- బీసీ నాయకత్వాన్ని తయారు చేసే ఫ్యాక్టరీ టీడీపీ
- బీసీల వల్లనే నాకింత గుర్తింపు
- జగన్ పాలనలో బాగుపడిరది ఆ నలుగురు రెడ్లే
- పన్నులతో బలహీన వర్గాలను పీడిస్తున్న వైసీపీ సర్కార్
- బటన్ నొక్కుతున్నా అంటున్నాడు.. బొక్కుడు విషయం మాత్రం చెప్పడు
- జయహో బీసీ ప్రచార రథాలను ప్రారంభించిన టీడీపీ అధినేత
అమరావతి, చైతన్యరథం: రాష్ట్రంలో పేదిరక నిర్మూ లన తన ధ్యేయమని, రానున్న 20ఏళ్లలో తెలుగు జాతి ప్రపంచంలోనే మేటిగా తయారు కావాలనే లక్ష్యంతో పీ4(పబ్లిక్, ప్రయివేట్, పీపుల్స్, పార్టిసిఫేషన్) లక్ష్యాల ను రూపొందించామని, ఈ అభివృద్ధిలో కూడా వెనక బడిన వర్గాలను ముందు వరుసలోకి తీసుకురావడమే తన మొదటి ప్రాధాన్యత అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నా రు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ వర్క్‌షాపులో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జనాభాలో సగభాగంగా ఉన్న బీసీలను అన్ని రంగాల్లోనూ వారికి సగం వాటా కల్పించేలా, ఆయా రంగాల్లో వారిని ముం దు భాగాన నిలిపేందుకు తాను బాధ్యత తీసుకుంటా నని చెప్పారు. బీసీల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావ డమే కాక వారికి రాజకీయ అధికారాలను కూడా కల్పించింది కూడా టీడీపీనేనని చెప్పారు. బీసీల నాయ కత్వాన్ని తయారు చేసే ఫ్యాక్టరీ, యూనివర్శిటీ తెలుగు దేశం పార్టీనని చెప్పారు. టీడీపీ ఏర్పాటు చేసిన నాటి నుండి బీసీలు పార్టీకి అండదండగా ఉన్నారని, ప్రాణా లను ఫణంగా పెట్టి పార్టీని రక్షించుకున్నారని, వారి రుణం తాను ఎన్నటికీ తీర్చుకోలేనని అన్నారు. తనకు ఇంత గుర్తింపు రావడానికి కూడా బీసీలే ప్రధాన కారణమని, రానున్న ఎన్నికల్లోనూ బీసీలకు వీలైనన్నీ ఎక్కువ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తానని చెప్పారు. బీసీ లకు రాజకీయ నాయకులుగా తాను అవకాశాలు ఇస్తా నని, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది బీసీ లేనని అన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి రంగంలో 50శాతం అవకాశాలను బీసీలకు కల్పిస్తా మని, అది సాధ్యం కావాలంటే బీసీల కన్సాలిడేషన్ జరగాల్సిన అవసరం ఉందని, జయహో బీసీ కార్య క్రమం ద్వారా బీసీ నేతలంతా తమ ప్రాంతాలకు వెళ్లి ఇతర బీసీలనందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు.
