- ఒంటరి మహిళ స్థలంపై కబ్జాదారుల కన్ను.. అడ్డుకుంటే చంపేస్తామంటూ బెదిరింపులు
- రెవెన్యూ అధికారుల మాయాజాలం.. రికార్డులు మార్చి నేషనల్ హైవే పరిహారానికి ఎసరు
- తాకట్టు పెట్టిన భూమిపై టీచర్ కన్ను.. పంట ధ్వంసం చేసి బెదిరింపులు
- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన మంత్రి ఫరూక్, పేరేపి ఈశ్వర్
మంగళగిరి(చైతన్యరథం): తనకు అప్పుగా డబ్బు ఇచ్చి భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవా రం నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఫరూక్, ఏపీ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలో సర్వే నంబర్లు 526 (1.50 ఎకరాలు), 576 (2.00 ఎకరాలు)లలో మొత్తం 3.50 ఎకరాల భూమిని తమ తండ్రి చాకలి రంగన్న 1978లో కొనుగోలు చేసి తమ ముగ్గురు సోదరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. కుటుంబ భాగ పరిష్కారాల అనంతరం ఈ భూమి పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చింది. గతంలో ఈ భూమిని కౌలుకు సాగుచేసిన వారి వారసులు కంభగౌని వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మద్దిలేటి తదితరులు పొలం గట్లు జరిపి భూమిని ఆక్రమించుకున్నారు. అనంతరం ఆ ఆక్రమిత భూమితో కలిపి పక్కనే ఉన్న తమ సొంత భూమిని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగికి చెందిన ఆళ్ల ప్రహ్లాదరెడ్డికి విక్రయించారు. 2021లో జిల్లా కలెక్టర్ కి ‘స్పందన’లో ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి 3.48 ఎకరాల భూమి తమదేనని నిర్ధారించి తమ పేరున ఆన్లైన్ రికార్డులు నమోదు చేశారు. 2022లో కుటుంబ అవసరాల నిమిత్తం రూ.5 లక్షలు అప్పుగా ప్రహ్లాదరెడ్డి వద్ద తీసుకున్న సమయంలో ఆయన ప్రామిసరీ నోటుతో పాటు ఒక ఖాళీ స్టాంప్ పేపర్‌పై సంతకం తీసుకు న్నారు. 2024 డిసెంబరులో బాకీ సొమ్మును వడ్డీతో సహా చెల్లించడానికి వెళ్లగా, ఆ డబ్బులు భూమి కొనుగోలు కోసం ఇచ్చినావంటూ బుకాయించారు. సంతకం చేసిన ఖాళీ స్టాంపు పేపర్‌ను సేల్ అగ్రిమెంట్‌గా మార్చి, తప్పుడు పత్రాలతో కోర్టును ఆశ్రయించారు. తమ పొలంలోకి వ్యవసాయం చేసుకోవడానికి వెళుతుంటే ఆళ్ల ప్రహ్లాదరెడ్డి, ఆయన అనుచరులు నన్ను చంపుతా మని బెదిరిస్తూ అడ్డుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు.
స్థలం కబ్జా యత్నం..చంపుతామని బెదిరింపులు
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుర్రంపాళెం గ్రామానికి చెందిన ఎం. అరుణాదేవి గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నంబర్ 3 పరిధిలో తమ కుటుంబానికి పూర్వీకుల నుంచి వచ్చిన ఇళ్ల స్థలం, ఇతర భూమి ఉన్నాయి. ఇది కాకుండా తమ పేరిట మరో ఎకరం పొలం కూడా ఉంది. ఇంట్లో ఆసరాగా ఎవరూ లేని ఒంటరి మహిళ కావడం చూసి ఇంటి చుట్టుపక్కల ఉండే కొందరు వ్యక్తులు ఏకమై ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అక్కడ ఉన్న బావి సమీపంలో అక్రమంగా గదులు నిర్మించాలని చూస్తుండగా అడ్డుకోబోతే “నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాం, ఎవరికి చెప్పుకున్నా మేం భయపడేది లేదు” అంటూ దారుణంగా బెదిరింపులకు దిగారు. ఇంటి ప్రహరీ గోడ నిర్మాణం కోసం సుమారు రూ. 1,00,000/-విలువైన రాళ్లను తెప్పించి ఉంచగా, వాటిని దొంగిలించి తీసుకెళ్లారు. తమ స్థలాన్ని ఆక్రమించడానికి యత్నిస్తూ అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడుతున్న వారిలో కల సుబ్బరాయుడు, జడ నాగమణి, పెద్ద చెంచయ్య, సూరి వెంకటమ్మ, స్కంధ తదితరులు ఉన్నారు. వారిపై చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
అధికారులు పరిహారం స్వాహా చేశారు
వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేటకు చెందిన ముల్లా బషీరున్ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెంబర్లు 814/1, 830లలో కలిపి మొత్తం 3.14 ఎకరాల భూమి తమ పేరిట ఉంది. సదరు భూమి మీదుగా జాతీయ రహదారి విస్తరణ జరగగా సర్వే నెంబర్ 814/1బీలో 0.89 సెంట్లు, సర్వే నెంబర్ 830/2లో 0.69 సెంట్లు కలిపి మొత్తం 1.58 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ విస్తీర్ణంలో ఉన్న 27 మామిడి చెట్లు, 4 వేప చెట్లతో పాటు బోరు, బావి, విద్యుత్ సర్వీస్ మీటర్ కూడా రోడ్డు విస్తరణ పరిధిలోకి వెళ్లాయి. రోడ్డు సేకరణ జరిగిన అనంతరం స్థానిక తహశీల్దార్ రాజాసిం హనరేంద్ర, మండల సర్వేయర్ సుబ్బన్న, గ్రామ సర్వేయర్ నరసింహ, వీఆర్వో రమణ, కొవ్వూరు మునిరెడ్డిలు కుమ్మక్కై ఆన్లైన్ రికార్డుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. తమకి సంబంధం లేని సర్వే నెంబర్ 841-2లో 3.14 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల ను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారు. భూమి, చెట్లకు సంబంధించిన నష్టపరిహారం డబ్బులకు చెక్కు వస్తుందని తొలుత అధికారులే నోటీసు ఇచ్చారు. తీరా పరిహారం మంజూరయ్యాక తమకి సమాచారం ఇవ్వకుండా తనకు అందాల్సిన పూర్తి నష్టపరిహారం డబ్బులను సదరు అధికారులు, కొవ్వూరు మునిరెడ్డి కలిసి తమ ఖాతాల్లోకి మళ్లించి స్వాహా చేశారు. వారిపై చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
భూమిని ఆక్రమించి కౌలుకు ఇచ్చారు
కర్నూలు జిల్లా మద్దికేర మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన కటింగేరి రాజు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..హంప రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 276లోని 3.20 ఎకరాల భూమిని తమ తాత కటింగేరి పక్కీరప్ప కొనుగోలు చేశారు. తాత మరణానంతరం తండ్రి కటింగేరి శ్రీరాములు ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. పంటలు సరిగా పండక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తన తండ్రి ఎం. అగ్రహారం జెడ్పీ హైస్కూల్లో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న గుంతకల్లు నివాసి ఎన్.పద్మావతి వద్ద సదరు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. ఈ విషయం కుటుంబసభ్యులకు చెప్పకుండానే తండ్రి మరణించారు. తండ్రి మరణానంతరం తల్లి లింగమ్మ, తాను వ్యవసాయం చేసుకుంటుండగా టీచర్ పద్మావతి, ఆమె భర్త ఎన్.రమేష్‌బాబు భూమి తమదంటూ అడ్డుకోవడం ప్రారంభించారు. వారు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లిస్తామని చెప్పిన ప్పటికీ వినకుండా పొలంలో వేసిన కంది పంటను పూర్తిగా నాశ నం చేశారు. అంతేకాకుండా గత రెండేళ్లుగా ఆ భూమిని హంప లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి అక్రమంగా కౌలుకు ఇచ్చారు. తమ పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే టీచర్ పద్మావతి, ఆమె భర్త రమేష్ బాబు, హంప లక్ష్మీనారాయణలు కలిసి తీవ్రంగా బెదిరిం పులకు దిగుతున్నారు. “నాపై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి, పొలం వైపు వస్తే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ లక్ష్మీనారాయణ ప్రాణ భయం కల్పిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
చెరువులను కాజేసేందుకు ప్రయత్నాలు
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడా గ్రామానికి చెందిన బిట్రా వెంకటరమణ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నంబర్లు 284/2, 282/4లలో రెండు చెరువులు ఉన్నాయి. 1993లోనే న్యాయస్థానం ఈ చెరువులపై సర్వహక్కులు తమ కుటుంబానివేనని స్పష్టమైన తీర్పునిచ్చింది. నాటి నుంచి నేటి వరకు దశాబ్దాలుగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఆ రెండు చెరువుల వివరాలను పట్టాదారు పాస్‌బుక్‌లో ఎక్కించకుండా అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. ప్రస్తుతం తన బీఎసఎఫ్ జవాన్‌గా సరిహద్దు రక్షణ విధుల్లో భాగంగా ఇంటికి దూరంగా ఉంటున్నా ను. ఇంట్లో వృద్ధురాలైన తల్లి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన కొందరు స్థానిక పెద్దలు, బయటి వ్యక్తులతో చేతులు కలిపి ఆ చెరువులను అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక రెవెన్యూ యంత్రాంగం కూడా కబ్జాదారులకే కొమ్ముకాస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరాడు.
భూమిలోకి వెళ్లకుండా బెదిరిస్తున్నారు
అనంతపురం జిల్లా కూడేరుకు చెందిన పరమేష్ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నంబర్ 246/5 లోని 4 ఎకరాల భూమిని ప్రభుత్వం 09-04-1999న ఎస్సీ మాల వర్గానికి చెందిన తన తల్లిదండ్రులు ఓబుళమ్మ, ఓబన్న పేరిట డి-పట్టాగా మంజూరు చేసింది. తల్లిదండ్రుల మరణానం తరం వారసుడైన తాను నాటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుం టూ రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాను. ఇటీవల వర్షాలు పడటంతో పంట సాగు కోసం కుటుంబసభ్యులతో కలిసి విత్తనాలు వేయడానికి వెళ్లగా, స్థానికుడైన వి.నవీన్ తన కుటుంబసభ్యులతో కలిసి పొలంలోకి చొరబడ్డారు. “ఈ భూమి మీది కాదు” అంటూ గొడవకు దిగి కులం పేరుతో తీవ్రంగా దూషించి భౌతిక దాడికి పాల్పడ్డారు. మళ్లీ పొలం వైపు వస్తే ప్రాణాలు తీస్తామంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
భూమిని ఆన్లైన్ చేయకుండా వేధింపులు
వైఎసఆర్ కడప జిల్లా ముద్దనూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. బొందలగుంట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 276/2ఎ3 (1.57 ఎకరాలు), 276/1బి (0.96 ఎకరాలు), 249-1 (2.03 ఎకరాలు), 231-12 (0.50 ఎకరాలు), 204 (1.04 ఎకరాలు)లలో మొత్తం 6.10 ఎకరాల భూమిని 2011లో (రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం. 724/2011) కొనుగోలు చేసి, నాటి నుంచి సాగు చేసుకుంటున్నాం. రాజకీయ ఒత్తిళ్లతో అప్పటి జమ్మలమడుగు ఆర్డీవో గతంలో చట్టవిరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసి తన పేరును రెవెన్యూ రికార్డుల నుంచి తొల గించారు. దీనిపై కడప జాయింట్ కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోగా, రికార్డులన్నీ పరిశీలించిన జేసీ..ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ 07-10-2025న ఆదేశాలు జారీ చేశారు. జేసీ ఉత్తర్వుల ప్రకారం భూమిని తిరిగి ఆన్లైన్ చేయాలని ముద్దనూరు తహశీల్దా ర్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు కాలయాపన చేశారు. 22-12-2025న కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా, వీఆర్వో నివేదిక సిద్ధమైనప్పటికీ డిప్యూటీ తహశీల్దార్ వరదకిషోర్ దాన్ని తొక్కిపెట్టారు. లింగాల మండలం తెరనాంపల్లికి చెందిన మలికిరెడ్డి విజయభాస్కరరెడ్డి అనే వ్యక్తితో కుమ్మక్కై, సుజిత్ సహ కారంతో రూ.2 లక్షల లంచం తీసుకుని జేసీ ఆదేశాలను తుంగ లో తొక్కారు. వారిపై చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
లంచం ఇచ్చినా పనిచేయకుండా వేధిస్తున్నారు
బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ హరి గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. సర్వే నెం. 935/2ఎలో తనకి 1.00 ఎకరం మాగాణి భూమి ఉంది. దీనిని 2006లో కొనుగోలు చేయగా, 2009లో సాధారణ పాస్‌బుక్, 2025లో తహశీల్దార్ కార్యాలయం నుంచి ఆన్లైన్ ఈ-పట్టాదారు పాస్‌బుక్ కూడా పొందాం. గత మే నెలలో కర్లపాలెం తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆనందరావు, వీఆర్వో సుభానిలు ఫోన్ చేసి “మీ పొలం సర్వే నంబర్లు తప్పు పడ్డాయి, ఓటీపీ చెబితే సరిచేస్తాం” అని చెప్పారు. తాను నేరుగా వెళ్లి తన ఆన్లైన్ పాస్‌బుక్ చూపించగా చలానా కట్టిస్తే రీ-సర్వే చేసి కొత్త పాస్‌బుక్ ఇస్తామన్నారు. సర్వే పేరిట తొలుత 2.00 ఎకరాలు ఉన్నట్లు తప్పుడు రిపోర్టు ఇచ్చి ప్రశ్నించిన తర్వాత మళ్లీ 1.00 ఎకరానికి సరిచేసి ఇచ్చారు. అనంతరం సర్వే నంబర్లు ఆన్లైన్లో సరిచేస్తామని నమ్మించి తన వద్ద నుంచి ఓటీపీ తీసుకున్నారు. ఓటీపీ తీసుకున్న వెంటనే ఆన్లై న్ రికార్డుల్లో ఉన్న డిజిటల్ సంతకాన్ని తీసివేశారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఆ భూమిని అమ్ముకునేందుకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ తీసుకున్నాను. రికార్డులు సరికాకపోవ డంతో రిజిస్ట్రేషన్ చేయలేక కొనుగోలుదారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాను. దీనిపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పం< Šన రాలేదు. పైగా వీఆర్వో సుభాని పని కావాలంటే రూ.50,000 లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆన్లైన్ పేమెంట్ (ఫోన్‌పే/గూగుల్‌పే) ద్వారా ఒకసారి రూ. 4,000, మరోసారి రూ. 6,000 కలిపి మొత్తం రూ.10,000 లంచంగా ఇచ్చాను. అయినప్పటికీ పని చేయకుం డా నెలల తరబడి వేధింపులకు గురిచేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం
నంద్యాలకు చెందిన నాగశిరోమణి గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన భర్త జగదీష్ చంద్రబోస్ 2013 జూలై 12న గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బలుసు సుబ్బమ్మ వద్ద ఒక ఎకరం పొలాన్ని కొనుగోలు చేశారు. సర్వే నంబర్ 69/1లో 0.38 సెంట్లు, సర్వే నంబర్ 69/4లో 0.62 సెంట్లు కలిపి మొత్తం ఎకరం భూమికి గాను అప్పట్లోనే రూ. 9,00,000/- పూర్తి మొత్తాన్ని చెల్లించాం. నగదు చెల్లించిన రోజు ప్రభుత్వ సెలవు దినం కావడం, అలాగే సుబ్బమ్మ మనవడు బలుసు వెంకటరమణ వివాహం ఉండటంతో వెంటనే రిజిస్ట్రేషన్ చేయించలేకపోయారు. అందుకు బదులుగా జగదీష్ పేరిట భూమి స్వాధీనపత్రం రాసిచ్చారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని నమ్మబలికారు. దాదాపు 13 ఏళ్లు గడుస్తున్నా సదరు వ్యక్తులు భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ నిలువునా మోసం చేశారు. ఈ తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేక తన భర్త జగదీష్ చంద్రబోస్‌కు కుడి భాగం మొత్తం పక్షవాతం వచ్చింది. వారిపై చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
భూమి ఆక్రమణకు యత్నం
అనంతపురం జిల్లా కాకర్లపల్లి గ్రామానికి చెందిన ఎం. నారాయణ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. రాచానపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 46/2బీ4లోని 4 ఎకరాల భూమిని ప్రభుత్వం 02-12-1993న ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన తన తండ్రి దివంగత ఓబన్న కుటుంబానికి డి-పట్టాగా మంజూరు చేసింది. నాటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ, రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబం జీవనం సాగిస్తున్నాం. ప్రక్క పొలానికి చెందిన భూస్వాములు ఇ.ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తులు దురుద్దేశంతో ఆ 4 ఎకరాల భూమిని ఆక్రమిం చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కుల అహంకారంతో తమపై దాడులకు పాల్పడుతూ, భూమిని వదులుకోవాలని వేధిస్తున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం తాము పిలిపించుకున్న పొక్లైన్ (జేసీబీ) వాహనాన్ని సైతం అడ్డుకుని పనులు చేస్తే ప్రాణాలు తీస్తామంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేశారు. వారిపై చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరాడు.














