అమరావతి: రాష్ట్రంలో జగన్‌రెడ్డి కసాయి ప్రభుత్వా నికి ప్రస్తుత కరువు పరిస్థితులు కానీ, రైతుల దుస్థితి కానీ పట్టకపోవటం దురదృష్టకరమని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమ ర్శించారు. ఈసంవత్సరం రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు వేయకపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. రైతాంగం విషయంలో పాలకుల వైఖరి చాలా దారుణంగా ఉందన్నారు. దుర్భిక్ష పరి స్థితులపై కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్‌కు సంబంధించి ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లోని వర్షాభావ పరిస్థితి.. సాగునీరు.. విద్యుత్.. వేసిన పంటలపై సమీక్షించాలి. కానీ జగన్ సర్కార్ మొత్తం వ్యవసాయ రంగాన్నే గాలికి వదిలేసిందని ధూళిపాళ్ల తప్పుబట్టారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు రైతుల్ని ఆదుకోవడానికి అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడమే మర్చిపోయింది.ఒక్కమాట చెప్పాలంటే వ్యవసాయశాఖ రాష్ట్రంలో చచ్చిపోయిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి అనే పదవిపై వ్యామోహం తప్ప.. ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలో.. రైతుల విషయంలో ఎలా వ్యవహరిం చాలో కూడా జగన్‌రెడ్డికి తెలియదు. ఇరిగేషన్ శాఖ మంత్రి తన శాఖకు సంబంధించిన నిజాలు బయటకు చెబితే..తన తలవెయ్యి ముక్కలవుతుందేమో అన్నంతగా భయపడిపోతున్నాడు. వ్యవసాయశాఖ మంత్రి అయితే మాట మాత్రంగా కూడా రైతుల గురించి స్పందించడు. అసలు ఆయన రాష్ట్రంలో ఉన్నాడో లేడోకూడా తెలియ ని పరిస్థితి. అని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొక్కుబడిగా 103 కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు
రాష్ట్రవ్యాప్తంగా 470 మండలాల్లో వర్షాభావ పరి స్థితులు ఉంటే.. జగన్ ప్రభుత్వం కేవలం 103 మండ లాల్లో మాత్రమే వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు ప్రక టించింది. ఆ 103 మండలాల్లో 80 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు చెబుతున్నారు. రాష్ట్రం లో ప్రాంతాలవారీగా పడాల్సిన వర్షం… పడిన వర్షాన్ని లెక్కలోకి తీసుకోకుండా ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడం బాధాకరం. జీవో నెం- 4ద్వారా కరువు మండలాలు ప్రకటించడం తప్ప.. రైతుల కోసం.. కరు వు పరిస్థితుల నివారణ కోసం ప్రభుత్వం పైసా కూడా నిధులు ఇవ్వలేదు. జీవో-4 నాలుక గీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. కేంద్ర ప్రభుత్వ డ్రాట్ మాన్యు వల్ ప్రకారం కరువు మండలాల ప్రకటన అనేది అక్టో బర్ 30లోపు జరగాలని నిబంధనలు చెబుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం నింపాదిగా అక్టోబర్ 31న ప్రకటించింది. కేవలం రైతుల్ని మోసగించడానికే జగ న్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొక్కుబడిగా కరువు మండలా ల జాబితా ప్రకటించింది? కరువు మండలాలకు సం బంధించి కలెక్టర్లు.. రాష్ట్రంలో 470మండలాల్లో వర్షా భావ పరిస్థితులు ఉన్నాయని నివేదిక ఇస్తే.. ప్రభుత్వం కేవలం 103 మండలాలు.. అవి కూడా మొక్కుబడిగా ప్రకటించడం రైతుల్ని వంచించడం కాదా. కరువు కోరల్లో చిక్కి, రైతాంగం అల్లాడుతుంటే, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి.. నీటివసతికి.. పంటనష్టానికి జగన్ ప్రభుత్వం ఒక్కరైతుకి కూడా రూపాయి సాయం చేసింది లేదని ధూళిపాళ్ల విమర్శించారు.
