అమరావతి, చైతన్యరథం: దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో సంక్షేమ పథకాలకు ఎన్టీయాయర్ ఆధ్యుడని పేర్కొన్నారు. ఈ మేరుకు ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖా మంత్రి అమిత్ షాకు సోమవారం లేఖలు రాశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి అత్యున్నత పురస్కారమైన భారత రత్న ప్రకటించిన సంగతి తెలిసిందే.