- చంద్రబాబుతోనే బీసీలకు మరింత అభివృద్ధి
- బీసీల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహించిన ఎన్టీఆర్
- జయహో బీసీ వర్క్‌షాపులో యనమల రామకృష్ణుడు
- చంద్రబాబుతోనే బీసీలకు మరింత అభివృద్ధి
- బీసీల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహించిన ఎన్టీఆర్
- జయహో బీసీ వర్క్‌షాపులో యనమల రామకృష్ణుడు
అమరావతి, చైతన్యరథం: టీడీపీ అవిర్భావం తర్వాత బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థి కంగా అభివృద్ధి సాధించారని, కానీ పెత్తందారీ జగన్‌రెడ్డి పాలనలో బీసీలకు ఎన్నడూ జరగనంత అన్యాయం జరుగుతోందని, జగన్‌రెడ్డిని ఓడిస్తేనే బీసీల అభ్యున్నతి సాధ్యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు,శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యన మల రామకృష్ణుడు ఉద్ఘాటించారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జయహో బీసీ వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ టీడీపీ పుట్టిందే బీసీల కోసం అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందు బీసీల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదల లేదు. టీడీపీ ఏర్పడక ముందు బీసీలు పెత్తందారీ విధానానికి లోనయ్యేవారు.
బీసీలు ఆర్థి కంగా,సామాజికంగా,రాజకీయంగా ఎదిగితే పెత్తం దారులకు రాజకీయ మనుగడ ఉండదన్న భావన ఉండేది. గతంలో బీసీలకు సంక్షేమ పథకాలు, రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండేది కాదు. ఇవన్నీ గమనించి ఎన్టీఆర్ పార్టీ పెట్టి బీసీల్ని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహించారు. బీసీల్లో నాయకత్వ లక్షణాలు తీసుకువచ్చింది ఎన్టీఆర్. నేడు బీసీల్ని చంద్రబాబు నాయుడు అన్ని విధాల ఆదుకుంటున్నారు. సమాజంలో మార్పునకు నాడు ఎన్టీఆర్ చేసిన పోరాటం వల్లే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బీసీల్లో మార్పు వచ్చింది. ఎన్టీఆర్, చంద్రబాబు, టీడీపీ వల్లే మనం తలెత్తుకుని తిరగగలుగుతున్నాం. నేడు జగన్ రెడ్డి పెత్తందారీ పాలన సాగిస్తున్నారు. పెత్తందారీ పాలనను అంతమెందించేందుకు బీసీలు నడుం బిగించాలి. సమాజంలో 50 శాతం పైగా ఉన్న జనాభాను అణిచి వేయాలని జగన్‌రెడ్డి చూస్తున్నారు.
ప్రతి సంక్షేమ పథకంలో బీసీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే. ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరగదు. జగన్ రెడ్డి స్వార్థం కోసం పనిచేస్తుంటే …చంద్రబాబు నాయుడు సమాజం కోసం పని చేస్తున్నారు. జగన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు, దోపిడి దారుడు ఈ సమాజానికి పనికిరాడు. అంబేద్కర్ రిజర్వేషన్ల వల్లే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగింది. వైసీపీ నేతలు రాష్ట్రంలో ఉన్న సంపదను దోచుకుంటున్నారు, వాటిని దోచుకోవటం వల్లే మనం పేదలుగా మిగిలిపోతున్నాం. టీడీపీ అధికారంలోకి వస్తేనే బీసీల అభివృద్ది. టీడీపీని రక్షించుకోవాల్సిన భాధ్యత బీసీలదే అని యనమల అన్నారు.