చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు తప్పు చేయలేదని నమ్మారు కాబట్టే..ప్రజాభిమానం కట్టలు తెంచుకుంది: పయ్యావుల

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై అసత్యాలు, అర్థసత్యాలతో విషప్రచారం

by చైతన్యరధం
Nov 3, 2023 at 11:18am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చంద్రబాబు తప్పు చేయలేదని నమ్మారు కాబట్టే..ప్రజాభిమానం కట్టలు తెంచుకుంది: పయ్యావుల
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై అసత్యాలు, అర్థసత్యాలతో విషప్రచారం
  • 52 రోజుల తరువాత కూడా 50 పైసల అవినీతి నిరూపించలేకపోయారు
  • రూపాయి కూడా అవినీతి జరగలేదని మేం ముందునుంచీ చెబుతున్నదే నిజం
  • తప్పు చేసిన అధికారుల్ని వదిలేసి… చంద్రబాబే అంతా చేశారనడం జగన్‌ కుట్ర రాజకీయాల్లో భాగమే
  • స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసు లోతుల్లోకి వెళ్లి న్యాయస్థానాలు విచారించిన నాడు, ఈ ప్రభుత్వం సృష్టించిన ఛార్జ్‌షీట్లు, ఎఫ్‌ఐఆర్‌లు విసిరి వీళ్ల ముఖానే కొడతాయి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు తప్పు చేయలేదనే నమ్మారు కాబట్టే ఆయనను చూసేందుకు ప్రజాభిమానం కట్టలు తెంచుకుందని టీడీపీ సీనియర్‌ నాయకుడు, శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. రాజమహేంద్ర వరం నుంచి విజయవాడకు రావడానికి 14 గంటల సమయం ఎందుకు పట్టిందో, ఎందుకంత జన సునామీ పోటెత్తిందో, ప్రజాదరణతో చంద్రబాబు వాహనశ్రేణి కదలలేక, కదలలేక ఎందుకు ముందుకు కదలాల్సి వచ్చిందో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంటిలిజెన్స్‌ వర్గాలు చెప్పలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతతో ఈ పాటికే పాలకుల్లో అడుగంటిన అరకొర విశ్వాసం కూడా చంద్రబాబుపై వెల్లువెత్తిన ప్రజాభిమానాన్ని చూశాక పూర్తిగా సన్నగిల్లే ఉంటుందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్థరాత్రి నడిరోడ్లపై లక్షలాదిమంది జనం ఎందుకు నిలబడ్డారో.. పదేళ్ల నుంచి 70 ఏళ్ల వారి వరకు ఎవరి రాకకోసం పడిగాపులు కాశారో తెలిసి.. ఏమీ తెలియదన్నట్టు.. చూడలేదన్నట్లు మాట్లాడుతున్నారంటే కచ్చితంగా సజ్జలను ప్రజలు గుడ్డివాడిగా, మతిలేనివాడిగా భావిస్తారన్నారు. ప్రభుత్వ నిఘావర్గాలు వాస్తవాల్ని కొంత తగ్గించి చెప్పినా, సగం దాచి సగమే సజ్జల కు చెప్పినా పావువంతు సమాచారం చాలు ప్రభుత్వ, పాలకుల గుండెలు జారిపోవడానికి. ప్రజాభిమానం కట్టలు తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో మొన్ననే ప్రత్యక్షంగా చూశాను. ఎక్కడైనా మా నాయకుడి వాహనం గానీ.. మా వాహనాలు గానీ నిమిషం ఆపినట్టు మీ పోలీసులు మీకు చెప్పారా సజ్జలా? మీటింగులు పెట్టామంటున్నారు…కనీసం చంద్రబాబు కారు దిగారా? అవేమీ లేవు… ఎక్కడా బండి ఆగకుండా.. అర్థరాత్రి జాతీయ రహదారిపై వాహనాలు కనీసం 20 కిలోమీటర్ల వేగంతో కూడా ముందుకు కదల్లేని పరిస్థితి రావడానికి కారణం ఏమిటో సజ్జలకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైనా.. నిజం తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా?

