- నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారు.. ఉన్నవారన్నా జాగ్రత్తపడాలి
- మూడు రాజధానులన్నారు, మూడు అంగుళాలు కూడా ముందుకు పోలేదు
- తండ్రి ఆత్మగా పిలవబడే కేవీపీ రామచంద్ర, సూరీడు, తదితరులు ఇప్పుడు ఎక్కడున్నారు
- వైఎస్‌ను చంపించింది రిలయన్స్ అన్నారు.. వాళ్లకే రాజ్యసభ సీటు ఇచ్చారు
- నమ్మి ఓట్లేసిన దళితులు, మైనారిటీలను నిలువునా ముంచేశారు
- ద్రోహం, దగాలకు మనిషి రూపం వేస్తే అది జగన్మోహన్ రెడ్డి
అమరావతి: జగన్ నమ్మకద్రోహానికి హద్దులనేవి లేవని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. జగన్ అడ్డగోలు నిర్ణయాలను నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారని, ఉన్నవారన్నా జాగ్రత్తపడాలని వైసీపీ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆనంద్ బాబు మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికి హద్దులు, అవధులుంటాయి ఉంగాయిగానీ జగన్ నమ్మకద్రోహానికి మాత్రం ఏ హద్దులు లేవన్నారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నైజం. ద్రోహం, దగాలకు మనిషి రూపం వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అని అందరూ అంటున్నారు. ఈయన చేసే అరాచకాలు, ఆకృత్యాలు ప్రతిరోజు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వాడుకొని వదిలేయడం జగన్ నైజం. తన సొంత ప్రయోజనాల కోసం ఎంతటివారినైనా బలిగొనడం ఆయన పని. జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే జగన్ కు విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియదు. ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలను అడ్డగోలుగా వంచించాడు. కడప, పులివెందులలో పార్టీ మీటింగ్ లు పెడితే వారు కూడా ఛీత్కరించే పరిస్థితులు. జగన్ సమావేశాలంటేనే జనం బెంబేలెత్తుతూ, ఛీత్కరించుకుంటున్నారు. రేపు ఓట్లు అడగడానికి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారో అర్థం కావడంలేదు. వైఎస్‌ఆర్ మృతికి అంబానీయే కారణమని చెప్పి రిలయన్స్ మాల్ లు, పెట్రోల్ బంక్ లు, వారి సంస్థలపై దాడులు చేయించారు. అధికారంలోకి రాగానే రిలయన్స్ కు చెందిన వ్యక్తి పరిమళ నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎత్తుకొని పెంచిన చిన్నాన్న పట్ల జగన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. సొంత బాబాయి హత్య కేసు ముద్దాయిలను రక్షిస్తున్నాడు. వివేకా కుమార్తె సునీత తమకు రక్షణ కావాలని వాపోయింది. వారిపైన కూడా కేసులు పెట్టి వేధించాడు. జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిలకు అన్యాయం చేశాడు. రాష్ట్ర ప్రజలకే కాదు కుటుంబ సభ్యులకు కూడా ఆయన అంటే భయమని ఆనంద్ బాబు అన్నారు. అనేకమంది ఎమ్మెల్యేలు ఈయనను నమ్మి మోసపోయామని అనుకుంటున్నారు. ఎంతమందిని ఉన్న సీటు నుంచి బదిలీ చేయబోతున్నాడో తెలియదు. రాజకీయాలకు అర్థాలే మార్చేశాడు. నమ్మి ఓట్లేసిన దళితులు, మైనార్టీల్ని నట్టేట ముంచాడు.
మూడు రాజధానుల పేరుతో మోసం
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్‌రెడ్డి మోసం చేస్తున్నాడు. ఇప్పటికీ టీడీపీ నిర్మించిన భవనాల నుండే జగన్ పరిపాలన చేస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వం పరిపాలన సాగించే సెక్రటేరియేట్ కట్టింది టీడీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే 3 వేలు పింఛన్ ఇస్తానని చెప్పి నాలుగేళ్ల తరువాత ఐదేళ్లకు ఇవ్వబోతున్నావు. ఇది మోసం, దగా, వంచన అని ఆనంద్ బాబు విమర్శించారు.