ఊళ్లకు ఊళ్లు వలసపోయి రైతులు చనిపోయే వరకు జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు స్పందించరా?
రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో ఊళ్లకు ఊళ్లు బతుకుదెరువు కోసం వలసవెళ్తున్నా జగన్మోహన్ రెడ్డిలో చలనంలేదు. తెలంగాణ ప్రభుత్వం పక్క రాష్ట్రం లో ధాన్యంకొనే దిక్కులేదని ఎద్దేవా చేస్తున్నా ఈ ముఖ్య మంత్రికి సిగ్గులేదు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో జూలైలోనే కరువు మండలాలు ప్రకటించినా.. కర్ణాటక ప్రభుత్వం కరువు వల్ల తమరాష్ట్రంలో రూ.30 వేలకోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి మొరపెట్టుకున్నా..జగన్ సర్కార్ మాత్రం ఈ నాటికీ కేంద్రప్రభు త్వానికి రాష్ట్రం లోని కరువు పరిస్థితులపై ఎందుకు నివేదిక ఇవ్వ లేదు? వైసీపీ ప్రభుత్వం నివేదికలు పంపే దెన్నడు.. కేంద్ర బృందాలు రాష్ట్రానికి వచ్చేదెన్నడు.. రైతుల కష్టా లు తెలుసుకు నేదెన్నడు? ఆర్థిక సహాయం అందించే దెన్నడు? రాష్ట్రంలో ఏ పంటలు అయితేనేమీ 36లక్షల ఎకరాల్లో వేయాలని ప్రభుత్వంలక్ష్యంగా పెట్టుకుంది. కానీ కేవలం 24లక్షల ఎకరాల్లో మాత్రమే(అంటే కేవ లం 70శాతం) పంటలు వేసినా ప్రభుత్వంలో ఎందుకు స్పందన లేదు? పంటలసాగు ఎందుకు జరగలేదు.. రైతులకు వచ్చిన సమస్యలేమిటనే దిశగా జగన్‌రెడ్డి ఏనాడూ కనీసంసమీక్ష కూడా చేయలేదు.ఊళ్లకుఊళ్లు ఖాళీ అయిపోయి.. దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మ హత్యలకు పాల్పడేవరకు ముఖ్యమంత్రి.. మంత్రులు స్పందించరా అని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొలాల్లో నీళ్లు పారించడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి
జలవనరుల అంతర్జాతీయ సదస్సు పేరుతో కేంద్ర మంత్రితో కలిసి విశాఖపట్నంలో దేశంలోని వివిధ నదుల నీళ్లను కుండలో పోస్తున్న ముఖ్యమంత్రికి.. రాష్ట్రంలోని రైతులకు నీళ్లు అందించాలి, పంటపొలా ల్లో నీళ్లు పారించాలనే కనీస ఇంగితం లేకపోవడం దురదృష్టకరం. ముఖ్యమంత్రికి.. మంత్రులకు రైతులపై ఏమాత్రం జాలి, దయ లేవు అనడానికి వారు ప్రవ ర్తిస్తున్న తీరే నిదర్శనం. రైతుల గోడు పట్టించుకొని.. వారికి పైసా సహాయం చేయని ముఖ్యమంత్రి.. తనను తాను ప్రజల్లో గొప్ప నాయకుడని ప్రచారం చేసుకోవ డానికి మాత్రం వందలకోట్ల ప్రజలసొమ్ము తగలేస్తున్నా డు. ఇంత కసాయి, కర్కోటక ముఖ్యమం త్రిని రాష్ట్ర చరిత్రలో ఇంకెప్పటికీ చూడలేము. ఈ ముఖ్యమంత్రి తీరుతో.. ప్రభుత్వ చేతగానితనంతో.. మంత్రుల వైఖరి తో ఏం చేయాలో తెలియక రైతులు ఏమిటీ ఖర్మ అని గుండెలు బాదుకుంటూ బోరున విలపిస్తున్నారు. రైతు లు రోదిస్తుంటే…ముఖ్యమంత్రి మాత్రంరాష్ట్రం సుభిక్షం గా ఉందని.. రైతుల సంతోషంగా ఉన్నారని ఎలా చెబుతారు?
ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు రూ.500 కోట్లు వస్తే.. రైతులకు రూపాయి ఇవ్వలేదు :
ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి జూలైలో రూ.500 కోట్లు విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభు త్వం మాత్రం పంటలు కాపాడటానికి..తాగునీటి వసతి కల్పనకు రూపాయి కూడా ఇవ్వలేదు. నేడు రైతులు ఒక ఎకరా మిర్చిని కాపాడుకోవడానికి కేవలం నీళ్ల ట్యాంకర్లకే రూ.40వేల నుంచి రూ.50వేలవరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి.. వ్యవసాయరంగానికి ఇస్తున్న నిధులు ఎటుపోతున్నామో వైసీపీ ప్రభుత్వం సమాధా నం చెప్పాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి.. మంత్రుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం :
కరువు మండలాలు ప్రకటిస్తూ ప్రభుత్వమిచ్చిన జీవోనెం-4లో నెల్లూరు జిల్లాలో ఒక్క కరువు మండ లం కూడా ఎందుకులేదో..ఆ జిల్లాకు చెందిన వ్యవసా యమంత్రే చెప్పాలి. ఉదయగిరి మండలంలో తాండవి స్తున్న కరువు ప్రభుత్వానికి.. వ్యవసాయమంత్రికి కని పించలేదా? ప్రభుత్వమిచ్చిందే తప్పుడు జీవో అయితే.. దాన్ని మరలా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారు లకు చెప్పడం ఏమిటి? జీవోనెం-4ను ప్రభుత్వం హడా వుడిగా విడుదలచేసింది. రాష్ట్రస్థాయిలో కరువు మండ లాలు పరిశీలించడానికి ఒక కమిటీ నియమిస్తున్నట్టు ప్రభుత్వం జీవోనెం-3 ద్వారా అక్టోబర్ 10న ఆదేశాలు వెలువరించింది. అక్టోబర్ 17న అందరికీ లేఖలు రాసి న ప్రభుత్వం.. అక్టోబర్ 25న కలక్టర్ల ద్వారా నివేదిక లు కావాలని మీటింగ్‌లు పెట్టింది. 31వ తేదీన ఫైనల్ గా కరువు మండలాలు ప్రకటిస్తూ.. జీవోనెం-4 విడు దల చేసింది. అంతా కేవలం 20 రోజుల్లోనే ప్రభుత్వం ఆఘమేఘాలపై ఎవరి కన్నీళ్లు తుడవడానికి కరువు మండలాలు ప్రకటించింది? రైతాంగం.. వ్యవసాయం విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఎంత బాధ్యతా రాహిత్యంగా ఉన్నారో చెప్పడానికి ఈ జీవోలే నిదర్శన మని ధూళిపాళ్ల అన్నారు.
టీడీపీ-జనసేన నేతలు ప్రభుత్వం కళ్లు తెరిపిస్తారు :
మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేత్రత్వం లో టీడీపీ రైతు విభాగం సమావేశమై కరువు మండ లాల్లో టీడీపీ రైతు విభాగం పర్యటించాలని నిర్ణయం తీసుకుంది. రైతుల్ని కలిసి.. వారిబాధలు కష్టాలు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణతో టీడీపీ ముందుకెళ్తుంది.ఈ ప్రక్రియలో జనసేనను కూడా కలు పుకొని తెలుగుదేశం ముందుకెళుతుందని, ప్రభుత్వం కళ్లు తెరిపిస్తుందని ధూళిపాళ్ల స్పష్టం చేశారు.