అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం సమీక్ష నిర్వహించారు.నేతల మధ్యసమన్వయం, కార్య క్రమాల నిర్వహణ, ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఐక్యం గాపనిచేయడంపై నేతలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లా నేతలు ఇప్పటి వరకు ఎందుకు భేటీ కాలేదంటూ అధినేత అసంతృప్తి వ్యక్తంచేశారు. అమరావతి నిర్వీర్యంపై ప్రజల్లో కసి వున్నా.. నేతలు బాధ్యతగా వ్యవహరిం చడం లేదని అన్నారు. జిల్లాలో ప్రజా సమస్యలపై దూకుడు పెంచాలని ఆదేశించారు. జిల్లాలో సమస్యలపై ఐక్య పోరాటాలు చేయాలని చంద్రబాబు సూచించారు. అక్టోబరు 12న గుంటూరులో సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ సభ్యత్వ నమోదు ఓలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొన్ని నియోజక వర్గాల్లో వెనుకబడి ఉండడంపై ఇన్ చార్జ్ లను చంద్ర బాబు నాయుడు ప్రశ్నించారు. సభ్యత్వ నమోదులో ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో గురజాల నియోజక వర్గం ముందంజలో ఉండటంపై ఆ నియోజకవర్గ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని చంద్రబాబు అభినందించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియో జకవర్గాల్లో కార్యక్రమాల నిర్వహణలో నేతలమధ్య సమన్వయం సరిగా ఉండటం లేదని చంద్రబాబునా యుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. గుంటూరు నగరం లో తెలుగుదేశం పార్టీకి గట్టిపట్టు ఉందని చెబుతూ లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిందిగా రెండు నియోజ కవర్గాల ఇన్‌చార్జిలను ఆదేశించారు. ఈ సమావేశం ో మాజీమంత్రులు ప్రత్తిపాటిపుల్లారావు, ఆలపాటి రాజే ం ఓద్రప్రసాద్, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు, గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, నర్సరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జివి ఆంజనేయులు, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పార్టీనేతలు ధూళిపాళ నరేం ద్రకుమార్, నసీర్ అహమ్మద్, కోవెలమూడి రవీంద్ర, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్చార్జిలకు కొనసాగుతున్న బేటీలు –
కోవూరు ఇన్చార్జిగా దినేష్ రెడ్డి
పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జిలకు అధినేత చంద్రబాబునాయుడు వరుస బేటీలు కొనసాగుతున్నాయి. మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం భేటీ అయ్యారు. చంద్రగిరి, కోవూరు, బాపట్ల ఇన్‌చార్జిలతో సమీక్షించారు. నియోజకవర్గాల ఇన్చార్జిలు పులవార్తి నాని, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరేంద్ర వర్మ హాజరయ్యారు. కోవూరు ఇన్‌చార్జి బాధ్యతలు పోలంరెడ్డి కుమారుడు దినేష్ రెడ్డికి అప్పగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నేటితో 74 నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో అధినేత సమీక్షలు ముగిశాయి.