- టిడిపి ముప్పెేట దాడితో స్తంబించిన అసెంబ్లీ, శాసన మండలి
- జాబ్ రావాలంటే జగన్ పోవాలంటూ సభ్యుల నినాదాలు
- సిఎం, స్పీకర్‌తో సహా అధికారపక్షం ఎదురు దాడి
- వ్యూహాత్మక ఆందోళనతో అధికారపార్టీకి చుక్కలు
- టిడిపి ఎమ్మెల్యేలు ఒక రోజు సస్పెన్షన్
అమరావతి : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలిరోజైన గురువారం ఉభయసభల్లో టిడిపి సభ్యుల వ్యూహాత్మక ఎత్తు గడకు అధికారపార్టీ చిత్తయింది. జాబ్ రావాలంటే జగన్ పోవాలనే నినాదంతో టిడిపి సభ్యులు ఉభయసభలను హోరెత్తించారు.కీలకమైన అధికార వికేంద్రీకరణపై చర్చ సమయంలో టిడిపి సభ్యుడు కేశవ్‌కు అవకాశం ఇవ్వక పోవడంతో దేశం సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో టిడిపి సభ్యులను ఒకరోజు శాసనసభనుంచి సస్పెండ్ చేస్తూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించగా, స్పీకర్ ఆమోదించారు. టీడీపీనేతలు వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీ కి బయలు దేరారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి కాలినడకన నిరసన ర్యాలీగా వెళ్లిన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాబ్‌ఎక్కడ జగన్‌రెడ్డి అంటూ నినాదాలతో పాదయాత్ర చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం 9గంటల కు సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో నిరుద్యోగంపై చర్చ జరపాలంటూ టిడిపిసభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోతే ప్రకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ పోడియం చుట్టుమట్టారు. టిడిపి సభ్యుల ఆందోళనల నడుమే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగిం చారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగింది. విషయంలో మంత్రి సమాధానం చెపుతున్నప్పుడు టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగిస్తుండగా రెచ్చిపోయిన మంత్రి మేరుగ నాగార్జున.. టిడిపి సభ్యుడు బాల వీరాంజనేయస్వా మిని ఉద్దేశించి మాట్లాడుతూ నువ్వు దళితుడివైతే, దళితులకు పుడితే చంద్రబాబు బంథనాల నుంచి బయటకురా అంటూ తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు.నాగార్జున అనుచి త వ్యాఖ్యలు చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. టీ విరామ సమయం తర్వాత సభ ప్రారంభమైంది. అంతకుముందు స్పీకర్ చాంబర్ బిఎసి సమావేశం నిర్వహించగా.. టిడిపి తరపున అచ్చెన్నా యుడు హాజరయ్యారు. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఎసి నిర్ణయించింది. తర్వాత మధ్యాహ్నం 12.30గంటలపై అధికార వికేం ద్రీకరణ పేరుతో స్వల్పకాలిక చర్చను అధికారపార్టీ ప్రతిపాదించగా, స్పీకర్ ఆమోదించా రు.మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభమైన స్వల్పకాలిక చర్చ సాయంత్రం 5.30కి సిఎం ప్రసంగం ముగిసేవరకు సుదీర్ఘంగా కొనసాగింది. టిడిపి సభ్యులు నిమ్మల రామా నాయుడు, పయ్యావుల కేశవ్‌కు కొద్దిసేపు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన స్పీకర్.. తన కుటుంబంపై చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు నిరాకరించడంతో సభలో మరోమారు నిరసన చేపట్టారు. కేశవ్ కు అవకాశం ఇవ్వాలంటూ సభ్యులు పట్టుబట్టడంతో ఆర్థికమంత్రి బుగ్గన టిడిపిసభ్యుల సస్పెన్షన్ కు ప్రతిపాదించగా, స్పీకర్ ఆమోదించారు. టిడిపి సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీ సుమారు 2 గంటలపాటు ఏకపక్షంగాసాగింది. శాసనమండలిలో సైతం టిడిపి సభ్యుల ఆందోళనల నడుమ మధ్యాహ్నానికే మండలిచైర్మన్ మోషేన్‌రాజు సభను వాయిదావేశారు.