- కళ్లెదుటే దాడి చేస్తున్నా గుడ్లప్పగించి చూడటమేమిటి?
- మానవమృగాన్ని వదిలి ప్రశ్నించిన గళాలపై కేసులా?
- ప్రజాస్యామ్యాన్ని రక్షించలేని మీకు ఖాకీ దుస్తులెందుకు?
- బాధితులపై కేసులు బనాయించడంపై నిరసనజ్వాలలు
అనంతపురం : తెలుగుదేశం పార్టీ అధినేతలను హతమారు స్తామని బెదిరించడమే గాక సభ్యసమాజం తలదించు కునే విధంగా బూతులు లంకించుకున్న తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ చందు అనే మానవమృగం అరెస్టు చేయడం చేతగాని అనంతపురం పోలీసులు.. తమ చర్యల ద్వారా యావత్ పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. తోపుదుర్తి చందు వ్యాఖ్యలపై స్పందించిన నేరానికి గంటాపురం జగ్గు అనే టిడిపి నేతను 3 రోజుల క్రితం చెన్నే కొత్తపల్లి పోలీసులు ఇంటినుంచి అక్రమంగా నిర్బంధించి తీసుకెళ్లారు. పోలీసుల అదు పులో ఉన్న జగ్గు, అతనికి మద్దతుగా వచ్చిన మరి కొందరు టిడిపి కార్యకర్తలపై తోపుదుర్తి గ్యాంగ్ కళ్లెదుటే మారణాయుధాలతో దాడిచేసినా అధికార పార్టీకి గులాంగిరీ చేస్తున్న దద్దమ్మ పోలీసుల కళ్లకు కన్పించలేదు. తోపుదుర్తి సైకోబ్యాచ్ వీరంగం, సికె పల్లి పోలీసుల వైఖరిని నిరసిస్తూ మాజీమంత్రి పరి టాల సునీత, పరిటాల శ్రీరాం నేతృత్వంలో ఆదివారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాక విధిలేని పరిస్థితు ల్లో చందుపై నామమాత్రపు బెయిలబుల్ కేసు నమో దుచేశారు. తమ అధినేతలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురంలోని చందు ఇంటి ముట్టిడికి వెళ్లిన టిడిపి నేతలను మాత్రం ఉగ్రవాదులమాదిరి అరెస్టు చేసి పోలీసువాహనాల్లో కుక్కి స్టేషన్‌కు తరలిం చారు. తాజాగా నెలకొన్న పరిణామాలపై అనంత పురం టిడిపి నేతలు సోమవారం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిందితులను వదిలి బాధితులపై కేసులు పెట్టడంలో నయా ట్రెండ్ సృష్టిస్తున్న అనంతపురం పోలీసుల వైఖరి చూసి ప్రజా స్వామ్య వాదులు ముక్కన వేలేసుకుంటున్నారు.
చందు ఇంటిముట్టిడికి టిడిపి నేతల యత్నం
టిడిపి అధినేతలు చంద్రబాబునాయుడు, లోకేష్ లపై మానవమృగం తోపుదుర్తి చందు చేసిన వ్యాఖ్య లపై తెలుగుదేశం పార్టీ యువనేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీరాం చినబాబు (తెలుగుయువత), ఎంఎస్ రాజు(ఎస్సీ సెల్), డూండీ రాకేష్(వాణిజ్య విభాగం), గొట్టుముక్కల రఘురామరాజు(టిఎన్ టియుసి), పంతగాని నరసింహప్రసాద్‌లు సోమవారం అనంతపురం చేరుకున్నారు. కొంతమంది కార్యకర్తలను వెంటబెట్టుకొని వారు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ చందు ఇంటి ముట్టడికి ప్రదర్శనగా బయలుదేరారు. టిడిపి నేతలు చందు ఇంటి సమీపానికి చేరుకునే సరికి పెద్దఎత్తున పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తోపుదుర్తి సోదరులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వ్యాన్ లో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేతలను అరెస్టు చేసే క్రమంలో ప్రత్యేక పోలీసు బలగాలు టిడిపి నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. తెలుగు యువత నేతలు, కార్యకర్తలను లాగిపడేశారు. పోలీసుల దెబ్బలకు టీఎన్టీట్కయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు స్పృహ తప్పిపడిపోయారు. వ్యాన్లు ఎక్కించాక కూడా తెలుగు యువత నేతలను పోలీసులు కొట్టారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో నేతలను యువనేత పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ యువనాయకులను ఉదయం అరెస్ట్ చేసి రాత్రివరకు వదలకపోవడంతో అనంతపురం పోలీసు స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
ఇకపై చర్యకు ప్రతిచర్య తప్పదు
వైసీపీ నేతలు ఇష్టమొచ్చి నట్టు దూషణలకు పాల్ప డితే అది వాక్ స్వాతంత్రమా.. మేము ఆవేశంలో చిన్న మాట మాట్లాడితే నేరమా.. ఇది ఏ రాజ్యం గంలో చెప్పారని ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న తెలుగు యువత నాయ కులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా 3వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ స్టేషన్‌కు వచ్చి నాయ కులను పరామర్శించారు.
అనంతరం శ్రీరామ్ మాట్లా డుతూ తమ అధినేత చంద్రబాబును దూషించిన వ్యక్తులపై వారికి ఆగ్రహావేశాలు ఏమాత్రం తగ్గడం లేదని.. అరెస్టులు చేసినా వెనక్కు తగ్గమని తెలుగు యువత నాయకులంటున్నారని తెలిపారు. జాకీ పరిశ్రమ వారి బెదిరింపుల వలన పోయిందని ఆరోపణలు వస్తే, కాదని నిరూపించుకోవాల్సింది పోయి ఇష్టానుసారం దూషిస్తున్నారని శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జగ్గు లాంటి కొందరు వ్యక్తులు స్పందిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. వారికున్న స్వేచ్ఛ మాకు ఉంటుంది కదా అని ప్రశ్నించారు. పైగా చందు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సమర్ధించుకుంటున్నారని.. ఇక నుంచి మీరు అనే మాటలకు మా వైపు నుంచి అదే స్థాయిలో స్పందన ఉంటుందని.. ఇలా కేసులు పెట్టి బెదిరించాలని చూస్తే మా శ్రేణులు ఎక్కడా తగ్గరని హెచ్చరించారు. పోలీసులు ఇప్పటికైనా స్పందిస్తూ ఈ గొడవలకు ఆజ్యం పోసిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేయాలని శ్రీరామ్ డిమాండ్ చేశారు.