ఉప్పొంగిన ప్రజాభిమానానికి కారణం.. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలకు ఆయనపై నమ్మకం ఉండబట్టే. ఈ ప్రభుత్వం కావాలని అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైలుకు పంపిందని జనం నమ్మారు కాబట్టే. తెలుగురాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా దేశాల్లో చంద్రబాబుకు మద్ధతుగా నిరసనలు, ధర్నాలు కొనసాగితే.. అవన్నీ ఆర్గనైజ్డ్‌ ప్రోగ్రామ్స్‌ అని సజ్జల అవహేళన చేశారు. మరి 14 గంటలపాటు సాగిన సంఫీుభావయాత్ర ఎవరు ఆర్గనైజ్‌ చేశారో సజ్జల చెప్పాలి. రోడ్లపైనే పడుకొని..చంద్రబాబు వాహనశ్రేణి వస్తుందని తెలియగానే రోడ్లపైకి పరిగెత్తుకు వచ్చిన జనాన్ని ఏమనాలి? చంద్రబాబు వల్ల తమకు ఈ మంచి జరిగింది .. తమ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి.. తమ కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి.. తమ కుటుంబానికి మేలు జరిగిందనే నమ్మకమే ప్రజల్ని రోడ్లపైకి తీసుకొచ్చింది. రైతులు..మహిళలు.. యువత.. వృద్ధులు ఇలా అన్నివర్గాల వారి గుండెల్లోని అభిమానం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే మీరు.. మీ ప్రభుత్వ పరిస్థితి ఏమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందని పయ్యావుల అన్నారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తొలి అడుగు పడింది

14 గంటల పాటు నిర్విరామంగా ఉప్పొంగిన ప్రజాభిమానాన్ని ఎవరు ఆర్గనైజ్‌ చేశారో సజ్జలే చెప్పాలి బెయిల్‌ కు సంబంధించి సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు బెయిల్‌ పై బయట ఉన్నారు.. కేసు మెరిట్స్‌ కు సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా అంటున్నారు. నిజంగా ఆయన అన్నట్టు మెరిట్స్‌ పై న్యాయస్థానాలు దృష్టిసారిస్తే, ప్రజల ముందు మీరు.. మీ నాయకుడు నగ్నంగా నిలబడాల్సిన దుస్థితి వస్తుందని సజ్జల తెలుసుకోవాలి. అసత్యాలు. .. అర్థసత్యాలతో చంద్రబాబుని ఏ విధంగా 52 రోజులపాటు జైల్లో ఉంచారనే దానిపై న్యాయస్థానాలు మెరిట్స్‌ లోకి వెళ్తే.. మీరు.. మీ న్యాయవాదులు ఇచ్చిన పేపర్లను విసిరి మీ ముఖానే కొడతాయని తెలుసుకోండి. 52 రోజులు మా నాయకుడిని జైల్లో పెట్టి, 50 పైసల అవినీతి అయినా నిరూపించారా? చివరకు సిగ్గులేకుండా పార్టీ సభ్యత్వం పొందడానికి కార్యకర్తలు చెల్లించిన కష్టార్జితాన్ని అవినీతి సొమ్ము అంటున్నారు. మా కార్యకర్తలు కష్టపడిన సొమ్ముని పార్టీకి విరాళంగా..సభ్యత్వాల రూపంలో రాష్ట్రంలో ని పలు బ్యాంకుల ద్వారా పార్టీకి అందించారు. ఆ సొమ్ముని తప్పుడు సొమ్ముగా చిత్రీకరించడానికి దిగజారారంటేనే అర్థమవుతోంది.. చివరకు మీరు ఎంతగా బరితెగించారో అని. ప్రభుత్వాన్ని ఛాలెంజ్‌ చేస్తున్నా… స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా, మా నాయకుడికి.. మా పార్టీకి ఒక్కరూపాయి వచ్చినట్టు నిరూపించగలదా అని? తలకిందులుగా తపస్సు చేసినా మీ వల్లకాదని గుర్తుంచుకోండి. చంద్రబాబుని మీ రాజకీయ కుట్రలకు బలిచేయడానికి మీరు సృష్టించిన ఎఫ్‌ఐఆర్‌ లు.. ఛార్జ్‌ షీట్లను న్యాయస్థానాలు మీ ముఖంపైనే విసిరేసి మీకు చీవాట్లు పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది.

