- చకచకా తిరుమల కొండెక్కగలవా జగన్
- రా.. ఎవరు ముసలాడో తేల్చేద్దాం
- నువ్వు బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి
- కొబ్బరికాయ కొట్టాలంటే రాయి ఎత్తాలి
- సమీక్షలో గంట కూర్చోలేవు, కుర్రాడివా?
- జగన్ పెడసరంపై విరుచుకుపడిన లోకేష్
- మాడుగుల శంఖారావంలో యువనేత ప్రతిధ్వని
మాడుగుల: టీడీపీ అధినేత చంద్రబాబులోని శక్తి, సత్తువలో రవ్వంతైనా ముఖ్యమంత్రి జగన్‌లో లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయన వయసుతో చూసినా, అనుభవంలో చూసినా బచ్చావి.. ఆయనతో నీకు పోటీనా? అంటూ ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి ప్రతి సభలోనూ తన తండ్రి వయసున్న చంద్రబాబును ముసలోడు, ముసలోడు అంటూ సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడుగులలో మంగళవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ జగన్ బస్సు దిగాలంటే స్టూలు వేయాలి.. జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు రాయిని ఎత్తిపట్టు కుంటే జగన్ నడుం వంచకుండా కొబ్బరికాయ కొడతాడు. జగన్ బైకు నడపాలంటే ఇటు నలుగురు, అటు నలుగురు పట్టుకోవాలి. గత ఐదేళ్ల నుంచి చూస్తే పట్టుమని గంట పాటు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. సాయంత్రం 6 అయితే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి పడుకుంటాడని ఎద్దేవా చేశారు. మై డియర్ జగన్… డేట్, టైమ్ నువ్వు ఫిక్స్ చేయ్… తిరుమల కొండనో, పక్కనే ఉన్న రామతీర్థం కొండనో చంద్రబాబు, మీరు కలిసి ఎక్కండి… ఎవరు ముందు ఎక్కుతారో, ఎవరు ఆయాసపడతారో తేలిపోతుంది. ఎవరు కుర్రాడో, ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్ అని లోకేష్ సవాల్ విసిరారు.
చదువుకు దూరంగా పిల్లలు
ఎన్నికలకు ముందు నవరత్నాలు అన్నారు. ఇప్పుడు బూతులకు రత్నాలు ఇస్తున్నారు. మొదటి బూతు రత్నం సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని. టెన్త్ క్లాస్ పేపర్ దొంగతనం కేసులో జగన్ హైదరాబాద్ లో దొరికాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో జగన్‌ను చితకబాదారు. ఇది చాలా మందికి తెలియదు. అలాంటి వ్యక్తి నాడు-నేడు అంటుంటే ఏదో చేస్తారని అనుకున్నారు. గత ఐదేళ్లుగా 32 వేల పాఠశాలల్లో ప్రారంభించిన పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. మనం కట్టిన భవనాలకు రంగులేసి తాను కట్టినట్లుగా చెప్పుకుంటున్నాడు. పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారు. 117 జీవోతో పాఠశాలలు విలీనం చేసి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు. దీనివల్ల పిల్లలు చదువుకు దూరమవుతున్న రాష్ట్రాల్లో దక్షిణభారతంలోనే ఏపీ ఒకటో స్థానంలో ఉంది. దేశంలో 12.6 శాతం ఉంటే ఏపీలో 16.3శాతం డ్రాప్ అవుట్లు ఉన్నాయి. 2022-23లో లక్షా 93వేల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యలో చదువు ఆపేశారు. మేం వస్తే 117జీవో రద్దుచేసి..విద్యను ప్రతి గడపకు తీసుకెళ్తాం. ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, ప్రహరీ గోడలు డిజిటిల్ క్లాస్ రూంలు చంద్రబాబు నిర్మిం చారు. అన్న ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి లక్షా 75వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని లోకేష్ అన్నారు.
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు
జగన్ అద్భుతమైన కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకు రెండు బటన్ లు ఉంటాయి. బల్ల పైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10 వేస్తాడు. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కి వంద రూపాయలు లాగేస్తాడు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి బాదుడే బాదుడు. ఇంటిపన్ను పంచి, చెత్తపన్ను పెంచి, మద్యం ధరలు పెంచి బాదుడే బాదుడు. ఇక జగన్ కటింగ్ మాస్టర్ కూడా. అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్, విదేశీ విద్య కట్, పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్.. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని లోకేష్ దుయ్యబట్టారు.