బీసీలపై కక్ష కట్టినట్లుగా జగన్ పాలన
జగన్ పాలనలో బీసీలకు ఎటువంటి ప్రయోజనం జరగకపోగా నష్టం జరిగింది. బీసీలపై కక్ష కట్టినట్లు వ్యవహరించారు. టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన అన్ని రకాల పథకాలను రద్దుచేశారు. జగన్ పాలనలో నలుగురు రెడ్డు మాత్రమే బాగుపడ్డారు. పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జలరామకృష్ణా రెడ్డి మాత్రమే బాగుపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సంపదకు సమానంగా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఈ అప్పు అంతా రాష్ట్ర ప్రజలే కట్టాలి. రాష్ట్ర జనాభాలో సగ భాగంగా ఉన్న బీసీలు ఈ అప్పులో సగ భాగం అంటే 6.5 లక్షల కోట్ల రూపాయ లను కట్టాల్సి ఉంటుంది. ఈ అప్పులు తీర్చేందుకు కోసమనే ఇప్పటికే ప్రజలపై మోయలేని పన్నుల భారాన్ని మోపారు. మళ్లీ జగన్‌కు అధికారాన్ని అప్పగిస్తే పన్నుల వాతలతో బలహీన వర్గాల రక్తం తాగుతాడు. అన్నింటిపైనా పన్నులు పెంచుకుంటూ పోతున్నాడు. చివరకు చెత్తపైన కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్‌రెడ్డి అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
రిజర్వేషన్ల కోతతో బీసీలకు అన్యాయం
స్థానిక సంస్థల్లో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు ఎన్టీ ఆర్ ప్రవేశపెడితే దాన్ని 34శాతానికి నేను పెంచాను.. లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 34శాతం ఉన్న రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించింది. దీంతో 16,500 మంది బీసీలు పదవులు కోల్పోయారు. వెనకబడిన వర్గాలను దేశంలో పైకి తీసుకురావడానికి ఆలోచించింది పూలే అయితే.. దాన్ని ఆచరించిన వ్యక్తి ఎన్టీఆర్. నేనొచ్చాక బీసీలను ఆర్థికంగా ఏవిధంగా పైకి తీసుకురావాలో ఆలోచించా ను. వడ్డెరలకు ఎన్టీఆర్ క్వారీలను కేటాయించారు. రజ కుల కోసం ప్రత్యేకంగా దోబీఘాట్లు కట్టించి ఆధునీ కరణకు నాంది పలికాం. బీసీలకు చేయూతనిచ్చేం దుకు సమైక్యాంధ్రలోనే ఆదరణ పథకం ప్రవేశపెట్టాం. ఆధునిక పనిముట్లు అందించాం..వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి లక్షల మందికి 90శాతం సబ్సిడీతో పరికరాలు అందించాం. 5 లక్షల మందికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాం. కానీ నాలుగున్నరేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్రంలోని 125బీసీ కులాలకు ఆర్థిక సాయం చేసింది టీడీపీనే. బీసీలకు వృత్తుల వారీగా ఇవ్వాలనుకుని తెచ్చిన పరికరాలను ఈ ప్రభుత్వం గోడౌన్లలో తుప్ప పట్టిస్తోంది. ఆదరణ పనిముట్లు మీకు ఇవ్వడానికి ఈ ముఖ్యమంత్రికి మనసు రావడం లేదు. తుప్పు పట్టించ డానికైనా సిద్ధపడ్డారు తప్పబీసీలకు ఇవ్వడానికి మాత్రం చేతులు రావడం లేదు. కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అవి నాలుక గీసు కోవడానికి కూడా పనికి రావని చంద్రబాబు విమర్శించారు.
సాధికార యాత్ర చేసే నైతిక హక్కు ఎక్కడిది?
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.37 వేల కోట్లు ఖర్చు చేశాం. ఎన్నికల ముందు జగన్ తాను అధికారం లోకి వస్తే బీసీలకు ఏడాదికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తానన్నాడు..ఒక్క రూపాయి అయినా బీసీలకు ఖర్చు చేశాడా. ఏడాదికి రూ.15 వేల కోట్లు ఇస్తానని చెప్పి, ఇవ్వకుండా సాధికార యాత్ర చేసే హక్కు ఎవరిచ్చారు. రూ.75 వేల కోట్లు బీసీలకు జగన్ అప్పు ఉన్నాడు. అవి ఖర్చు చేసిన తర్వాత ఓట్లు అడగాలి. తాను మాట తప్పననే సీఎం బీసీలకు ఎక్కడ న్యాయం చేశాడు. మన ప్రభుత్వం పెళ్లి కానుక రూ.35 వేలు ఇస్తే నేనొచ్చి రూ.50వేలు ఇస్తా అని జగన్ అన్నాడు. దాన్ని వదిలే శాడు. బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లు, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య రద్దు చేశాడు. మనం కట్టిన బీసీ భవనాలు పూర్తి చేయలేనోడు మూడు రాజధానులు కడతాడా. మూడు రాజధానుల ముచ్చట కూడా తీరిపోయింది. ఎన్‌ఎఫీబీ ద్వారా సబ్సిడీలు రద్దు చేశాడు. చంద్రన్న బీమా రద్దు చేశాడు. మత్య్సకారుల పాలిట శాపంగా 217జీవో తెచ్చి ఇష్టం వచ్చిన వాళ్లకు సొసైటీలు అంటూ చెరువు లు అప్పగించారు. మత్య్సకారులకు చేప పిల్లల పెంప కానికి అందించే సాయాన్ని సైతం విస్మరించాడని చంద్రబాబు ఆరోపించారు.
రూ.10 ఇచ్చి.. 100 కొట్టేయడం సంక్షేమమా.?
పది రూపాయలు చేతిలో పెట్టి వంద రూపాయలు దోచుకుంటూ దానకర్ణుడిలా జగన్ చంకలు గుద్దుకుం టున్నాడు. ఆదాయం పెరిగి..ఖర్చులు తగ్గించడమే సం పద సృష్టి. నేను బటన్ నొక్కుతున్నా అంటున్నాడు. బొక్కుడు విషయం మాత్రం చెప్పడు. సాయంత్రానికి తనకెంత ఆదాయంవచ్చిందో చూసుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఏం మేలు జరిగిందో ఆలోచించడు. రైతు, కార్మికుడు, నిరుద్యోగి, ఎవ్వరికైనా జగన్ పాలనలో మేలు జరిగిందా. పైగా రూ.13లక్షల కోట్లు అప్పులు చేసి కూర్చున్నాడని చంద్రబాబు తప్పుబట్టారు.
అవినీతి రెడ్ల ఎమ్యెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఎందుకు లేవు?
38 మంది ఎమ్మెల్యేలను మార్చాడంట..ట్రాన్స్‌ఫర్లు చేశాడంట. మనింట్లో చెత్త ఇక్కడ ఉండకూడదు కానీ పక్కింట్లో ఉండాలంట. మార్చిన 38 మందిలో 25 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. ఎందుకంటే వారు చులకన కాబట్టి. బియ్యపురెడ్డిని, పెద్దిరెడ్డిని, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఎందుకు మార్చలేదు.? బట్టలిప్పిన(గోరంట్ల మాధవ్) అతన్ని కూడా ఎక్కడికి పంపాడో అర్థంకాలేదు. ఒక నాయ కున్ని తయారు చేయడం కష్టం.. కానీ ఆ నాయకున్ని దీర్ఘకాలికంగా సమాజానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్ద డం పార్టీల బాధ్యత. 42ఏళ్లుగా యనమల రామకృష్ణు డు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడు తున్నా. టీడీపీలో ఎదిగిన ఎర్రన్నాయుడు కేంద్రంలో మంత్రిగా కూడా చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.
బీసీల జోలికొస్తే ఆ రోజే వారి పని పడతాం
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 300మంది బీసీలను పొట్టనబెట్టుకున్నారు. టీడీపీకి చెందిన 74 మంది బీసీ కార్యకర్తలను దారుణంగా చంపేశారు. ఒక్క పల్నాడులోనే 16 మందిని చంపారు. మాచర్లలో జై జగన్ అని అంటే వదిలేస్తామని చంద్రయ్యను బెది రిస్తే ప్రాణంపోయినా అనను అంటే గొంతుకోసి ప్రాణా లు తీశారు. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయానని బాధపడ్డా… చంద్రయ్య పాడెమోశాను. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అవినీతి, అరాచ కంపై పోరాడిన నందం సుబ్బయ్య చంపేశారు..ఆ ఎమ్మెల్యేను ఎందుకు మార్చలేదు.. ఎందుకు మార్చ లేవు. మిగతావాళ్లు అయితే మార్చేవాడు. బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం.. నా బీసీల జోలికి వస్తే ఆ రోజే వారి పనిపడతామని చంద్రబాబు హెచ్చరించారు.
జయహో బీసీ ప్రచార రథాలు ప్రారంభం
జయహో బీసీ ప్రచార రథాలను పార్టీ కార్యాల యం వద్ద జెండా ఊపి చంద్రబాబునాయుడు ప్రారం భించారు. 25 పార్లమెంట్లుకు గాను ఒక్కో పార్లమెంట్ కు 2రథాల చొప్పున ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బీసీ నేతలు పర్యటించి బీసీలకు టీడీపీ గతంలో ఏం చేసిం ది.. మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతోంది.. బీసీలకు జగన్ చేసిన అన్యాయాన్ని గురించి క్షేత్రస్థాయి లో వివరించనున్నారు. మొదట మండల స్థాయిలో మీటింగ్‌లు నిర్వహిస్తారు. టీడీపీ నేతలతోపాటు అన్ని బీసీ కులాలకు చెందిన నేతలు, బీసీల్లో పలుకుబడి కలిగిన నేతలతో సమావేశం ఏర్పాటుచేసి విషయాలను వివరిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఐదు నుండి 10వేల మంది బీసీలతో సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో బీసీ జయహో సభను నిర్వహించి బీసీ డిక్లరేషన్‌ను విడుదలచేస్తారు. 40రోజు ల పాటు బీసీ జయహో కార్యక్రమం జరగనుంది.