గూండా, రౌడీ అనుకునేవాళ్లంతా రోజులు లెక్క పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడిచేసి నవారిని ఎవరినీ వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తాం అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నాపైన కూడా చాలాకేసులు పెట్టాడు.. ఇంకా పెడుతు న్నాడు. పెడితే పెట్టుకోమంటున్నా. నాకు సభ్యత ఉంది కాబట్టే హద్దులుమీరి వ్యక్తిగతంగా పోవడంలేదు అని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీనేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరిన సందర్భంలో పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రజల నమ్మకం,భవిష్యత్తా? కానేకాదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం. జగన్ ఉంటే రాష్ట్రం అంధకారమే. సైకో పోకపోతే ప్రజలే రాష్ట్రం వదిలిపోవాలి. టీడీపీ కార్యాలయంపై దాడిచేసి, విజయవాడలో గూండాయిజం, రౌడీయిజం చేస్తున్నవారి తోకలు కత్తిరిస్తా అని హెచ్చరించారు. కేసులకు భయపడితే జగన్ పై పోరాడలేం. కేసులతో ఏం పీకుతాడు? 10రూపాయలు ఇస్తూ, 100రూపాయలు లాక్కుంటున్న జగన్, వైసీపీనేతల దుర్మార్గాలు, దోపిడీ, కబ్జాలు చూశాక కూడా వైసీపీజెండా పట్టుకుంటారా? పింఛన్ అడిగిన ముస్లిం మహిళను బెదిరించి, భయపెట్టి పొట్టనపెట్టుకున్న పార్టీ వైసీపీ. మీ బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే, మీ జీవితాలు సంతోషంగా ఉండాలంటే తక్షణమే వైసీపీ జెండాను కృష్ణానదిలో పడేసి, తెలుగుదేశం జెండా పట్టుకోండి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
యువతీయువకులు వారి భవిష్యత్ కోసం తెలుగుదేశం జెండా పట్టారు. నేను అధికా రంలోకి రావాలని మీతో మాట్లాడటంలేదు. సైకోపాలనకు ఇంక ఒక్క సంవత్సరమే. సైకో పోకపోతే ప్రజలే రాష్ట్రం వదిలిపోవాలన్నారు. ఈ మధ్య ఇంటింటికీ జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. మనఇళ్లమీద సైకో బొమ్మలేంటి? వేరే వారి ఇళ్లగోడలపై రాయాలన్నా, ఎలాంటి కరపత్రాలు, బొమ్మలు అతికించాలన్నా ఇంటి యజమానుల అనుమతి తప్పనిసరి. ఎవరి అనుమతి తీసుకొని వాలంటీర్లు జగన్ స్టిక్కర్లు ప్రజల ఇళ్ల గోడలపై అతికిస్తున్నారు. ప్రజలసొమ్ము జీతంగా తీసు కుంటున్న వాలంటీర్లు సైకో ముఖ్యమంత్రి కోసం ఎలా పనిచేస్తారు? అని ప్రశ్నించారు. జగన్ అనేవాడు సమాజానికి పట్టిన క్యాన్సర్. జగన్ బిడ్డకాదు, క్యాన్సర్ గడ్డ. శరీరం లో ఏ భాగానికి అయినా క్యాన్సర్ వస్తే వెంటనే ఆపరేషన్ చేయించుకుంటాం. లేకపోతే బతకరు. క్యాన్సర్ ఏ అవయవానికి వస్తే అది దెబ్బతిని, మనిషే చనిపోయే పరిస్థితి వస్తుంది. ఆక్యాన్సర్ మాదిరే జగన్ కూడా సమాజాన్ని, మరీ ముఖ్యంగా ఆడబిడ్డ ల్ని పట్టిపీడిస్తున్నాడు అని ధ్వజమెత్తారు.
నిత్యావసరధరలు పెరిగాయో లేదో, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందో లేదో ఆడబిడ్డలు చెప్పాలి. నూనె ధర ఎంతపెరిగిందో చూశాం. సలసలకాగే నూనెలో జగన్ ను వేస్తే, అప్పుడే అతనికిబుద్ధి వస్తుంది. మద్యం ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతపెరిగాయో చూస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు ఈనెల నుంచి రూ.5,500కోట్లు పెంచుతున్నాడు. యూనిట్ కు 50పైసలు పెంచుతున్నాడు. ఇదేకదా బాదుడే బాదుడు అంటే. జగన్ ఇచ్చేది పదిరూపాయలు. గుంజేది వందరూపాయలు అని విమర్శించారు. ఒకప్పుడుతెలుగుదేశంపార్టీ అధికారంలో ఉంటే మనల్నిచూసి భయపడిన వారు, ఇప్పుడు మనల్నిహేళనచేస్తూ మాట్లాడుతున్నారన్నారు.
చాలామందికి జగన్ పనితీరు ఇంకాబాగా అర్థమైనట్టు లేదు. అర్థమైతే వెంటనే వైసీపీ జెండాను వదిలేయాలి. ఆ పార్టీజెండాను కృష్ణానదిలో వదిలేసి, వెంటనే టీడీపీ జెండా పట్టుకోవాలి. మిమ్మల్ని నాశనం చేసే జెండాను, సమాజాన్ని నాశనంచేసే జెం డాను మీరు మోస్తారా? సమాజానికి వైసీపీనేతలు ద్రోహం చేస్తుంటే, ఇంకా ఆపార్టీ జెండా ఎలా మోస్తారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. బాబాయ్ ని జగన్ నిత్యం చంపేస్తున్నాడు. మొదటిరోజు గుండెపోటు. తర్వాతి రోజు రక్తపోటు. ఆ తరువాత గొడ్డలితో చంపి నా పేరు చెప్పిన వాళ్లు కరుడుగట్టిన నేరస్తులు, ఆర్థిక ఉగ్రవాదులు. జగన్ సమాజానికే ప్రమాదకరం. రాజకీయాలకు అనర్ధుడు అని విమర్శించారు. జగన్ పెద్దసైకో అయితే, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చిన్నసైకో తయార య్యాడు. బెదిరిస్తున్నాడు జనాల్ని… అలాంటి వాళ్ల తోకలు కత్తిరిస్తాను. రౌడీయిజం చేసేవారి గుండెల్లో తెలుగుదేశం నిద్రపోతుంది అని హెచ్చరించారు. ఈ నియోజకవర్గంలోనే ఒక ముస్లింమహిళ వైసీపీకి పనిచేసింది. పింఛన్ ఇమ్మని అడిగిన పాపానికి ఆమెపైకి వేరేప్రాంతాలనుంచి తీసుకొచ్చిన రౌడీలను పంపారు. ఆడ వాళ్లతో ఆమెను కొట్టించారు. ఆమెను కొట్టి, తిరిగి ఆమెపై, ఆమె కుటుంబసభ్యులపై తప్పుడుకేసులు పెట్టారు . ఎందుకంటే పోలీసులు గ్రేట్ కదా! ఆమెపై కేసులు పెట్టి వేధించినందుకు గుండెపోటుతో చనిపోయింది. ఆమె కుటుంబసభ్యులకు ఏం సమా ధానం చెబుతాడని జగన్ ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు తప్పుడుకేసులు పెట్టే పోలీసులు టీడీపీ ప్రభుత్వంలో జాగ్రత్తగా ప్రజలు మెచ్చేలా పనిచేశారు. ఇప్పుడేమో ఇలా తయారయ్యారు.
రౌతుకొద్దీ గుర్రం. మరలా రేపు టీడీపీప్రభుత్వం వస్తే బాగానే పనిచేస్తారు అని చెప్పారు. ముస్లిం మహిళను బెదిరించి, భయపెట్టి గుండెపోటుతో చనిపోయే పరిస్థితి తీసు కొచ్చారు. ఇలాంటి దారుణాలపై ఎవరూ మాట్లాడకూడదు? దుర్గ అనే మహిళ జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే ఆమెచేసుకునే చిన్న ఉద్యోగం తీసేశారు. ఎవరూ అన్యాయంపై మాట్లాడకూడదు. ఒకప్పుడు ముఖ్యమంత్రి, మంత్రుల్ని నిలదీసిన ఈ ప్రజా నీకం ధైర్యం ఏమైపోయింది. ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణసమయంలో టీడీపీప్రభుత్వం ఒక్కఇల్లుకూడా తొలగించలేదు. కానీ వైసీపీప్రభుత్వం వచ్చాక 500ఇళ్లు తొలగించింది. ఆపార్టీనేతలే పేదల ఇళ్లు తీసేసిన స్థలాల్లో టెంట్లు వేసుకొని కూర్చున్నారు. ముందురోజుల్లో మీ ఇళ్లు, దుకాణాలు అన్నీ మావే అని వైసీపీవాళ్లు అంటారు. జగన్ మెడపై కత్తిపెట్టి ప్రజల ఆస్తులు లాక్కుంటున్నాడు అని విమర్శించారు.
ఈ ప్రభుత్వంలో ఎవరికీ భద్రతలేదు. రాజధాని పోయింది. పోలవరం పోయింది. పరి శ్రమలు రావడంలేదు. యువత భవిష్యత్ పోయింది. ఇన్ని జరిగిన కూడా మీకు పౌరుషం రావడంలేదు. 5రూపాయలు ఇస్తూ, 100రూపాయలు కొట్టేస్తున్న దొంగను పట్టుకొని తాటతీయాల్సిన బాధ్యతమీదే అని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఆరంభం మాత్రమే. కుప్పాన్ని గెలుస్తాను అంటున్న జగన్ ముందు పులివెందులను కాపాడుకోవాలి. ఒళ్లంతా పొగరెక్కితే వారి పొగరు తగ్గించాలి. ప్రజలప్రాణాలు, ఆస్తులు, భూములకు రక్షణగా ఉండా ల్సిన విషయం మర్చిపోయి, జగన్ అతని సైకో బ్యాచ్. ప్రాణాలు తీస్తూ ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. విజయవాడలో ఫ్యాక్షన్ రాజకీయాలు సాగనివ్వమని వెల్లడించారు. రమేశ్ యాదవ్ టీడీపీలో చేరడం ద్వారా ఒకస్ఫూర్తి ఇచ్చాడు. వైసీపీవల్ల రాష్ట్రానికి నష్టమని, సమాజానికిచేటని ముందే పసిగట్టి, తెలుగుదేశం జెండా కప్పుకున్నాడు. ఎమ్యెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే, వైసీపీఎమ్మెల్యేలను ప్రలోభపెట్టామని నోటి కొచ్చినట్టు మాట్లాడారు. టీడీపీ అభ్యర్థి అనురాధ 23వతేదీన, 23 ఓట్లతో, 2023లో గెలవడం దేవుడి స్క్రిప్టే. అరాచకానికి, ప్రజా వ్యతిరేకవిధానాలకు కూడా ఒక హద్దుఉంటుంది. ఆ హద్దుని వైసీపీనేతలు ప్రభుత్వం దాటేసింది అని చెప్పారు. యువత, ఆడబిడ్డలు, రైతులు అందరూ మూకుమ్మడిగా వైసీపీప్రభుత్వంపై తిరుగు బాటు చేయాలి. రాష్ట్ర భవిష్యత్ కోసం అందరూ పట్టుదలతో, స్ఫూర్తితో పనిచేయాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.