టీడీపీతోనే సంక్షేమం
ఈ మధ్య వాలంటీర్ వాసు వచ్చి అబద్ధాలు చెబు తున్నాడు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోగా నిజం గడప దాటదు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షే మ కార్యక్రమాలు రద్దుచేస్తారని అబద్ధాలు చెబుతున్నా రు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. ఆనాడు రూ.2కే కేజీ బియ్యం, మహిళలకు ఆస్తిలో సమానహక్కు, రూ.50కే హార్స్ పవర్ మోటార్ అందించాం. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు దీపం పథ కం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. పెళ్లికానుకలు, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, పసుపు కుంకుమ, అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ లాంటి 100 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్ర బాబు అని లోకేష్ చెప్నారు.
ప్రజల కష్టాలు తీర్చేందుకే సూపర్`6
ప్రజలు పడుతున్న కష్టాలు చూసి బాబు-పవన్ కలిసి కూర్చొని అద్భుతమైన సూపర్-6 హామీలను ప్రకటించారు. మొదట హామీ.. ఐదేళ్లలో నిరుద్యోగ యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అప్పటి వరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. రెండో హామీ.. అమ్మకు వందనం కింద స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు వేస్తాం. ఇంట్లో ఒక్కరుంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు,ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు వేస్తాం. మూడో హామీ.. ప్రతి రైతుకు సంవత్సరా నికి రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. నాలుగో హామీ.. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. ఐదో హామీ.. 18 నుంచి 59 సంవత్సరాలు వయసున్న మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తాం, సంవత్సరానికి రూ.18వేలు, ఐదు సంవత్సరాలకు రూ.90 వేలు మన ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఆరో హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ చేసే హక్కు కూడా కల్పించబోతున్నా మని లోకేష్ వివరించారు.
జీవితాలతో మూడు ముక్కలాట
అసలు ఉత్తరాంధ్రకు పట్టినదరిద్రం జగన్. మూడు రాజధానులు పేరుతో మన జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నాడు. ఒక్క పరిశ్రమ, ఉద్యోగం తీసుకురాలేదు. ఆనాడు విశాఖ ఉక్కు-ఆంధ్రల హక్కు అని పోరాడారు. ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తు న్నారు. ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మాది.
విశాఖజిల్లాకు జగన్ తన పాదయాత్రలో 50 హామీ లు ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తామన్నారు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నా రు, పూర్తిచేయలేదు. మూత పడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామన్నారు, చేయలేదు. 8లక్షల ఎకరాల ఆయ కట్టుకు సాగునీరు అందిస్తామన్నారు. ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదు. విశాఖ జిల్లాకు పెద్దఎత్తున పరిశ్రమ లు, ఐటీ కంపెనీలు తీసుకువస్తామన్నారు. పక్కనున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకు ఆ పరిశ్రమలు కూడా పారి పోతున్నాయి. ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం పరువు తీసినందుకు కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు బహుమతి గా పంపించామని లోకేష్ చెప్పారు.
ఎమ్మెల్యేకు అన్నింటిలోనూ వాటాలే
మాడుగుల హల్వా అంటే నాకుబాగా ఇష్టం. టీడీపీ హయాంలో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిచేశాం.నేను పం చాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో 202కి.మీ సీసీ రోడ్లు వేశాం. బీటీ రోడ్లు, సాగు, తాగు నీటి ప్రాజెక్టులు నిర్మించాం. పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు పెద్దఎత్తున నిర్మించాం. చిన్న పరిశ్రమలను కూడా తీసుకువచ్చాం. రైతుల కోసం ఇన్‌పుట్ సబ్సీడీ ఇచ్చి ఆదుకున్నామని లోకేష్ చెప్పారు.
అయినా 2019లో పాలిచ్చే ఆవును కాదని తన్న దున్నపోతును తెచ్చుకున్నారు. ముత్యాలనాయుడుని ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఏపీ ఉపముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి నియోజకవర్గంలో పనులు ఎలా జర గాలి? ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలి. గత ఐదేళ్లలో ఒక్క రోడ్డు వేయలేదు, గుంత పూడ్చలేదు. ఉపముఖ్య మంత్రి చెబితే అధికారులు ఎవరైనా కదులుతారు. కానీ ఈయన అవినీతి కోసం ఫోన్లు చేస్తారు. అభివృద్ధి నిల్,
అవినీతి ఫుల్.
పెద్దఎత్తున గ్రానైట్, ఇసుకను తవ్వేస్తున్నారు. కేం ద్రం ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి అంటే వాటాల కోసం నిధులు పక్కదారి పట్టించారు. ఏ అధికారిని ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా డబ్బులు ఇవ్వాలి.ప్రతినెల మైన్ ఓనర్లు, క్వారీ ఓనర్ల దగ్గర నుంచి కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు.ఏ కాంట్రాక్టు పనులు జరగాలన్నా సొంత కంపెనీచేయాల్సిందేనని లోకేష్ దుయ్యబట్టారు.
