ఢిల్లీ(చైతన్యరథం): సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం ఢల్లీి వెళ్లిన ఆయన అక్కడ నుంచి వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఏచూరి నివాసానికి చేరుకుని నివాళులర్పించి కుటుంబసభ్యు లను పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం నేత బృందాకారత్, ఏచూరి కుటుంబ సభ్యులతో ఏచూరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బడుగుల అభ్యున్నతి కోసం ఏచూరి ఆవిరళ కృషి చేశారని కొనియాడారు. ఏచూరి కమ్యూనిస్టు భావజాలాన్ని నమ్మడమే కాకుండా జీవితంలో ఆచరించారని పేర్కొన్నారు. గొప్ప రచయిత, రాజకీయవేత్త, ఆదర్శప్రాయుడు, అజాతశత్రువు మన తెలుగువాడు సీతారాం ఏచూరి మృతిచెందడం ఎం తో బాధ కలిగిస్తుందని సంతాపం వ్యక్తం చేశారు.