నరసాపురం (చైతన్యరథం): అర్నాబ్ తుఫాను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. తుఫాను కారణంగా కలిగిన నష్టాలను వివరిస్తూ ఏర్పాటుచేసిన ఫొటోలను చూశారు. అనంతరం నర్సాపురం మండలం కొత్తనవరసపురంలో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. అన్నదాతలతో మాట్లాడి వారికి జరిగిన పంట నష్టంపై ఆరా తీశారు. అక్కడి నుంచి మొగల్తూరు మండలం మాట్రేవు గ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యంలో కారు దిగి బాగా దెబ్బతిన్న కొబ్బరి తోటను పరిశీలించి రైతుతో
మాట్లాడారు. అనంతరం మాట్రేవులోని పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులతో మాట్లాడారు. మీకు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చి బాధితులకు రేషన్ పంపిణీ చేశారు.