సీఐడీ చీఫ్‌, అడిషనల్‌ ఏజీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు పదేపదే తమ నోటికి వచ్చిన అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప.. వాస్తవాలు ప్రజల ముందు ఉంచడంలేదు . స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఒప్పందంలో ఎక్కడా 90:10 శాతం అనే విషయం పొందు పరచలేదు అంటున్నారు. డబ్బు విడుదలకు ముందే.. చాలా స్పష్టంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేవలం 10శాతం సొమ్ము మాత్రమే చెల్లిస్తుందని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ఒప్పందంలో 90 : 10 శాతానికి ఒప్పుకుంటున్నట్టు వికాశ్‌ కన్వేల్కర్‌, గంటా సుబ్బారావు, సుమన్‌ బోస్‌ సంతకాలు పెట్టారు.
అంతా అసత్య ప్రచారమే..
కేంద్రంలోని షిప్పింగ్‌ మంత్రిత్వ విభాగం కూడా సీమెన్స్‌ ఇండస్ట్రీ సాప్ట్‌ వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో 2017, సెప్టెంబర్‌ 17 న ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో కూడా 90 : 10 నిష్ప్తత్తి, నిధులకు సంబంధించి గ్రాంట్‌ ఇన్‌ కైండ్‌ ప్రతిపాదనలు ఉన్నాయ. అసలు 90 : 10 అనేదే ఎక్కడా లేదని వాదిస్తున్న వైసీపీ ప్రభుత్వం, మంత్రులు.. కేంద్ర ప్రభుత్వం సీమెన్స్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందంపై ఏం సమాధానం చెబుతారు? మిగిలిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా దీని ద్వారా లబ్దిపొందాలని, 90 : 10 నిష్పత్తిలో నిధులు వినియోగించుకోవాలని కేంద్రప్రభుత్వ కార్యదర్శే గతంలో లేఖ రాశారు. దీనిపై జగన్‌ సర్కార్‌ ఏం సమాధానం చెబుతుంది? కేంద్ర ప్రభుత్వంపై కూడా కేసు నమోదు చేయాలంటుందా?
కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని సమాచారం మొత్తం టైప్‌ చేశాక… కింద పెన్నుతో ఎప్పుడో తర్వాత సంతకం పెట్టారు. అది చాలా నార్మల్‌ గా జరిగే ప్రక్రియే. దాన్ని కూడా తప్పు పడతారా? అలా జరగగడం తప్పయితే… వైసీపీ ప్రభుత్వం లో అలాంటి డాక్యుమెంట్లు.. సంతకాలు కొన్ని వందల్లో ఉంటాయి. వాటిని ఎలా సమర్థించుకుంటారు? ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా జగన్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు.. పెట్టిన సంతకాలు కొన్ని వందల్లో ఉంటాయి. వాటిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని పయ్యావుల ప్రశ్నించారు.
గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌..గ్రాంట్‌ ఇన్‌ కైండ్‌ పదాలే తేడా.. భావం ఒక్కటే
సీమెన్స్‌ సంస్థకు ఏపీ ప్రభుత్వ ఒప్పందంతో సంబంధం లేదని ప్రభుత్వం, సీఐడీ చెబుతున్నాయి. జర్మనీలోని సీమెన్స్‌ హెడ్‌ క్వార్టర్‌ ను జగన్‌ ప్రభుత్వం సంప్రదించిందా? లేఖ రాయడం..మెయిల్‌ ద్వారా సంప్రదించడం చేసిందా? దానిపై జర్మనీ నుంచి ఈ ప్రభుత్వానికిగానీ.. సీఐడీకిగానీ సమాధానం వచ్చిందా? ఇవేమీ చేయకుండా పదేపదే ప్రభుత్వం సాక్షిపత్రిలో ప్రచురిస్తున్న లెటర్‌ ఎవరిది అంటే.. ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో సంతకం పెట్టిన ఎస్‌ఐఎస్‌డబ్ల్యు (సీమెన్స్‌ ఇండస్ట్రియల్‌ సాఫ్ట్‌ వేర్‌ లిమిటెడ్‌) వారిది. వారు ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంతో తమకు సంబంధం లేదని జగన్‌ ప్రభుత్వాకినికి చెప్పారా? జగన్‌ ప్రభుత్వం సీమెన్స్‌ ఇండస్ట్రియల్‌ సాఫ్ట్‌ వేర్‌ వారికి రాసిన లేఖలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్ధతిలో అమలుచేసే పథకం మీ వద్ద ఉందా… అని ప్రశ్నించారు. దానికి సీమెన్స్‌ సంస్థ వారు.. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అనే పద్ధతి అయితే మావద్ద లేదు గానీ.. విద్యాసంస్థలకు తాము డిస్కౌంట్‌ అందించే పథకం ఉంది.. దాన్ని గ్రాంట్‌ ఇన్‌ కైండ్‌ గా వ్యవహరిస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో కూడా గ్రాంట్‌ ఇన్‌ కైండ్‌ అనే పేర్కొంది. అదే పదాన్ని సీమెన్‌ ఇండియా సంస్థ ఇన్‌ కైండ్‌ గ్రాంట్‌ అంటే..ఏపీ ప్రభుత్వం దాన్ని గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంది. అంతే తేడా? అమెరికా వాళ్లు గతంలో భారత్‌ కు గోధుమలు.. పాలపొడి వంటి కొన్ని ఆహారపదార్థాలు పంపించి.. వాటిని గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అన్నారు. డాలర్లు పంపించామని చెప్పలేదు.. అలాంటప్పడు ఆ వచ్చినవన్నీ డబ్బుగా ఎలా పరిగణి స్తారు? వాడుక భాషలో ఒకలా.. ఒప్పంద పత్రాలపై మరోలా ఉన్నా.. భావం ఒక్కటే. అదే విషయం సీమెన్స్‌ సంస్థ కూడా చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం, ముఖ్య మంత్రి, అతని జేబు సంస్థ సీఐడీ మాత్రం అడ్డగోలుగా వాదిస్తూనే ఉన్నాయి.
గతంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుని ఈడీ దర్యా ప్తు చేసి, ఎస్‌ఐఎస్‌డబ్ల్యు పేరుతో ఎవరైతే తమకు లేఖ రాశారని ఈ ప్రభుత్వం చెబుతోందో…అతను రాసిన దానిలోనే ఎస్‌ఐఎస్‌డబ్ల్యు రూ.1289,45, 31,753లు విలువైన పరికరాలు..సాఫ్ట్‌వేర్‌ను పలానా ఇన్‌వాయిస్‌ ద్వారా రూ.35 కోట్లకు అందించామని చాలా స్పష్టంగా పేర్కొన్నాడని తెలిపింది. చాలా స్పష్టంగా తమ లేఖలో సీమెన్స్‌ సంస్థే రూ.1289కోట్ల విలువైన సాఫ్ట్‌ వేర్‌ను ఏపీ ప్రభుత్వానికి రూ.35కోట్లకే అందించామని. మొత్తం స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్ట్‌లో సీమెన్స్‌ ఒప్పందమనేది కేవలం ఒక కాంపోనెంట్‌ మాత్రమేనని తెలిపిందని పయ్యావుల వివరించారు.
చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు తప్పెలా అవుతాయి?
తెలుగుదేశం పార్టీ 2014లో తన మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగమిత్ర అనే పథకానికి సంబంధించి, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రప్రభుత్వం అమలుచేసిన స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్ట్‌ విధానంలోనే తమ ప్రభుత్వానికి కూడా ఒక విధానం అమలు చేయాలని కోరారు. ప్రాజెక్ట్‌ ను త్వరితగతిన ఏర్పాటు చేయడానికి నాటి ముఖ్యమంత్రి వెంటనే జరిగేలా చూడండి అంటే.. దాన్ని తప్పు పడతారా? ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న 8 నెలలకు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ రాష్ట్రంలో ఏర్పాటైతే.. 18 నెలలకు ప్రభుత్వం వద్ద నుంచి డబ్బులు విడుదలయ్యాయి. అయినా నాటి ప్రభుత్వం హడావిడిగా చేసిందని.. వాళ్లపై గన్నుపెట్టింది..వీళ్లపై కత్తి పెట్టిందని. అధికారులను ఒత్తిడి చేసి నిధులు విడుదల చేయించిందని ఎలా ప్రచారం చేస్తారని పయ్యావుల విమర్శించారు.
కేబినెట్‌ అనుమతి పొందకపోతే దానికి ముఖ్యమంత్రి బాధ్యుడు అవుతారా, అధికారులా?
స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కేబినెట్‌ అనుమతి పొందలేదు అంటున్నారు…దానిలో తప్పెవరిది. నాటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారి నీలంసహాని ద్వారా వెళ్లిన నోట్‌ ఫైల్లో ఏముంది? ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు అలస్యమైంది.. ముందు జీవో ఇవ్వండి.. తర్వాత ప్రపోజల్‌ పెట్టండి అని ఉంది. అదే ఫైల్‌ తర్వాత అధికారులు ప్రేమచంద్రారెడ్డికి.. అజయ్‌ కల్లంరెడ్డికి కూడా వెళ్లింది. వారు ఆ ఫైల్‌ ను కేబినెట్‌ అనమతి కోసం పంపకపోతే.. దానికి నాటి ముఖ్యమంత్రి బాధ్యుడు అవుతాడా? అదే నిజమైతే నోట్‌ ఫైల్‌ పై తమ అభిప్రాయాలు రాసిన ముగ్గురు ఐ.ఏ.ఎస్‌ అధికారులపై జగన్‌ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు….విచారించలేదని పయ్యావుల ప్రశ్నించారు.
