- జగన్‌రెడ్డి, సజ్జల, ఇంటెలిజెన్స్ పాత్రపై నిగ్గు తేల్చాలి
- అసలు సూత్రధారులను అరెస్టు చేయాలి
మంగళగిరి(చైతన్యరథం): అధికార మదంతోనే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లక్షలాది కార్యకర్తలు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఒక దేవాలయంగా భావిస్తారు. ఇటీవల హైదరాబాద్‌లో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడి కేసులో పాత్రధారి మాత్రమే..అసలు సూత్రధారులు ఎవరో తేల్చి వారిని త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి సీఎం జగన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు తెలియకుండానే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిం దా? అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడి చేయటం, కేసును సరిగ్గా విచారణ చేయకుండా పక్కన పడేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అ కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్టు తెలిపారు.
పార్టీ కార్యాలయంపై దాడి పెద్ద కుట్ర.. పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది.. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిని, అరెస్టు కాబోతున్న వారిని కూడా పోలీసు కస్టడీలోకి తీసుకోవాలి.. ఈ కుట్రలో అసలు సూత్రధారులు ఎవరు? దాడి చేయ మని చెప్పిన వారు ఎవరో పోలీసులు బయటకు తీయాలని కోరారు. దాడి సమయంలో అందరి చేతుల్లో బీరు బాటిళ్లు ఉండటం అ రోజు నేను చూశాను.. మందు వారికి ఎవరు పోయించారు.. ఎంత తాగకపోతే వాడు కేంద్ర కార్యాలయంపై మందు ఉండగానే బాటిళ్లు విసిరికొట్టి ఉంటారు.. డ్రగ్స్ సైతం సేవించి ఉన్నారు. అరెస్టు చేసిన వారందరికీ డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించాలని కోరారు. ఇందులో జగన్‌రెడ్డి పాత్ర ఎంత? సజ్జల పాత్ర ఏమిటి? ఇంటెలిజెన్స్ పాత్ర ఏమిటి? అనేది నిగ్గు తేల్చి కుట్ర మొత్తం బయటకుతీయాలని డిమాండ్ చేశారు.