అయినా క్యూ కాంప్లెక్స్నుంచే సామాన్యుడిలా వెళ్లి దర్శనం చేసుకున్న వైనం
తొలిసారి సీఎం అయినప్పటినుంచీ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): సీఎం చంద్రబాబు కుటుంబానికి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఇలవేల్పు. వేంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టానని… తనకు పునర్జన్మ లభించింది కూడా వేంకటేశ్వరస్వామి కటాక్షం వల్లేనని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చెబుతూనే ఉంటారు. అలాంటి వేంకటేశ్వర స్వామిపట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో తాను.. తన కుటుంబం ఉంటుందని సందర్భం వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి భక్తిభావంతో చెబుతారు. మాటలు చెప్పడమే కాదు.. దాన్ని తూచా తప్పకుండా సీఎం చంద్రబాబు ఆచరణలో పెడుతున్నారు. సీఎం హోదాలో ఉన్నవారికి తిరుమలలో మహాద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. సీఎంకు ప్రొటోకాల్ ఉంటుంది కాబట్టి… తిరుమలలో మహా ద్వార దర్శనం చేసుకోవచ్చు. కానీ దేవునిముందు అందరూ సమానమేననే సూత్రాన్ని సీఎం చంద్రబాబు పాటిస్తారు. అందుకే చంద్రబాబు తిరుమల కొండకు ఎప్పుడొచ్చినా… క్యూ కాంప్లెక్స్ ద్వారానే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో తప్పించి… మిగిలిన సందర్భాల్లో క్యూ కాంప్లెక్స్ ద్వారానే కుటుంబంతో సహా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.
సామాన్య భక్తుల ఇబ్బందులు తెలుసుకునేందుకు..
క్యూ కాంప్లెక్స్ మార్గంలో సాధారణ భక్తుల తరహాలోనే శ్రీవారి దర్శనాని వెళ్తూ టీటీడీ ఏర్పాట్లు, భక్తుల ఇబ్బందులు చంద్రబాబు స్వయంగా పరిశీలిస్తారు. క్యూ కాంప్లెక్స్‌లో ప్రసాదం పంపిణీ, తాగునీరు, పారిశుధ్యంవంటి అంశాలు ఎలా ఉన్నాయో స్వయంగా చూస్తారు. లోపాలేమైనా ఉంటే వెంటనే సరిదిద్దాలని టీటీడీకి సూచించేందుకు చంద్రబాబు ఇలా క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళతారు.
ఎన్టీఆర్ పెట్టిన ట్రస్ట్.. దేవాన్ష్ విరాళం
ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు తిరుమల కొండకు వచ్చే భక్తులకు అన్నప్రసాదంతో ఆకలి తీరుస్తూనే ఉంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సులో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుంది. ఈ ట్రస్టుకు తన మనుమడు దేవాన్ష్ పుట్టినప్పటి నుంచీ ప్రతి ఏడాది విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్నారు. దేవాన్ష్ పేరుతో అన్నదానం కోసం 12సార్లు విరాళం అందించారు. మొత్తంగా ఇప్పటి వరకూ రూ.3.4 కోట్లు అన్నదానం కోసం విరాళంగా అందించారు.