- 3 రాజధానుల గర్జన కోర్టు తీర్పును ధిక్కరించడమే
- రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదు
- ప్రభుత్వమే ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడితే సివిల్ వారే!
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హెచ్చరిక
అమరావతి: ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ దాడిచేయడం ప్రజాస్వామ్యా నికి మంచిది కాదని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధా న కార్యదర్శి వర్ల రామయ్య పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గర్జనలు నిర్వహించడ మంటే కోర్టు తీర్పులను ధిక్కరించడమేనని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. రాజధాని రైతుల మహాపాదయాత్రకు సాక్షాత్తు హైకోర్టే అనుమతించిందని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థ అంగీకారంతో శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఆ వ్యవస్థను కించ పరచడమేనన్నారు. అమరావతి రైతులకు వ్యతిరేకం గా, మూడు రాజధానులకు మద్దతుగా ఘర్జనలు నిర్వ హించడమంటే న్యాయవ్యవస్థకు విరుద్దంగా వ్యవహ రించడమేనన్నారు. ఇది ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ దాడి చేయడమేనని, రాజ్యాంగాన్ని అవమానించడ మేనని పేర్కొన్నారు.
రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదు
రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ ఎస్ సోమయాజుల ఉన్నత ధర్మాసనం మార్చి 3, 2022న 307 పేజీల చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని వివరించారు. పేరా 17, 492, 493లలో రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదని స్పష్టంచేసినట్లు తెలిపారు.అంతేకాకుండా,రాజధానిలో భాగాలైన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ విభా గాలను మార్చే అధికారం కూడా శాసనసభకు లేదని మంగళసింగ్ వర్సెస్‌యూనియన్ ఆఫ్ ఇండియా కేసు లో అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. రాజధాని అంశం న్యాయవ్యవస్థలో ఉన్నప్పుడు కోర్టులే నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పుపై ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవాలని సూచించారు.
రైతులను టార్గెట్ చేయడం మంచిదికాదు
ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తు న్న రైతులను టార్గెట్ చేసి పోటీ సభలు, ఘర్జనలు నిర్వహించడం సమంజసం కాదని హితవుపలికారు. రెండు వర్గాల, రెండు ప్రాంతాల మధ్య ప్రభుత్వమే వైషమ్యాలను రేకెత్తించడం సరైన పద్దతి కాదన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లు మాట్లా డుతున్నారని, ముఖ్యమంత్రే వీటిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర చేస్తున్న మహిళలను మం త్రులు అనుచితంగా మాట్లాడుతూ మొగుళ్లమాట విన డం లేదని, పెళ్లాలను రోడ్లపై వదిలేశారని మాట్లాడు తుంటే జగన్‌రెడ్డి సమర్థిస్తున్నారని దుయ్యబట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా ప్రభుత్వ వ్యవ హరిస్తే సివిల్ వార్‌కి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఇప్పటికైనా మనసు మార్చుకుని ప్రభు త్వం ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టడం మానుకో వాలని హితవుపలికారు. న్యాయవ్యవస్థను గౌరవించి రాజధానిపై ప్రభుత్వానికి సమస్య ఉంటే కోర్టులలో తేల్చుకోవాలని వర్ల రామయ్య సూచించారు.