- వెర్రినవ్వులు, పిచ్చి చూపులతో వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో పరువు పోగొట్టుకున్న జగన్ రెడ్డి
- తెలుగులో అడిగినా సమాధానం చెప్పలేక తెల్లముఖం
- పరువు పోతుందని గూగుల్‌లో వెతుక్కోవాలంటూ కవర్ చేసిన సజ్జల భార్గవ్
అమరావతి(చైతన్యరథం): వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో తెలుగులో అడిగిన ప్రశ్నకు కూడా జగన్ రెడ్డి సమాధాన చెప్పలేక తెల్లముఖం వేసి.. వెర్రినవ్వులు, పిచ్చిచూపులు చూసి పరువు పోగొట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ఎద్దేవా చేశారు. ఎక్కడ పరువు పోతుందో అని వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్‌రెడ్డి దాన్ని కవర్ చేయడం చూస్తే ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రి పాలనలో ఉన్నందుకు బాధాకరంగా ఉందన్నారు. జగన్‌రెడ్డి వ్యాపార దక్షతేంటో సీబీఐ గతంలోనే నిర్ధారించిందని వ్యంగ్యం ప్రదర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విశాఖలో వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకు జగన్ తెల్లముఖం వేశాడన్నారు.
మీ వ్యాపార దక్షత గురించి వివరించాలంటూ ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయాడు. పక్కన ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డి ఏదో చెప్పాలని ప్రయత్నించినా జగన్ రెడ్డికి అర్థం కాక వెర్రి నవ్వులు, పిచ్చి చూపులతో కూర్చుకున్నాడు. సమాధానం చెప్పకుంటే పరువు పోతుందని భయపడిన భార్గవ్ రెడ్డి సింపుల్ గా జగన్ రెడ్డి చరిత్రని గూగుల్ లో వెతుక్కోమని చెప్పటం సిగ్గుచేటుగా ఉంది. ఆ అమ్మాయి అడిగినట్లు ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ అంటే దోచుకోవడంలో జగన్ రెడ్డి పీహెచ్డీ చేసిన స్కిల్ అనుకోవాలేమో. ఇదే ప్రశ్న టీడీపీ యువనేత లోకేష్‌ని అడిగితే రేపు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామనేది చాలా స్పష్టంగా చెప్పగలిగేవారు. జగన్ రెడ్డి గురించి అడిగిన ప్రశ్నకు ఆ అమ్మాయి గూగుల్ లో వెతికిందో లేదో కాని.. జగన్ రెడ్డి ఎంత పెద్ద పారిశ్రామిక వేెత్తో, ఎంత పెద్ద ఆర్థిక సంస్కరణవాదో తెలుసుకునేందుకు గూగుల్లో వెతికితే… చాంతాడంత లిస్ట్ వచ్చింది.
అందులో జగన్ రెడ్డి పెట్టిన షెల్ కంపెనీల జాబితా, జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల ఛార్జ్ షీట్‌ల లిస్ట్ వివరాలు వచ్చాయి. 2004 తరువాత జగన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు గడిరచారనే విషయం వచ్చింది. ఇటువంటి చరిత్ర మొత్తం వచ్చింది కానీ, ఏ రకమైన కంపెనీలు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, ఏం అభివృద్ధి చేశాడో గూగుల్ కూడా సమాధానం చెప్పలేకపోయింది. జగన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉండగా 64 షెల్ కంపెనీలతో అవకతవకలు పాల్పడ్డారు. ఆ షెల్ కంపెనీలు ఏంటో సీబీఐ ఎప్పుడో బయట పెట్టింది. 2014 నుండి 2019 వరకు ఒక్క షెల్ కంపెనీ కూడా ఏర్పాటు చేయలేదు కానీ, అధికారంలోకి వచ్చాక 2019 -2024 మధ్యలో మళ్లీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ లాంటి షెల్ కంపెనీలో ఏర్పాటు చేశారని జ్యోత్స్న విమర్శించారు.
