అమరావతి: రాష్ట్రంలో పెండిరగ్ విమానాశ్రయాల పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చెప్పారు. ీ అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున శనివారం వచ్చిన రామ్మోహన్ నాయుడు లాబీలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేతలు ఇరువురు ఆత్మీయ ఆలింగనం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం కాసేపు మాట్లాడుకున్నారు. రాష్ట్రంలోని పెండిరగ్ విమానాశ్రయాలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడ్ని నారా లోకేష్ ఆరా తీశారు. పెండిరగ్ విమానాశ్రయాలను రెండేళ్ల లోపు పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు బదులిచ్చారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రామ్మోహన్ నాయుడ్ని లోకేష్ కోరారు.