తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధినేత గా చంద్రబాబు ఎన్నిక కావటం వరుసగా ఇది 14వ సారి. రాజమహేంద్రవరం లో జరుగుతున్నామహానాడు సందర్భంగా శనివారం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు. ఇందుకోసం ఆరుగురు సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని నియమించారు.
అధ్యక్ష పదవికి ఎన్నికకు సంబంధించి మొత్తం 11 నామినేషన్ లు వచ్చాయని, అన్ని నామినేషన్ లు చంద్రబాబు నాయుడు ను అధ్యక్షునిగా బలపరుస్తూ దాఖలాయ్యాయని ఎన్నికల కమైటీ సభ్యుడు, మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. నామినేషన్ ల పరిశీలన అనంతరం చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు కాలువ శ్రీనివాసులు ప్రకటించారు.