చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

’రా… కదలిరా’

5 నుంచి జనంలోకి చంద్రబాబు

by చైతన్యరధం
Jan 3, 2024 at 8:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
’రా… కదలిరా’
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 5 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంట్ల పరిధిలో భారీ బహిరంగ సభలు
  • ప్రతి సభకు లక్షలాదిగా జనం తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం
  • టీడీపీ-జనసేన సంయక్తంగా నిర్వహించే ఈ సభలకు పవన్‌ కల్యాణ్‌ కూడా హాజరవుతారు
  • 4న పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు చేతులమీదుగా ‘జయహో బీసీ’ ప్రారంభం
  • పంచాయతీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యంపై నేడు వర్క్‌ షాప్‌
  • అసమ్మతులు, అసంతృప్తులకు భయపడి జాబితా ప్రకటనపై జగన్‌ వెనకడుగు
  • జగన్‌ రెడ్డిని సొంత పార్టీ నేతలే విశ్వసించడం లేదు.
  • టీడీపీలో చేరడానికి చాలామంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు.

అమరావతి: జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిలో చైతన్యం తేవటమే లక్ష్యంగా ఈ నెల 5వ తేదీ నుంచి ‘‘రా కదలి రా!’’ పేరిట ఉధృత ప్రచార కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు.  5 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంట్ల పరిధిలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. అన్ని సభలు తెలుగుదేశం – జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. చంద్రబాబు – పవన్‌ కళ్యాణ్‌ కలిసి పాల్గొనే సభల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అంతకుముందు బుధవారం (3వ తేదీ) మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం సమీపంలోని కన్వెన్షన్‌ సెంటర్లో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్థాయి పంచాయతీ రాజ్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. 4వ తేదీన పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు చేతులమీదుగా ‘జయహో బీసీ’ కార్యక్రమం ప్రారంభించనున్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడారు. విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య,  కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత 56 నెలల నుంచీ విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్‌ రెడ్డి.. అవినీతిపరులను, అసమర్థులను, నేరస్తులను పెంచి పోషిస్తున్నాడని మ్డఇపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా విధ్వంసాలు, విద్వేషాలు, వైఫల్యాలు తప్ప, భూతద్దంలో వెతికినా కూడా ఎక్కడా ఒక మంచిపని కానీ, విజయం కానీ కనిపించవన్నారు. భస్మాసురుడిలా జగన్‌ రెడ్డి మొత్తం రాష్ట్రాన్నే విధ్వంసం చేశాడని అచ్చెన్నాయుడు విమర్శించారు.

జగన్‌ రెడ్డి పాలనలో ఏ వర్గానికి రక్షణ లేదు. సమాజంలో సగభాగమున్న మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికారాన్ని బాధ్యతగా భావించి, ప్రజలకు రక్షణగా ఉండి వారి క్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రే, ఏపీ ని అంధకారంలోకి నెట్టేశాడు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. పంచాయతీల అభివృద్ధికి పైసా నిధులు ఇవ్వని జగన్‌ రెడ్డి, ఆఖరికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.9వేల కోట్లను దారిమళ్లించాడు. జగన్‌ నిర్వాకంతో గ్రామాల్లో ఎక్కడా మచ్చుకైనా కూడా అభివృద్ధి లేకుండా పోయింది. ఆఖరికి మురుగుకాల్వలు బాగుచేయడానికి కూడా పంచాయతీల ఖాతాల్లో పైసా సొమ్ము లేకుండా చేశాడు. గ్రామాల్లో చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, ఈ నాలుగున్నరేళ్లలో ఎక్కడా ఎలాంటి మంచిపని జరగలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తీసుకున్న అనేక నిర్ణయాలు గతంలో దేశవ్యాప్తంగా అమలయ్యాయి… ప్రముఖుల ప్రశంశలు అందుకున్నాయని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

రాబోయే 100 రోజుల్లో నిర్విరామంగా టీడీపీ కార్యక్రమాలు

2019లో జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళనాంధ్రప్రదేశ్‌ గా మార్చాడు. 22 రోజు లకు పైగా అంగన్‌ వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రిలో చలనంలేదు. సర్వశిక్షా అభియాన్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆశావర్కర్లు అందరూ జగన్‌ రెడ్డిని నమ్మి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని రోడ్లెక్కారు. ఈ ప్రభుత్వం కథ ముగిసింది. 100 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. చివరి దశకు చేరిన జగన్‌ రెడ్డి దుర్మార్గపు పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం, జగన్‌ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావడానికి టీడీపీ నిర్విరామంగా కార్యక్రమాలు చేపట్టనుందని అచ్చెన్నాయుడు తెలిపారు.

పంచాయతీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యంపై నేడు టీడీపీ ఆధ్వర్యంలో వర్క్‌ షాప్‌

టీడీపీ చేపట్టబోయే కార్యక్రమాల్లో ముందుగా 3వ తేదీన (బుధవారం) మంగళగిరి లోని  పార్టీ జాతీయ కార్యాలయం సమీపంలోని కన్వెన్షన్‌ సెంటర్లో రాష్ట్రస్థాయి పంచాయతీ రాజ్‌ వర్క్‌ షాపు నిర్వహించబోతున్నాం. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పంచాయతీ సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఆహ్వానం పంపించాం. వారందరి సమక్షంలో ఈ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏవిధంగా నిర్వీర్యం చేసిందో, జగన్‌ రెడ్డి ఏ విధంగా పల్లెల్ని నాశనం చేస్తాడో తెలియచేస్తాం. మేము చెప్పే అంశాలను స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు.. ప్రజలకు తెలియచేస్తే, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లినట్టే. అలానే టీడీపీ ప్రభుత్వ రాగానే పంచాయతీల బలోపేతానికి, పునర్వైభవానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో, ఏ విధమైన కార్యాచరణ అమలుచేస్తామో  కూడా ఈ వర్క్‌ షాపులో తెలియచేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు.

 బీసీలపై దమనకాండ అందరికీ తెలియచేప్పేందుకే ‘జయహో బీసీ’

బీసీల గురించి జగన్‌ రెడ్డి గొప్పగా మాట్లాడుతున్నాడు. కానీ తన పాలనలో బీసీలను దారుణంగా వంచించాడు. వారిపై తప్పుడు కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేయించాడు. తన దుర్మార్గాలు ప్రశ్నించిన బీసీలను దారుణంగా చంపించాడు. 4 సంవత్సరాల 7 నెలలుగా ఈ ముఖ్యమంత్రి బీసీలపై దమనకాండ సాగిస్తున్నాడు. బీసీలుగా పుట్టడమే తప్పు అన్నట్టు వారిపై తన పైశాచికత్వం ప్రదర్శిస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు 10శాతం కోత పెట్టాడు. 16వేలకు పైగా పదవుల్ని బీసీలకు దక్కకుండా చేశాడు. ఉత్తుత్తి కార్పొరేషన్లు పెట్టి బీసీలను ఉద్ధరిస్తున్నట్టు కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు. బీసీ మంత్రుల్ని ఉత్సవ విగ్రహాల కంటే దారుణంగా తయారుచేశాడు. బీసీలపై ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను ప్రతి బీసీసోదరుడు/సోదరికి అర్థమయ్యేలా తెలియచేయడానికి టీడీపీ ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని 4వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించబోతున్నారు. 4వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో కార్యక్రమం జరుగుతుంది. అలానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ ఇంటి తలుపు తట్టేలా ‘జయహో బీసీ’ దిగ్విజయంగా కొనసాగుతుందని అచ్చెన్నాయుడు వివరించారు.

5వ తేదీ నుంచి ప్రజల్లోకి చంద్రబాబు

ఈ నెల 5వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. దానిలో భాగంగా  ‘రా..కదలిరా’ పేరుతో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. 5వ తేదీ నుంచి 29వ తేదీవరకు 22 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. రోజుకి 2 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది. ప్రతిసభకు లక్షలాది ప్రజలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రజలు రావడానికి  సిద్ధంగా ఉన్నారని, తమ నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని పలువురు నేతలు కోరుతున్నా, సమయాభావం వల్ల కొన్నిప్రాంతాలకే పరిమితమయ్యాం. సభలకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నాం. 1982లో టీడీపీ ఆవిర్భవించక ముందు ఉన్న పరిస్థితుల కంటే దారుణమైన పరిస్థితులు నేడు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దాలంటే, మరలా రాష్ట్రానికి కొత్త ఊపిరి రావాలంటే, చంద్రబాబునాయుడి నాయకత్వంతోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కర్షకులు, కార్మికులు, మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు, శ్రామికులు ఇలా అందరూ ఆనందంగా బతకాలంటే అది చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమని నమ్ముతున్నారు. రాష్ట్రానికి స్వర్ణయుగం టీడీపీతోనే సాధ్యం. ఏపీ ఒక నూతన నవోదయం చూసేందుకు టీడీపీ-జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. రెండుపార్టీల కలయికను, అవి నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభల వివరాలు…

5వ తేదీన : ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని కనిగిరిలో..

