• గూడూరు నియోజకవర్గం చిట్టమూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్యతో అనారోగ్యపాలవుతున్నాం.
• గ్రామం మధ్యలో సమారు 8 ఎకరాల్లో కొలను ఉంది.
• కొలనులో 15 ఏళ్ల నుండి గుర్రపు డెక్కలతో నిండి ఉంది.
• దీంతో దోమల ఎక్కువగా ఉండటంతో డెంగ్యూ జ్వరాలబారిన పడుతున్నారు.
• మీ ప్రభుత్వం వచ్చాక మా సమస్యలు పరిష్కరించాలి.
• యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణం లేదు.
• గ్రామంలో సీసీ రోడ్లు లేవు..తాగు నీటికి ఇబ్బంది పడుతున్నాం.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చాక గ్రామసీమలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.
• దేశచరిత్రలో గ్రామపంచాయితీలను దొంగిలించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే.
• గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు నిర్మించాం.
• టీడీపీ ప్రభుత్వం రాగానే చిట్టమూరులో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
• ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటుచేసి 24/7 సురక్షిత నీరు అందిస్తాం.