మొత్తం వ్యవహారమంతా చీకట్లో జరిగిందని ఎలా చెబుతారు?
ముఖ్యమంత్రికి, కేబినెట్‌కు సీమెన్స్‌.. డిజైన్‌ టెక్‌ సంస్థలు పూర్తి ప్రజంటేషన్‌ ఇచ్చాకే.. మొత్తం ప్రాజెక్ట్‌కు రూ.3,300కోట్లకు నాటి కేబినెట్‌ అనుమతి ఇచ్చింది. ఈ విషయం కూడా నోట్‌ ఫైల్‌ లో చాలా క్లియర్‌ గా ఉందని కేశవ్‌ చెప్పారు.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 13 సంతకాలు పెట్టారు అంటున్నారు..
చంద్రబాబు.. ఈ గంటలో, ఇప్పుడే డబ్బు విడుదల చేయమని సంతకాలు పెట్టారా? ఎస్‌ఎస్‌డీసీ (స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌) ఏర్పాటు చేయమని ఒక సారి సంతకం పెట్టారు. దానికి సంబంధించిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌.. ఇతర కమిటీల ఏర్పాటును ఆమోదిస్తూ మరో సంతకం పెట్టారు. తరువాత దాన్ని అప్రూవ్‌ చేస్తూ మరో సంతకం.. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ను అప్రూవ్‌ చేస్తూ మరో సంతకం పెట్టారు. ఆ బోర్డ్‌ కు చైర్మన్‌ జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గ్రంథి మల్లిఖార్జున రావు..మరో వ్యక్తి శ్రీనిరాజు కీలక సభ్యులుగా వ్యవ హరించారు. నిజంగా డబ్బులు కొట్టేయాలని చంద్ర బాబుకు ఉంటే బయటివాళ్లను ఎందుకు పెడతారు? బడ్జెట్‌ అప్రూవల్‌ చేస్తూ.. సుబ్బారావుని స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అపాయింట్‌ చేస్తూ మరో సంతకం పెట్టారు. మంత్రివర్గం తీర్మానం పై మరోసారి సంతకం పెట్టారు. అపర్ణ అనే ఆమె అపాయింట్‌ మెంట్‌కు సంబంధించిన ఫైల్‌ ర్యాటిఫికేషన్‌ నోటిఫికేషన్‌ కోసం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లినప్పుడు మరోసంతకం పెట్టారు? అకడమిక్‌ సెంటర్లకు.. క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి సంతకాలు పెట్టారు. అవన్నీ రొటీన్‌గా.. ప్రాసెస్‌ ప్రకారమే జరిగేవి. వాటిని ఎలా తప్పుపడతారు? ఇదే విషయం న్యాయస్థానాల్లో చెబితే సంతకాలు ఎలా పెట్టాలో చెప్పండి అంటూ జగన్‌ ప్రభుత్వాన్నే నిలదీస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఐటీడీ వాల్యుయేషన్‌కు సంబంధించి తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నానని ప్రేమచంద్రారెడ్డే స్వయంగా గతంలో ఈడీ విచారణలో చెప్పారు.

Tags: అడిషనల్‌ ఏజీగ్రంథి మల్లిఖార్జున రావుచంద్రబాబునాయుడుచైర్మన్‌ జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌జగన్‌ కుట్ర రాజకీయాలుపయ్యావుల కేశవ్‌ప్రభుత్వ సలహాదారు సజ్జలవిషప్రచారంసీఐడీ చీఫ్‌స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసుస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు
Previous Post

మద్యం, ఇసుక దందాలపై టీడీపీ పోరాడుతుంటే.. ఆ అంశాలపైనే చంద్రబాబుపై కేసులా: సోమిరెడ్డి

Next Post

అక్రమ కేసులతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి చలికాచుకోవాడానికి కుట్రలు చేస్తున్న సైకో జగన్.

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

కార్యకర్త
@ August 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

కార్యకర్త
@ August 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist