- బిపి మండల్ విగ్రహ దిమ్మె కూల్చివేత
- ఆగ్రహోద్రులైన వెనుకబడినవర్గాల నేతలు
- బిసిల ఆశాజ్యోతిపై వైసిపి మూకల దాడి దుర్మార్గం
- భగ్గుమన్న టిడిపి శ్రేణులు – నిరసనగా రోడ్డుపై బైఠాయింపు
గుంటూరు : బడుగు, బలహీనవర్గాల అణచివేతే లక్ష్యంగా జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైసిపి నేతలు తెగబడుతు న్నారు. గుంటూరు అమరావతి రోడ్డు సెంటర్‌లో ఇటీవల మండల కమిషన్ మాజీ చైర్మన్ బిందేశ్వరప్రసాద్ మండల్ (బిపి మండల్) విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించి ముందస్తుగా దిమ్మెను నిర్మించారు. అయితే బుధవారం రాత్రి వైసిపి ముష్కరమూకలు మండల్ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను ధ్వంసం చేశారు. బిసిల ఆశాజ్యోతి బిపి మండల్ విగ్రహాన్ని కూల్చడం ద్వారా వైసిపి ముష్కరమూకలు బిసిలపై వారికున్న అక్కసును బహిర్గతం చేశారని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడిరది. విషయం తెలిసిన వెంటనే టిడిపి బిసి సెల్ అధ్యక్షుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర, గుంటూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో పార్టీనేతలు సంఘటన స్థలానికి చేరుకొని నల్లజెండాలతో నిరసన వ్యక్తంచేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ధ్వంసంచేసిన దిమ్మెప్రాంతంలో బిపి మండల్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశల శ్రమిం చిన యోధుడు బిపి మండల్ విగ్రహం విషయలో రాక్షసంగా ప్రవర్తించిన ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని కించ పరిచిన సీఎం డౌన్ డౌన్, జై బీసీ, జోహార్ బిపి మం డల్, బీసీల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.
బిసిల అణచివేత చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బిసి రిజర్వేషన్‌కు ఆద్యుడైన బిసి కమిషన్ మాజీ చైర్మన్ బిపి మండల్ విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తే ధ్వంసం చేయడం దారుణమన్నారు. బిసిల కోసం జీవితమంతా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలనుకుంటే ఈ ప్రభుత్వం కండకావరంతో కూల్చివేసిందని దుయ్యబట్టారు. బిపి మండల్ విగ్రహం శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన మనవడు సూరజ్ మండల్, వైసిపికి చెందిన ప్రజా ప్రతినిధులు జంగా కృష్ణమూర్తి, మేకతోటి సుచరిత, డొక్కా మాణిక్యవరప్రసాద్ హాజరయ్యారని తెలిపారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఒక జాతీయ నేతకు ఈ ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా అని ప్రశ్నిం చారు. తక్షణమే అక్కడ అన్నిఅనుమతులతో ప్రభుత్వ మే విగ్రహం ఏర్పాటుచేయాలని, లేకపోతే ఆ పని తామే చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి బిసిలను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకొని అధికారంలోకి వ చ్చాక అన్నివిధాలుగా అణగదొక్కుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చిన గత 40నెలల్లో బిసిలపై దాడులు చేస్తున్నారు. బిసి సంక్షేమ కార్యక్రమాలు నిలివేశారు, వెనుకవర్గాల అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మండల్ విగ్రహ ఫౌండేషన్ ధ్వంసానికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.