౌరవులకు ఓటమే

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

కార్యకర్త
@ June 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026

కార్యకర్త
@ June 23, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

చైతన్యరధం
@ June 23, 2026
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం
ఆంధ్రప్రదేశ్

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

చైతన్యరధం
@ June 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026

కార్యకర్త
@ June 22, 2026
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్

‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

చైతన్యరధం
@ June 22, 2026
క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

చైతన్యరధం
@ June 22, 2026
యోగాంధ్ర 2026’కు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్

యోగాంధ్ర 2026’కు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు

చైతన్యరధం
@ June 22, 2026
Load More

ముఖ్య వార్తలు

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

చైతన్యరధం
@ June 23, 2026
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

చైతన్యరధం
@ June 23, 2026
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

చైతన్యరధం
@ June 22, 2026
క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

చైతన్యరధం
@ June 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist