- ఎంవోయూలను పెట్టుబడులుగా మలిచేలా కార్యాచరణ
- త్వరలోనే పారిశ్రామిక ప్రోత్సాహకాల ఎస్క్రో ఖాతా
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని మరువలేం
- ‘సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026’ కర్టెన్ రైజర్ ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు దేశంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘బిల్డ్ ఏపీ’ నినాదంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేవలం ఎంవోయూలకే పరిమితం కాకుండా వాటిని వాస్తవ పెట్టుబడులుగా మలచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని స్పష్టం చేశారు. గతంలో ప్రకటించినట్టుగా పారిశ్రామిక ప్రోత్సాహకాల ఎస్క్రో ఖాతాను ఈ ఏడాది నవంబరు 12, 13 తేదీల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న సాయాన్ని మరువలేమన్నారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ఏ విధానాన్నైనా తక్షణం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సౌత్ ఈస్ట్ ఏషియాకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చడమే తమ లక్ష్యమన్నారు.
న్యూఢిల్లీ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు దేశంలోనే అత్యుత్తమ గమ్య స్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘బిల్డ్ ఏపీ’ నినాదంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, కేంద్రం అందిస్తున్న సహకారం, వివిధ రంగాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణను పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వివరించారు. గత ఏడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.13.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని చంద్రబాబు తెలిపారు. గడిచిన 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగామని చెప్పారు. కేవలం ఎంవోయూలకే పరిమితం కాకుండా వాటిని వాస్తవ పెట్టుబడులుగా మలిచేలా ప్రత్యేకంగా దృష్టి సారించామని స్పష్టం చేశారు. గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీకి వస్తున్నాయని తెలిపారు. గతంలో ప్రకటించినట్టుగా పారిశ్రామిక ప్రోత్సాహకాల ఎస్రో ఖాతాను ఈ ఏడాది నవంబరు 12, 13 తేదీల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న నాలా చట్టాన్ని రద్దు చేశామని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ఏ విధానాన్నైనా తక్షణం అమలు చేయడా నికి ఏపీ సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేలా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
నీటి వనరులు… గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి
గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి సదులను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీటి కొరత ఉండదని చంద్రబాబు అన్నారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సౌత్ ఈస్ట్ ఏషియాకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చడమే తమ లక్ష్యమన్నారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో ఇప్పటికే 110 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కారిడార్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ ముందుకు వచ్చిందని, మచిలీపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు గోవా షిప్ యార్డ్ సంస్థ అంగీకరించిందని వెల్లడించారు. తిరుపతి, లేపాక్షి, కొప్పర్తిలో డ్రోన్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. రాయలసీమలో ఐదో తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టును రక్షణ శాఖ ప్రారంభించిందని తెలిపారు. డేటా లేక్ వంటి వ్యవస్థల ద్వారా ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. జీఎస్టీ పన్నుల వసూళ్లలో ఏఐ ఆధారిత సాంకేతికతను అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఏఐతో పాటు పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో రాణించేలా ఉండదని చంద్రబాబు అన్నారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సౌత్ ఈస్ట్ ఏషియాకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చడమే తమ లక్ష్యమన్నారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో ఇప్పటికే 110 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కారిడార్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ ముందుకు వచ్చిందని, మచిలీపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు గోవా షిప్ యార్డ్ సంస్థ అంగీకరించిందని వెల్లడించారు. తిరుపతి, లేపాక్షి, కొప్పర్తిలో డ్రోన్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. రాయలసీమలో ఐదో తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టును రక్షణ శాఖ ప్రారంభించిందని తెలిపారు. డేటా లేక్ వంటి వ్యవస్థల ద్వారా ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.
జీఎస్టీ పన్నుల వసూళ్లలో ఏఐ ఆధారిత సాంకేతికతను అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఏఐతో పాటు పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో రాణించేలా వసతులను తీసుకురావడంలో ప్రధాని కీలక పాత్ర పోషించారని చెప్పారు. అత్యద్భుతమైన రహదారి నెట్వర్క్ భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని, రైల్వే నెట్వర్క్ నూ కీలక స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, రోడ్లతో బలమైన మౌలిక వసతులను దేశంలో ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రక్షణ రంగంలోనూ అత్యంత భద్రమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర విశేషమని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయులు ముందున్నారని, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చేయూత అందించడంలో కేంద్రం, ప్రధాని మోదీ ముందున్నారన్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తోందని చెప్పారు. విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి వివరించారు.
















