- కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ కృష్ణయ్య
- విజయవాడ ఏపీపీసీబీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
- సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్‌కు కృతజ్ఞతలు
- అభినందనలు తెలిపిన నేతలు, టీడీపీ కార్యాలయ సిబ్బంది
మంగళగిరి(చైతన్యరథం): ఎప్పుడెప్పుడా అని టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న నామినేటె డ్ పోస్టుల భర్తీకి తొలి అడుగుపడిరది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడిన ఎందరో ఆశావాహులు కీలకమైన నామినేటెడ్ పోస్టుల ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తొలి నామినేటెడ్ పోస్టును విశ్రాంతి ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య దక్కించుకున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి రుజువు చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో చైర్మన్‌గా కృష్ణయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన కృష్ణ య్యను పార్టీ కార్యాలయ సిబ్బంది, నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.
మరిన్ని సేవలు అందించాలి
గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ తొలి నామినేటెడ్ పోస్టును బీసీలకు చంద్రబాబు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీపీసీబీ చైర్మన్‌గా కృష్ణయ్య రాష్ట్రానికి మరిన్ని విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఐఏఎస్ అధికారిగా తనకున్న అపారమైన అనుభవంతో ప్రభుత్వానికి, ప్రజలకు మరిన్ని ఉన్నతమైన సేవలు అందించాలని కాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్‌బాబు, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యా ద్రి, ప్రోగ్రాం కమిటీ ఇన్చార్జ్ నున్న రాంబాబు తదితరులు పాల్గొన్నారు.