6వ తేదీన : విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని తిరువూరు, నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని ఆచంట.

9వ తేదీన : తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్‌ పరిధిలోని ఆళ్లగడ్డ.

10వ తేదీన : విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్‌ పరిధిలోని తుని.

18వ తేదీన : తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా        మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని గుడివాడ లో భారీస్థాయిలో సభ

19వ తేదీన : చిత్తూరు పార్లెమంట్‌ పరిధిలోని జీడీ నెల్లూరు,  కడప పార్లమెంట్‌ పరిధిలోని కమలాపురం

20వ తేదీన : అరకు పార్లమెంట్‌ పరిధిలోని అరకులో,  అమలాపురం పార్లమెంట్‌ పరిధిలోని మండపేట.

24వ తేదీన : రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని ఉవరకొండ.

25వ తేదీన : నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని కొవ్వూరు, కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని పత్తికొండ

27వ తేదీన : రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్‌ లోని పొన్నూరు

28వ తేదీన: అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలోని టెక్కలి

29 వ తేదీన : ఏలూరు పార్లమెంట్‌ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంట్‌ చీరాల ఆ భారీ బహిరంగ సభలను  టీడీపీ ` జనసేన కలిసే నిర్వహిస్తున్నాయి. చంద్రబాబుతో పాటు, పవన్‌ కల్యాణ్‌ కూడా కొన్ని సభలకు హాజరవుతారు. టీడీపీ చేపట్టబోయే కార్యక్రమాలు, చంద్రబాబునాయుడి సభలకు భారీగా తరలి వచ్చి వాటిని విజయవంతం చేయాలని ప్రజల్ని అచ్చెన్నాయుడు కోరారు.

టీడీపీలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు

తెలుగుదేశంలో  చేరడానికి చాలామంది అధికారపార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ మేమే ఆచితూచి వ్యవహరిస్తున్నాం. పార్టీలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు వేశాం. కమిటీల అభిప్రాయాలు, అధినాయకుడి నిర్ణయమే అంతిమం. పార్టీ నేతలతో సంప్రదించాకే కొత్తవారి చేరికపై స్పష్టమైన నిర్ణయానికి వస్తాం. ఒక వారంలో తెలుగుదేశంలో చేరే ఇతర పార్టీల నేతలపై స్పష్టత వస్తుంది.  సొంత పార్టీ నాయకులకే ఈ ముఖ్యమంత్రిపై విశ్వాసం లేదు. ఈ రోజో, రేపో తనపార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నానన్నాడు. మరలా పిల్లిలా వెనకడుగు వేశాడు. ప్రసారమాధ్యమాల్లో వచ్చిన కథనాలకు భయపడినట్టున్నాడని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

Previous Post

విశాఖ పాలిట శాపంలా పాపాల పాలకులు: లోకేష్‌

Next Post

మంగళగిరిని నెం.1గా చేద్దాం…కలసిరండి: లోకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026

కార్యకర్త
@ August 5, 2026
నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్
ఆంధ్రప్రదేశ్

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

చైతన్యరధం
@ August 5, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్

డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

చైతన్యరధం
@ August 5, 2026
నైతిక విలువలతోనే విద్యా వికాసం
ఆంధ్రప్రదేశ్

నైతిక విలువలతోనే విద్యా వికాసం

చైతన్యరధం
@ August 5, 2026
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి

చైతన్యరధం
@ August 4, 2026
అర్హులందరికీ ‘నేతన్న సేవలో’
ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ ‘నేతన్న సేవలో’

చైతన్యరధం
@ August 4, 2026
ప్రజా సంక్షేమం.. అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ప్రజా సంక్షేమం.. అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ August 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026

కార్యకర్త
@ August 4, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

చైతన్యరధం
@ August 2, 2026
కూటమి కలయికే.. అభివృద్ధి

కూటమి కలయికే.. అభివృద్ధి

చైతన్యరధం
@ August 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

చైతన్యరధం
@ August 5, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

చైతన్యరధం
@ August 5, 2026
నైతిక విలువలతోనే విద్యా వికాసం

నైతిక విలువలతోనే విద్యా వికాసం

చైతన్యరధం
@ August 5, 2026
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి

చైతన్యరధం
@ August 4, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist