అమరావతి: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ శాసన సభ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 16వ తేదీ బుధవారం నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించ నున్నారు. బుధవారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయ లుదేరతారు. 11.45కి కర్నూలు విమానా శ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు పత్తికొండ లోని ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. పత్తికొండ కోరమాండల్ ఫర్టిలైజర్స్ ప్రాంతంలో బహిరంగ సభలో ప్రసం గిస్తారు.రాత్రికి ఆదోనిలో చేకూరి ఫంక్షన్‌హాల్‌కు చేరుకుని, అక్కడే బసచేస్తారు.
17వ తేది ఉదయం ఆదోనిలో రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నానానికి అక్కడ అర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకుని, అక్కడ బహిరంగ సభలో ప్రసంగి స్తారు. సభ ముగిసిన తరువాత బయ లుదేరి మధ్యాహ్నం 1.30గంటలకు ఎమ్మిగనూరు మండలం లోని చెన్నాపురం చేరుకుంటారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు వెంకటాపురం చేరుకుం టారు. సాయంత్రం 5 గంటల వరకు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్, శ్రీనివాస సర్కిల్, సోమేశ్వర సర్కిల్ ప్రాంతాల్లో రోడ్‌షోలో పాల్గొంటారు. తరువాత ఎమ్మి గనూరు చేరుకుని అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తా రు. రాత్రికి కర్నూలు చేరుకుని అక్కడ మౌర్య హోట ల్‌లో బసచేస్తారు. 18వ తేదీ సాయంత్రం 3 గంటల కు కర్నూలులోనిపార్టీ జిల్లాకార్యాలయానికి వెళతారు. 3.30 గంటలకు అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరి స్తారు. ఆ తరువాత సాయంత్రం 4.30 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరు కుని, అక్కడ నుంచి విమానంలో 5.40గంటలకు గన్నవరం విమానాశ్ర యానికి చేరుకుంటారు. అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసానికి వెళతారు.