పారిశ్రామికవేత్త కాదు, దోపిడీదారు
జగన్‌కు అసలు ఎంట్రప్రెన్యూర్ అంటే స్పెల్లింగ్ అయినా తెలుసా. 2004 ముందు ఉన్న ఇంటిని అమ్ముకునే పరిస్థితుల్లో జగన్ కుటుంబం ఉంది. 2004 తరువాత వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారు. అంత తక్కువ సమయంలో వేల కోట్లు ఆస్తులు ఎలాయి వచ్చాయని సాక్షాత్తూ సుప్రీంకోర్టే ప్రశ్నించింది. జగన్ రెడ్డిపై సీబీఐ 12 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఈడీ మరో 2 ఛార్జి షీట్లను దాఖలు చేసింది. వీటన్నింటిలో జగన్ రెడ్డి ఏ రకంగా
దోచుకున్నారో కనిపిస్తుందని జ్యోత్స్న అన్నారు.
సజ్జల భార్గవ్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆ అమ్మాయి అడిగిందో…తెలియక అడిగిందో కానీ, దానికి కూడా సమాధానం చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో జగన్‌రెడ్డి ఉన్నాడు. జగన్ రెడ్డికి ప్రశ్న అర్థం కాక సమాధానం చెప్పలేదా. చేసినవన్నీ దొంగతనాలు, ఆర్థిక నేరాలే అయినప్పుడు తాను ఎంట్రప్రెన్యూర్ ఎలా అవుతానని భావించిన జగన్‌రెడ్డి తనలో తాను అలా పిచ్చిగా నవ్వుకున్నాడా అని జ్యోత్స్న సందేహం వ్యక్తం చేశారు.
జగన్‌రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడు.. బెయిల్‌పై బయటకు వచ్చి యువతను ఉద్ధరిస్తానని, రాష్ట్రాన్ని బాగు చేస్తానంటూ చెప్పే కట్టు కథలు పిట్ట కథలు ఎవరు నమ్ముతారు. ఐదు సంవత్సరాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ ను అటకెక్కించారు. స్వయం ఉపాధి రుణాలను అటకెక్కించారు. ఎక్కడ కూడా యువతకు ప్రయోజనకరమైన ఆలోచనలు చేయలేదు. ఎల్లప్పుడూ కేవలం నాసిరకం మద్యం, గంజాయి ఎలా సరఫరా చేద్దాం, ప్రభుత్వ ఆస్తులను ఎలా తాకట్టు పెడదాం, జనాలను ఎలా దోచుకుందామా అనే ఆలోచనలే తప్ప మరో ఆలోచన లేని జగన్‌రెడ్డిని ఏ రకంగా చూసినా ఒక పారిశ్రామిక వేత్త అని చెప్పలేమని జ్యోత్స్న స్పష్టం చేశారు.
రాష్ట్ర సంపదను దోచుకుని దాచుకోవడం, ప్యాలెస్‌లు కట్టుకోవటం తప్పించి రాష్ట్రానికి సంపద సృష్టించడంలో జగన్ రెడ్డికి ఘోరంగా విఫలమయ్యారు. వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి బేలతనాన్ని యావత్ ఏపీ యువత గమనించింది. ఆ కార్యక్రమంలో జగన్ ఐకాన్ అని చెప్పడం హస్యాస్పదం. జగన్ ఎందులో ఐకాన్. రాష్ట్ర ప్రజలను హింసించడంలోనా? వేల కోట్లు ఆస్తులు దోచుకని, దాచుకోవడంలోనా? మోసం చేయడంలోనా? ప్రజలను దగా చేయడంలోనా? అనేక ప్యాలెస్‌లు కట్టుకుని ఆస్తులను కూడగట్టుకోవడంలోనా? జగన్‌రెడ్డి ఎవరికి ఐకాన్. ఇలాంటి వ్యక్తులను దోపిడీ దారులను ఆదర్శంగా తీసుకోమని ఏ తల్లితండ్రులైనా పిల్లలకు చెబుతారా? ఇలాంటి వ్యక్తులు ఎలా ఆదర్శం అవుతారని జ్యోత్స్న ప్రశ్నించారు.