- పెండిరగ్ బిల్లులు రూ.1,41,588 కోట్లు
- ఐదేళ్ల వైసీపీ పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం
- రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లుపైనే
- నేడు శ్వేతపత్రం విడుదల
అమరావతి(చైతన్యరథం): వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం 2019-24 మధ్య లక్షా 41 వేల 588 కోట్ల రూపాయల పెండిరగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండిరగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నట్లు తేల్చింది. 93 వేల కోట్లు సీఎఫ్ఎమ్ఎస్లోకి అప్లోడ్ చేయలేదని, 48 కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని నిర్ధారించింది.
నీటిపారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండిరగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19 వేల 324 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు, ఆర్థిక శాఖ నుంచి 19 వేల 549 కోట్ల బిల్లులు పెండిరగ్లో ఉన్నట్లు నిర్ధారించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.14 వేల కోట్లకు పైగా బకాయిలు, మున్సిపల్ శాఖలో రూ.7 వేల 700 కోట్ల బకాయిలు కలిపి మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు.
కాగా రాష్ట్రంలో అన్ని శాఖలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు అంశాలపై ఆయన శ్వేతపత్రాలను విడుదల చేశారు. పోలవరం, అమరావతి, విద్యుత్ రంగం, ఇసుక దోపిడీ వంటి అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు వాటి వివరాలను ప్రజల ముందుంచారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై బుధవారం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి గత ప్రభుత్వంలో భద్రతా వైఫల్యాలను ఎండగట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఆర్థిక సంక్షోభాన్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థికచిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు.