చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ దాడి మంచిది కాదు

by చైతన్యరధం
Oct 12, 2022 at 9:33am
in ఆంధ్రప్రదేశ్, పత్రికా ప్రకటనలు
ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ దాడి మంచిది కాదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 3 రాజధానుల గర్జన కోర్టు తీర్పును ధిక్కరించడమే
  • రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదు
  • ప్రభుత్వమే ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడితే సివిల్‌ వారే!
  • టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హెచ్చరిక

అమరావతి: ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ దాడిచేయడం ప్రజాస్వామ్యా నికి మంచిది కాదని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధా న కార్యదర్శి వర్ల రామయ్య పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గర్జనలు నిర్వహించడ మంటే కోర్టు తీర్పులను ధిక్కరించడమేనని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. రాజధాని రైతుల మహాపాదయాత్రకు సాక్షాత్తు హైకోర్టే అనుమతించిందని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థ అంగీకారంతో శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఆ వ్యవస్థను కించ పరచడమేనన్నారు. అమరావతి రైతులకు వ్యతిరేకం గా, మూడు రాజధానులకు మద్దతుగా ఘర్జనలు నిర్వ హించడమంటే న్యాయవ్యవస్థకు విరుద్దంగా వ్యవహ రించడమేనన్నారు. ఇది ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ దాడి చేయడమేనని, రాజ్యాంగాన్ని అవమానించడ మేనని పేర్కొన్నారు.

రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదు
రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ ఎస్‌ సోమయాజుల ఉన్నత ధర్మాసనం మార్చి 3, 2022న 307 పేజీల చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని వివరించారు. పేరా 17, 492, 493లలో రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదని స్పష్టంచేసినట్లు తెలిపారు.అంతేకాకుండా,రాజధానిలో భాగాలైన లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జుడిషియరీ విభా గాలను మార్చే అధికారం కూడా శాసనసభకు లేదని మంగళసింగ్‌ వర్సెస్‌యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు లో అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. రాజధాని అంశం న్యాయవ్యవస్థలో ఉన్నప్పుడు కోర్టులే నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పుపై ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవాలని సూచించారు.

సంబంధితవార్తలు

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

ఆ అధికారుల పరిస్థితి గుణపాఠం కావాలి: వర్ల

అడ్డగోలు నిర్మాణాలను చట్టం చూస్తూ ఊరుకోవాలా?

రైతులను టార్గెట్‌ చేయడం మంచిదికాదు
ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తు న్న రైతులను టార్గెట్‌ చేసి పోటీ సభలు, ఘర్జనలు నిర్వహించడం సమంజసం కాదని హితవుపలికారు. రెండు వర్గాల, రెండు ప్రాంతాల మధ్య ప్రభుత్వమే వైషమ్యాలను రేకెత్తించడం సరైన పద్దతి కాదన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లు మాట్లా డుతున్నారని, ముఖ్యమంత్రే వీటిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర చేస్తున్న మహిళలను మం త్రులు అనుచితంగా మాట్లాడుతూ మొగుళ్లమాట విన డం లేదని, పెళ్లాలను రోడ్లపై వదిలేశారని మాట్లాడు తుంటే జగన్‌రెడ్డి సమర్థిస్తున్నారని దుయ్యబట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా ప్రభుత్వ వ్యవ హరిస్తే సివిల్‌ వార్‌కి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఇప్పటికైనా మనసు మార్చుకుని ప్రభు త్వం ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టడం మానుకో వాలని హితవుపలికారు. న్యాయవ్యవస్థను గౌరవించి రాజధానిపై ప్రభుత్వానికి సమస్య ఉంటే కోర్టులలో తేల్చుకోవాలని వర్ల రామయ్య సూచించారు.

Tags: 3 రాజధానులుకోర్టు తీర్పుగర్జనలుజస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిజస్టిస్‌ డీవీఎస్‌ ఎస్‌ సోమయాజులుదాడిపాదయాత్రప్రజాక్షేత్రంప్రజాస్వామ్యంప్రశాంత్‌ కుమార్‌ మిశ్రారైతులువర్ల రామయ్యవ్యవస్థశాసనసభ
Previous Post

రూ.40 వేల కోట్ల విలువైన భూదోపిడీ చేసిన ఏ-2

Next Post

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అక్రమార్జన కాదు

మరిన్ని వార్తలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి
ఆంధ్రప్రదేశ్

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

చైతన్యరధం
@ May 11, 2026
విశాఖ.. ఏఐ డేటా హబ్!
ఆంధ్రప్రదేశ్

నేడు లోకేష్ సింగపూర్ పర్యటన

చైతన్యరధం
@ May 11, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist