• బద్వేలు ఎన్ జిఓ కాలనీలో పట్టణ ప్రముఖులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• పట్టణంలో గృహవినియోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి విద్యుత్ మీటర్లు ఇవ్వడం లేదు.
• డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టడం లేదు. వర్షం వచ్చినపుడు మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది.
• మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
• సీసీరోడ్ల నిర్మాణం చేపట్టలేదు, రోడ్లన్నీ గోతులమయంగా మారాయి.
• ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో బేస్మెంట్ లెవల్ లో మట్టి తోలుకునేందుకు అనుమతులు ఇవ్వడం లేదు.
• మా సమస్యలపై అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక బద్వేలు పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.
• మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేకుండా చేశారు.
• పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం చేతగాని ప్రభుత్వం, రకరకాల పన్నులతో ప్రజలను వేధిస్తోంది.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.
• పట్టణాల్లో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
• పేదల ఇళ్లకు ఉచితంగా మట్టి తోలుకునేందుకు అవకాశం కల్పిస్తాం.
• నిర్ణీత కాలవ్యవధిలో విద్యుత్ మీటర్లు అందజేసేలా చర్యలు తీసుకుంటాం.