గెలిపించకపోయినా మీతోనే ఉన్నాం
మీరు గెలిపించినా, గెలిపించకపోయినా మేం ఎప్పు డూ అండగా ఉన్నాం. పక్కనే ఉన్న అయ్యన్నపాత్రుడు, నేను నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం. 2024లో టీడీపీ-జనసేన బలపరిచిన అభ్యర్థిని గెలి పిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం. చంద్రబాబు ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేస్తాం. తాల్చేరు-ఉరకగడ్డ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. డిగ్రీ కళాశాల కోసం శాశ్వత భవనాలు నిర్మిస్తాం. నల్ల రాయి క్వారీ పనులు ప్రారంభిస్తాం. మొదటి రెండేళ్లలో ప్రతి రోడ్డు వేస్తాం. కోలగట్ట-దేవరపల్లి బ్రిడ్జిలు కూడా పూర్తిచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తాం
గిరిజన గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడు తున్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. గిరిజనులకు రావాల్సిన 17సంక్షేమ కార్య క్రమాలను నేడు జగన్ రద్దు చేశారు. మేం అన్నింటినీ పునరుద్దరిస్తాం. గోవాడ షుగర్ ఫ్యాక్టరీపై పవన్ చాలా స్పష్టంగా చెప్పారు. మద్దతు ధర కల్పిస్తామని పొత్తుకు ముందే ప్రకటించారు. పవన్ హామీ ఇస్తే అది టీడీపీ-జనసేన హామీ ఇచ్చినట్లే. వందకోట్లు కేటాయించి ఇథ నాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే రైతులకు మేలు జరుగు తుంది. తప్పనిసరిగా నిధులు కేటాయించి ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామని లోకేష్ చెప్పారు.
ఎవరినీ వదిలిపెట్టను
టీడీపీ బలం టీడీపీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు అండగా నిలబట్టారు. అన్న ఎన్టీ ఆర్ ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో.. ఆ పసుపు జెండాను చూస్తేనే మనకు నూతనఉత్సాహం వస్తుంది. వైకాపా నాయకులకు బూమ్ బూమ్,ప్రెసిడెంట్ మెడల్ కావాలి కానీ.. మనకు మాత్రం చంద్రబాబు రా.. కదలిరా… అంటే చాలు.
2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుచేసి.. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా ఇచ్చి ఆదుకున్నాం. ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుచేశాం. వారి పిల్లలను చదివించ లేకపోతే నా తల్లి భువనేశ్వరమ్మ దత్తత తీసుకుని చది విస్తున్నారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడ తాం. చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన అధికారు ల పేర్లు ఎర్రబుక్‌లో ఉన్నాయి. నేను ఎవరినీ వదిలి పెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తాం. నాపైనా 22 కేసులు పెట్టారు.ఎవరెక్కువ కేసులు పెట్టించుకుంటారో వారికే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. నాపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు, హత్యాయత్నం కేసులు పెట్టారు. 2019కి ముందు నేను ఏనాడూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేదు. సైకో పాలనలో ఇప్పటికి 7సార్లు వెళ్లొచ్చాను. పోలీస్ స్టేషన్ అత్తగారిల్లులా ఉంది. ఇలా వేలాది మంది మన నాయ కులపై కేసులు పెట్టారని లోకేష్ ధ్వజమెత్తారు.
చిచ్చుకు పేటీఎం బ్యాచ్ కుట్రలు
అన్న ఎన్టీఆర్ దేవుడు.. చంద్రబాబు రాముడు.. వైకాపాకు ఈలోకేష్ మూర్ఖుడు. 14ఏళ్లు ముఖ్యమంత్రి గా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్ర బాబు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. 53రోజులు రాజమండ్రి జైలులో నిర్బంధిం చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మొదట రూ.3వేల కోట్ల కుంభకోణం అన్నారు… తర్వాత రూ.300 కోట్లన్నారు..ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు. ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు. బాంబులకే భయపడని మేము చిల్లర కేసులకు భయపడతామా? నాకు ఆనాడు మొదట ఫోన్ చేసిన వ్యక్తి పవనన్న. నాకు అండగా నిలబడతానని చెప్పారు.
పవన్ ప్రత్యేక విమానంలో ఆంధ్రా రావాలంటే ఈ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రోడ్డు మార్గంలో రావాలంటే రాష్ట్ర సరిహద్దులో 3 గంటలు నిలిపివేశారు. ఆనాడే పవన్ నిర్ణయించారు..ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అని. టీడీపీ-జనసేన కలిసికట్టుగా తరిమితరిమి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయి. మన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాచ్ కుట్రలు చేస్తున్నారు. వారికి రూ.5 ఇస్తే చాలు. పసుపు సైనికుల పేరుతో జనసైనికులను తిడతారు. జనసైనికుల పేరుతో పసుపుసైన్యాన్ని తిడతారు. మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. పవనన్న ఇచ్చిన నినాదం హలో ఏపీ.. బైబై వైసీపీ.. నినాదానికి కట్టుబడి ఉండాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.