గతంలో ఐఏఎస్ లే అరెస్టు అయ్యారు.. రాబోయే రోజుల్లో ఐపీఎస్ లు కూడా
జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని శ్రీలక్ష్మి, రాజగోపాల్, ఆచార్య లాంటి అనేకమంది ఐఏఎస్ లు జైళ్లకు వెళ్లారు. జైలుకు వెళ్లకుండా కేసులు ఎదుర్కొన్నవారు ఐదారుగురు ఉన్నారు. ఆనాడు ఐఏఎస్ లే ఉన్నారు. రేపు జైలుకెళ్లేవారిలో ఐపీఎస్ లు కూడా అత్యధికంగా ఉండబోతున్నారని గుర్తు పెట్టుకోవాలి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా రూ. 43 వేల కోట్లు దోచేశారు. 16 నెలలు జైల్లో ఉన్నారు. ప్రభుత్వంలో ఏ ఫైలు కూడా కరెక్టుగా నడవడంలేదు. నేడు అధికారం చెలాయించే ముఖ్యమంత్రి ఎటుపోతాడో తెలియదు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతోంది. ఇది నూటికి నూరు శాతం యదార్థం. అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని నమ్మినవారిని మోసం చేసిన విషయాన్ని వున్నవారన్నా తెలుసుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సూచించారు.
వాడుకుని వదిలేయడం జగన్ రెడ్డి నైజం. తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం అతని లక్షణం. చెప్పేదొకటి, చేసేదొకటి. విశ్వసనీయత లేని వ్యక్తి జగన్ రెడ్డి అని 57 నెలల పాలనలో ప్రజలకు స్పష్టమైంది. జగన్ నమ్మకద్రోహాలను ఆనంద్‌బాబు వివరించారు.
- ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజలకు నమ్మకద్రోహం చేశారు
- ఎత్తుకొని పెంచిన చిన్నాన్నను కిరాతకంగా హత్యచేసిన నేరస్థుల్ని కాపాడుతున్నాడు.
- ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన కడప ప్రజల్ని మోసం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ లేదు. అన్నమయ్య డ్యాం బాధితుల్ని నట్టేట ముంచాడు.
- కృష్ణా, తుంగభద్ర జలాలపై హక్కుల్ని ధారాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేశాడు.
- తల్లి, చెల్లికి ద్రోహం చేశాడు.
- తండ్రికి ‘ఆత్మ’గా పేరుబడ్డ కేవీపీ రామచంద్రరావు, నీడగా ఉన్న సూర్యుడు నేడు జగన్ వెంట లేకపోవటానికి కారణం ఆయన నైజమే.
- నమ్ముకున్న జైలుమేట్‌కి అన్యాయం చేశాడు.
- నమ్మిన ఎమ్మెల్యేలకు ద్రోహం చేశాడు
- నమ్మి ఓట్లేసిన దళితులు, మైనార్టీలకు ద్రోహం చేసి సిటిజన్ ఎమెండ్‌మెంట్ బిల్ల్లుకు పార్లమెంట్ లో ఓటు వేశాడు
- వాలంటీర్లను మోసం చేశాడు
- సీపీఎస్ రద్దు హామీపై ఉద్యోగుల్ని మోసం చేశాడు
- మద్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానని నమ్మబలికి మద్యం ఆదాయాన్ని బ్యాంకులకు తాకట్టు పెట్టాడు.
- నాసిరకం మద్యం పోసి మహిళల మాంగల్యాలు తెంచుతున్నాడు
- అమరావతి రాజధానిని మార్చబోనని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని నమ్మించి మోసం చేశాడు
- రైతు భరోసా కింద మే నెలలోనే ఒకేసారి రూ.12,500 ఇస్తామని చెప్పి ద్రోహానికి పాల్పడ్డాడు.
- విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి రూ.64 వేల కోట్ల విద్యుత్ భారాలు మోపారు. కరెంట్ కోతలు పెట్టారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించారు. 120 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. 14 లక్షల ఎకరాల అసైన్‌మెంట్ భూములు కబ్జా చేశారు. బ్యాక్ లాగ్ పోస్టులు 1.40 లక్షలు భర్తీ చేయకుండా సామాజిక న్యాయం గొంతు కోశాడు.
- ఏటా జాబ్ కేలండర్ ఇస్తానని, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేశారు
- సీబీఐ జగన్ రెడ్డిపై నమోదు చేసిన 11 ఛార్జిషీట్లలో తన సహ నిందితుడిగా మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. అలాంటి మోపిదేవిని రేపల్లె నియోజకవర్గ ఇంఛార్జ్ గా తప్పించి నమ్మకద్రోహానికి పాల్పడ్డారు.
- రాజధాని అమరావతిపై కేసులు వేయడంతో పాటు.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్థుడిగా, అనుచరుడిగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయంలోనూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు.
- చివరకు ప్రశాంత్ కిషోర్ నమ్మకాన్ని కూడా కోల్పోయిన నీకు విశ్వసనీయత లేదు. అందుకే నిన్ను జనం నమ్మక ద్రోహి అంటున్నారు.