ఏటా దేవాన్ష్ పుట్టినరోజున అన్నప్రసాదానికి విరాళం
సామాన్య భక్తునిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్నుంచే దర్శనం
వెంగమాంబ కాంప్లెక్సులో భక్తులకు అన్న ప్రసాద వితరణ
భద్రతను పక్కనపెట్టి భక్తులవద్దకు నేరుగా వెళ్లిన సీఎం
తిరుమలలో సౌకర్యాలపై భక్తులను ఆరా తీసిన వైనం
లడ్డూలో నాణ్యత మెరుగైందని సీఎంకు చెప్పిన భక్తులు
తిరుమల (చైతన్య రథం): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమల విచ్చేసిన సీఎం కుటుంబం, భక్తిశ్రద్ధలతో శ్రీవారిని కొలిచారు. ముఖ్యమంత్రివెంట ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు, మంత్రి నారా లోకేష్, మనవడు దేవాన్ష్ ఉన్నారు. దర్శనం అనంతరం టీటీడీ వేద పండితులు సీఎం కుటుంబానికి వేదాశీర్వచనమిచ్చారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబం ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు రూ.44 లక్షలను అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందజేశారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ప్రతీ ఏడాది విరాళమిచ్చే సంప్రదాయాన్ని చంద్రబాబు కుటుంబం పాటిస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటివరకు 12సార్లు విరాళమిచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో మహా ద్వార ప్రవేశం ద్వారా నేరుగా ఆలయంలోకి వెళ్లే వెసులుబాటు ఉన్నప్పటికీ సామాన్య భక్తుని మాదిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకున్నారు. తొలిసారి సీఎం అయినప్పటి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే శ్రీవారి దర్శనం చేసుకుంటున్న సీఎం… ఇప్పటికీ అదే ఆనవాయితీని పాటిస్తున్నారు. ఎప్పటిలా సామాన్య భక్తుని మాదిరిగానే శ్రీవారిపట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు.
అన్న ప్రసాదం అందిస్తూ… సౌకర్యాలపై ఆరా
శ్రీవారి దర్శనం అనంతరం ఆలయంనుంచి కాలినడకన తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్‌కు వెళ్లిన సీఎం కుటుంబం, అక్కడ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తిరుమల మాడ వీధుల్లో ముఖ్యమంత్రి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో భక్తులు ఆయన్ను చూసి ఉత్సాహంగా పలకరించారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పక్కనపెట్టి మరీ భక్తుల వద్దకు వెళ్లిన సీఎం, వారితో కరచాలనం చేస్తూ ఫోటోలు దిగారు. ఓ భక్తురాలు తన వద్దనున్న కరుంగళి మాలను సీఎంకు బహుకరించారు. దానిని ముఖ్యమంత్రి అప్యాయంగా స్వీకరించారు. లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం చాలా బాగుందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం మరింత వేగంగా జరిగేలా చూడాలని భక్తులు కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. భక్తుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఇప్పటికే ఏర్పాటు చేశామని, త్వరలోనే ఏఐ టెక్నాలజీ ద్వారా శ్రీవారి దర్శనం మరింత సులభతరం, త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.