చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మువ్వన్నెల జెండా ఓ ఉద్వేగం, ఓ స్ఫూర్తి

నేషన్‌ ఫస్ట్‌ అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి

by చైతన్యరధం
Aug 12, 2025 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మువ్వన్నెల జెండా ఓ ఉద్వేగం, ఓ స్ఫూర్తి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

` జాతీయ పతాకాన్ని రూపొందించింది తెలుగువారు కావడం గర్వకారణం
` మోదీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం
` భారత్‌ది డెడ్‌ ఎకానమీ కాదు, గుడ్‌ ఎకానమీ
` మోదీ నాయకత్వంలో త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌
` ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయంపై జాతీయ జెండా రెపరెపలాడాలి
` హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడ (చైతన్యరథం): కుల, మత, ప్రాంత, భాషా భేదం లేకుండా దేశమంతా ఒకటే అనే జాతీయ భావన పెంపొందించడమే హర్‌ ఘర్‌ తిరంగా లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరంగా అంటే కేవలం ఇంటిపై జెండా ఎగరేయడం కాదని, దేశభక్తిని పెంచే సంకల్పమన్నారు. సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పింగళి వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…గతంలో ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనేక కార్యక్రమాలకు తాను హాజరయ్యానని, కానీ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఉద్వేగం కలుగుతుందో అదే మువ్వన్నెల జెండా’ అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

పింగళి తెలుగువారు కావడం గర్వకారణం

ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జాతీయ జెండాను మన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య రూపొందించడం మనందరికీ గర్వకారణం. జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదు. మన దేశ గౌరవం. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉద్వేగం, దేశభక్తి కలుగుతుంది. ఎందరో మహానుభావులు తెలుగునేలపై జన్మించారు. వారి పోరాటపటిమతో మనలో జాతీయస్పూర్తిని రగిలించారు. 1857లో ప్రథమ స్వాతంత్య్ర పోరాటం జరగ్గా అంతకముందే బ్రిటీష్‌ వారిపై తెలుగు వారు పోరాటం చేశారు. బ్రిటీష్‌ వారిని గడగడలాడిరచిన అల్లూరి సీతారామరాజు, తుపాకీ గుళ్లకు గుండె చూపించిన టంగుటూరి, గొట్టిపాటి బ్రహ్మయ్య, సర్దార్‌ గౌతు లచ్చన్న, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వంటి స్వాతంత్య్ర సమరయోధులు తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం అని సీఎం చంద్రబాబు అన్నారు.

దేశం ఎవరికీ తలవంచదు

దేశ సమగ్రత విషయంలో భారత్‌ ఎవరికీ తలవంచదు. దేశ క్షేమం, భద్రత విషయంలో మనమంతా ఒకటే. కార్గిల్‌ యుద్ధం, పహల్గామ్‌ ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒక్క తాటిపై నిలిచింది. నేడు ఉన్నది దృఢమైన భారతదేశం. విశ్వగురువుగా అవతరిస్తున్న భారతదేశం. ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదానికి గట్టిగా బదులిచ్చాం. ఉగ్రవాదుల గుండెల్లో సైనికులు రైళ్లు పరుగెత్తించారు. ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మన సైనికులకు సెల్యూట్‌ చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

భారత్‌ది గుడ్‌ ఎకానమీ

ప్రధాని మోదీ రూపంలో మన దేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభించింది. ఒకప్పుడు మనది పేద దేశం అనేవాళ్లు. 11 ఏళ్ల మోదీ పాలనలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 2028కి 3వ స్థానానికి చేరుతుంది. 2047లో వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా మనదేశం నిలుస్తుంది. 2047 నాటికి దేశంలో ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మనది డెడ్‌ ఎకానమీ అన్నారు. ఎవరిది డెడ్‌ ఎకానమీనో భవిష్యత్‌ నిర్ణయిస్తుంది. మనపై సుంకాలు వేయడం తాత్కాలికమే. మనది గుడ్‌ ఎకానమీ. మన భారతీయుల సేవలు ప్రపంచానికి చాలా అవసరం. తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. 1995లో ఐటీ విప్లవం వచ్చింది. దాన్ని మనం అందిపుచ్చుకుని ముందుకెళ్లాం. ఐటీని ప్రమోట్‌ చేసేందుకు హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ కట్టాం. నేడు ఏపీలో క్వాంటమ్‌ వ్యాలీ తీసుకొస్తున్నాం. యువత ఎక్కువగా ఉండే దేశం మనది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని స్థిరమైన అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళదామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

Previous Post

డీఎస్సీ ఫలితాలు విడుదల

Next Post

సమస్యలు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళతా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

కార్యకర్త
@ August 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist