చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పునర్నిర్మాణమే చంద్రబాబు విధానం!

విష ప్రచారంతో దిగజారుడు రాజకీయం

by చైతన్యరధం
Apr 13, 2024 at 6:08am
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అందుకు జగనాసుర వధే నినాదం
  • 5 కోట్ల ప్రజల ఉజ్వల భవితే అజెండా
  • మెరుగైన సంక్షేమం, పరుగులిడే అభివృద్ధే లక్ష్యం
  • 2014-19 లో చేసిన పనులే సాక్ష్యం
  • జగన్‌ చీకటి అధ్యాయానికి చరమగీతమే తొలి అడుగు
  • కూటమి ప్రభుత్వం కోసం ఆతృతతో ప్రజలు
  • తీవ్ర నైరాశ్యంలో జగన్‌ శిబిరం
  • విష ప్రచారంతో దిగజారుడు రాజకీయం

పోగాలము దాపురించిన వారు దీప నిర్వాణ గంధమును ఆఘ్రాణించలేరు. అరుంధతీ నక్షత్రమును చూడలేరు. మిత్ర వాక్యమును వినలేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శిబిరం ఇదే పరిస్థితిలో ఉంది నేడు. త్వరలో జరగనున్న ఎన్నికలలో పరాజయం తప్పదని తెలిసి పూర్తి నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతోంది. దింపుడు కళ్లెం ఆశలతో అబద్ధాలకు దిగజారుతోంది. ఈ వైరాగ్యం జగన్‌రెడ్డి అవినీతి మానస పుత్రిక ‘సాక్షి’ (12.4.2024) సంచికలో ‘ఆరోపణలే అజెండా’ అన్న పతాక శీర్షికతో ప్రచురితమైన కథనంలో నగ్నంగా వెల్లడైంది. ఆ వార్త సారాంశమేమంటే.. చంద్రబాబుకు ఓ విధానమూ లేదట.. నినాదమూ లేదట. ఈ వార్తను కపట ‘సాక్షి’ వండివార్చిన తీరే అందులోని అసంబద్ధతను బట్టబయలు చేసింది.

నవ్యాంధ్ర వడివడి అడుగులు
ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం ఏర్పడిన నవ్యాంధ్ర ప్రజలు ఎంతో నమ్మకంతో 2014 ఎన్నికల్లో కొత్త రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు. తండ్రి శవం పక్కనే సింహాసనం కోసం తహతహలాడిన జగన్‌రెడ్డిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఎందుకు..? పురిటి కష్టాలతో జన్మించిన నవ్యాంధ్రను సరైన మార్గంలో, సరైన రీతిలో, సరైన వేగంతో ఇతరులతో పోటీపడి నడిపించగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు అని 2014లో జనం ఆయన వెంట నడిచారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు 2014`19 కాలంలో రేయింబవళ్లు కష్టపడి అధికార యంత్రాంగాన్ని పరుగులెత్తించి, వివిధ పథకాలు, కార్యక్రమాలతో కొత్త రాష్ట్రానికి ఒక గుర్తింపు తెచ్చారు. వినూత్న విధానాలతో భారీ శ్రమతో అమరావతి రాజధాని ప్రాజెక్టును పరుగులెత్తించారు. సగటు మనిషి ఇల్లు కట్టుకోవటానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. లోతైన పరిశీలనతో, విస్తృత చర్చల నేపథ్యంలో, ప్రముఖ అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, సహకారాలతో రాజధాని ప్రణాళికను రూపొందించి, నిర్మాణాలు చేపట్టి రూ.15వేల కోట్ల పనులను శరవేగంతో నడిపించారు. దేశ, విదేశాల నిపుణులు అబ్బురపోయేలా చేశారు. నవ్యాంధ్ర ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ వారిలో ఓ బలమైన ఆశను, భవితపట్ల విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన పలు నిర్మాణాలు, పూర్తయి వినియోగంలోవున్న పలు భవనాలు చంద్రబాబు పాలనా దీక్షకు సజీవ తార్కాణాలుగా ఉన్నాయి. అవే జగన్‌రెడ్డి గత ఐదేళ్ల పాలనకు ప్రధాన ఆధారంగా మిగిలాయి.

కొత్త పుంతలు తొక్కిన సంక్షేమం
సంక్షేమం, అభివృద్ధిలను రెండు కళ్లుగా భావించే చంద్రబాబు 2014`19లో ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ పలు వినూత్న పథకాలను ప్రారంభించారు. అవ్వాతాతల నెలవారీ పింఛనును రూ.200 నుంచి పదిరెట్లు పెంచి రూ.2000 చేశారు. వివిధ సామాజిక వర్గాల ప్రత్యేక ప్రయోజనాల నిమిత్తం ఎస్సీలకు 27 పథకాలు, ఎస్టీలకు 16, బీసీలకు 30, మైనారిటీలకు 10 ప్రవేశపెట్టారు. ఆదరణ, డా.అంబేద్కర్‌ విదేశీవిద్య, బెస్ట్‌ అవైలబుల్‌ సూళ్లు, చంద్రన్న బీమా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, స్వావలంబనతో కూడిన సాధికారతకు మున్నెన్నడూ చూడని పథకాలను రూపొందించారు.
ప్రజలు.. ముఖ్యంగా గ్రామీణ పేదల రేపటి కోసం ఎంతో కీలకమైన ఆర్థికాభివృద్ధికి మూలమైన మౌలిక రంగాల అభివృద్ధికి కృషి చేశారు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఇందుకు రాష్ట్ర జీవనాడి పోలవరమే ఉదాహరణ. ఈ పథకం పనులను పరుగులెత్తించి 72 శాతం పూర్తి చేశారు. కీలకమైన సాగునీటి రంగంపై రూ.68వేల కోట్ల వ్యయం చేశారు. రహదారులు, రవాణా రంగంలో పలు మార్పులు తెచ్చారు. చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్‌తో లక్షలాది కోట్ల పెట్టుబడులతో 6 లక్షల ఉద్యోగాలు అందించారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవి చాలవా ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014`19లో చేసింది చెప్పుకోవటానికి? అయినా చెప్పుకోవడానికి ఏమీలేక మఖ్యమంత్రి జగన్‌ రెడ్డిపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని కపట ‘సాక్షి’ జగన్‌రెడ్డి తరఫున శుక్రవారం సంచికలో పతాక వార్తలో వాపోయింది. అంతటి ఘనత కలిగిన చంద్రబాబు ముందు జగన్‌రెడ్డి నిలబడలేకపోవటాన్ని చూసి తమ శిబిరంలో నెలకొన్న నైరాశ్యానికి తానే అద్దం పట్టింది.

జగన్‌కి ఏముంది చెప్పుకోవటానికి?
అధికారంలోకి వచ్చిన అనతి క్షణాల్లోనే చేసిన ‘ప్రజావేదిక’ విధ్వంసమా? శిథిóలమైన అమరావతా? రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన నవ్యాంధ్రా? గోదాట్లో మునిగిపోయిన పోలవరమా? పారిపోయిన పరిశ్రమలు, పెట్టుబడులా? నిర్వీర్యమైన యువతా? అనునిత్యం హత్యలకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలా? ఆత్మహత్యల్లో దేశంలోనే ముందున్న రైతాంగమా? మాన, ప్రాణ రక్షణలేని రాష్ట్ర మహిళలా? ప్రభుత్వ నిర్వాకాలను ప్రశ్నించటానికి, తమ హక్కులను కాపాడుకోవటానికి నోరు విప్పటానికి కూడా భయపడుతూ బిక్కుబిక్కుమని బతుకుతున్న ప్రజానీకమా?
సంక్షోభంలో పడిపోయిన సంక్షేమమా? జగన్‌ ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో మోసపోయిన రైతులు, మహిళలు, విద్యార్థులా? చంద్రబాబు ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల రద్దుతో తీవ్రంగా నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల వారా? జగన్‌ బృందం ఇసుక దోపిడీతో బతుకు బజారుపాలైన 40 లక్షలమంది నిర్మాణరంగ కార్మికులా? గుంతలమయమైన రోడ్లా? కనుచూపుమేరలో కానరాని అభివృద్ధా? అప్పుల కుప్పగా మారిన రాష్ట్రమా?
సకాలంలో జీతాలందక ఐదేళ్లుగా కష్టాలు పడుతున్న వివిధ కేటగిరీల ఉద్యోగులు, ఉపాధ్యాయులా? పంచాయితీ రాజ్‌ వ్యవస్థ నిర్వీర్యంతో నిష్క్రియాపరులైన వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులా? ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి దర్శన భాగ్యం గత ఐదేళ్లుగా లభించని అధికారపార్టీ శాసన సభ్యులా? గత ఐదేళ్లలో తానేమి చేశాడని చెప్పుకోగలడు ఈ ముఖ్యమంత్రి? ఏమీ లేదు కనుకనే చంద్రబాబుపై పడి ఏడవడం.

కపట ‘సాక్షి’ వండివార్చిన సదరు అసత్యపు కథనంలో.. ముఖ్యమంత్రి తరఫున వకాల్తా పుచ్చుకుని ఇంకొన్ని అవాస్తవాలను అచ్చువేసింది. అవి కూడా పూర్తిగా డొల్లే. జగన్‌రెడ్డి బడులను బాగుచేసి, విద్యావ్యవస్థను మార్చేస్తే.. 6 లక్షలమంది విద్యార్థులు పభుత్వ బడులను ఎందుకు వీడినట్టు? పేదలందరికీ వైద్యాన్ని అందిస్తే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వందల కోట్ల బకాయిలు ఎందుకు పేరుకున్నాయి? కొండ ప్రాంతాల్లో మహిళలు ఆస్పత్రులకు పోతూ దారిలో ఎందుకు ప్రసవిస్తున్నారు. సరైన వైద్యం అందక అనారోగ్యంతో ప్రాణాలు వదిలిన వారిని కిలోమీటర్ల కొద్దీ భుజాలపై ఎందుకు మోసుకుపోవాల్సి వస్తోంది? సాగును బాగుచేస్తే ఆత్మహత్యల్లో మన రైతన్నలు దేశంలోనే ఎందుకు అగ్రస్థానంలో ఉన్నారు? లక్షలాది ఉద్యోగాలిస్తే నిరుద్యోగంలో మనమే ఎందుకు ముందున్నాం? అధికారం కోసం 730 హామీలిచ్చిన జగన్‌రెడ్డి 85 శాతం ఎందుకు అమలు చేయలేదు?

చెప్పుకునేందుకు ఏమీలేక తెదేపా `భాజపా `జనసేన కూటమిపై ఏడుపు. కేంద్రంలో రెండుసార్లు ప్రధానమంత్రి అయిన మోదీ లోక్‌సభలో సొంతంగానే మెజార్టీ పొందినా పొత్తులు పెట్టుకోలేదా? విజయం తథ్యమని తెలిసినా మూడోసారి కూడా పొత్తులతో సాగడంలేదా? పొత్తులు రాజ్యాంగ విరుద్ధమా? అనైతికమా? కనుక.. ఇవన్నీ ఎన్నికల ముంగిట పోగాలము దాపురించిన వారు పలికే నిస్సహాయ మాటలు, నైరాశ్యపు చేష్టలు. జగన్‌ బృందానికి తెలుసు. ఆయన దెబ్బకు విధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణమే చంద్రబాబు విధానమని.. జగనాసురవధే నినాదమని…ఐదుకోట్ల ప్రజల ఉజ్వల భవితే అజెండా అని!

Previous Post

లోకేష్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారు

Next Post

చంద్రబాబు పిలుపునకు అద్భుత స్పందన

మరిన్ని వార్తలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం

చైతన్యరధం
@ July 12, 2026
దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!
ఆంధ్రప్రదేశ్

దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!

చైతన్యరధం
@ July 11, 2026
మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం
ఆంధ్రప్రదేశ్

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist