TDP – తెలుగు దేశం పార్టీ

Tag: మంత్రి నారా లోకేష్

  • ఉపాధి కల్పించి ఆదుకోండి!

    ఉపాధి కల్పించి ఆదుకోండి!

    • భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు, న్యాయం చేయండి
    • 30వ రోజు మంత్రి నారా లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’లో విన్నపాల వెల్లువ
    • సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి భరోసా

    అమరావతి(చైతన్యరథం): ఆపదలో ఉన్న వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ నిర్వహిస్తున్న ‘‘ప్రజాదర్బార్‌’’ అండగా నిలుస్తోంది. ఉండవల్లి నివాసంలో 30వ రోజు శుక్రవారం ప్రజాదర్బార్‌కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్‌ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి… తాను అండగా ఉంటానని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో కొన్నింటిని చూస్తే…

    అన్న క్యాంటీన్‌ లో ఉపాధి కల్పించండి
    అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు పెన్షన్‌ మంజూరుచేయడంతో పాటు కుటుంబ పోషణ కోసం అన్న క్యాంటీన్‌ లో ఉపాధి కల్పించాలని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంకు చెందిన షేక్‌ ఖాసీంబీ.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తమకు శాశ్వత ఇల్లు మంజూరుచేసి ఆదుకోవాలని చినకాకానికి చెందిన డి.అరుణ కుమారి కోరారు.

    దివ్యాంగుడనైన తాను డిగ్రీ పట్టభద్రుడనని, ఎలాంటి ఆధారం లేని తమ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఉండవల్లికి చెందిన ఏ.రామారావు విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

    భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు, న్యాయం చేయండి
    రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విన్నపాలు చూస్తే.. దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని, విచారించి ఎన్‌వోసీ జారీ చేయాలని శ్రీకాకుళం జిల్లా ఫాజుల్‌ బాగ్‌ పేటకు చెందిన తిర్లంగి లక్ష్మి కోరారు.
    తెలుగు, సంస్కృత అకాడమీలో టైమ్‌ స్కేల్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏను కొనసాగించాలని సిబ్బంది కోరారు.
    ఏపీ సాంకేతిక విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, పోస్టింగ్‌ ఆర్డర్స్‌ మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
    గత వైసీపీ ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించాలని నంద్యాల జిల్లా తమ్మరాజుపల్లెకు చెందిన పాణ్యం శివ విజ్ఞప్తి చేశారు.
    డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన గెడ్డం శ్యామ్‌ బాబు కోరారు.
    క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న తనకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా వైద్య సాయం అందించాలని నెల్లూరుకు చెందిన ఏ.సుజాత విజ్ఞప్తి చేశారు.
    వంశపారంపర్యంగా సంక్రమించిన తమ 2.08 ఎకరాల వ్యవసాయ భూమికి పట్టా, పాస్‌ బుక్‌ మంజూరు చేయాలని తిరుపతి జిల్లా గాజులపెళ్లూరుకు చెందిన ఎమ్‌.రజిత కోరారు.
    గత వైసీపీ ప్రభుత్వ అండతో నకిలీ పత్రాలు సృష్టించి తన 32 సెంట్ల స్థలాన్ని బంధువులు కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం కనుమలచెరువుకు చెందిన గుమ్మా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

  • చేనేతలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి

    చేనేతలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి

    • చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

    మంగళగిరి(చైతన్యరథం): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారు లకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబసభ్యుడిని చేసింది. చేనేత కళాకారుల కష్టాలు చూశాను. సమస్యలపై పూర్తి అవగాహన వచ్చింది. యువగళం పాదయాత్రలో చేనేత రంగం లక్షలాది మంది జీవనానికి ఉపయోగపడటమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే ఓ కళ అని పూర్తిస్థాయి అవగాహన కలిగింది. చేనేతరంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని పాదయాత్రలోనే మాటిచ్చాను. సమాంతరంగా మన మంగళగిరిలో చేనేతలకు చేయూతనందించే వీవర్స్‌శాల పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించి టాటా తనేరా సంస్థతో అనుసంధానం చేశాం.

    పేద చేనేత కళా కారులకు మగ్గాలు, ఇతర సామగ్రి అందించాను. చేనేత రంగం, కార్మికుల సమస్యలన్నీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొంది స్తోంది. మన మంగళగిరి-మన చేనేత అనే నినాదంతో దేశవ్యాప్తంగా మన చేనేత వస్త్రా లకు బ్రాండిరగ్‌ కల్పిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీని మంగళగిరి చేనేత కళాకారులు నేసిన శాలువాతో సత్కరించాను. నా తల్లి, నా భార్య మంగళగిరి చేనేత చీరలు ధరిస్తూ, మన చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. చేనేతలకు చేయూతనందించడం మా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటి. చేనేత కళకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను’’ అని తెలిపారు. తనను ఆదరించి ఆశీర్వదించిన చేనేత కుటుంబ సభ్యులందరికీ చేనేత దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

  • యుఎస్‌ కాన్సుల్‌ జనరల్‌తో భేటీ సంతోషం కలిగించింది: లోకేష్‌

    అమరావతి(చైతన్యరథం): అమెరికా కాన్సలేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ మంగళవారం రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీపై నారా లోకేష్‌ ఎక్స్‌లో స్పందిస్తూ… అమెరికా కాన్సులేట్‌ జనరల్‌తో సమావేశం సంతోషం కలిగించిందని తెలిపారు. భారతీయ అమెరికన్లలో తెలుగు ప్రజలు 14 శాతం మంది ఉన్నారని, వారు భారత్‌-అమెరికా మధ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేశారన్న దాంట్లో తనకు ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. వారు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల సొగసును అమెరికా గడ్డపై సుసంపన్నం చేశారని, మన వైవిధ్యాన్ని, వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారని లోకేష్‌ వివరించారు. ఈ బంధాన్ని మరింత విస్తరింపజేయడంలో ఏపీ మరింత కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నామని తెలిపారు.

  • రాజకీయాలకతీతంగా పాఠశాల విద్య అకడమిక్‌ క్యాలెండర్‌

    రాజకీయాలకతీతంగా పాఠశాల విద్య అకడమిక్‌ క్యాలెండర్‌

    • నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రూపకల్పన
    • విడుదల చేసిన మంత్రి నారా లోకేష్‌
    • ఆగస్ట్‌లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ఎన్నికలకు ఆదేశం
    • కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి మంత్రి గ్రీన్‌ సిగ్నల్‌

    అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్‌ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ సోమవారం విడుదల చేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. టీచర్లు, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికల్లో సైతం మంత్రి సందేశం, ఫొటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్‌మెంట్‌ కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని ఆదేశించారు.

    పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్‌ కమిటీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయ్‌లెట్స్‌ నిర్వహణ మెరుగుపర్చాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్‌, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. సీబీఎస్‌ఇ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి లోకేష్‌ త్వరలో తదుపరి రూట్‌ మ్యాప్‌ ప్రకటిస్తామని చెప్పారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన మంత్రి లోకేష్‌, విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించారు. సమావేశంలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి కోన శశిధర్‌, డైరక్టర్‌ విజయరామరాజు, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

  • కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

    కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

    అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉండబోదని స్పష్టం చేసిన కేంద్రమంత్రి కుమారస్వామికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మనోభావాలను నిలబెట్టిన కేంద్రమంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు అంటూ ఎక్స్‌లో లోకేష్‌ పోస్ట్‌ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ చేసిన ప్రకటన రాష్ట్రం మొత్తానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కేంద్రమంత్రి ప్రకటన నీలి మీడియాను నిరాశ పరిచి ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల అంకితభావంతో ఉంది. మాది ప్రజా ప్రభుత్వం, ప్రజల అంచనాలను అందుకోవడమే మా ప్రాధాన్యం. జగన్‌, నీలి మీడియాకు ప్రజలు ఇప్పటికే గుణపాఠం చెప్పారు. హెచ్చరికను పట్టించుకోకపోతే 2029లో మరోసారి ఘోర ఓటమి తప్పదు. తప్పుడు వార్తలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని నారా లోకేష్‌ అన్నారు.

  • వైసీపీకి మేలు చేసేందుకే క్రానికల్‌ తప్పుడు కథనం

    వైసీపీకి మేలు చేసేందుకే క్రానికల్‌ తప్పుడు కథనం

    • కార్యకర్తలు సంయమనం పాటించాలని హితవు

    అమరావతి(చైతన్యరథం): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకుందంటూ డక్కన్‌ క్రానికల్‌ దినపత్రికలో వచ్చిన వార్త అభూత కల్పన అని, దురుద్దేశంతో కూడుకున్నదని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఖండిరచారు. అదే సమయంలో విశాఖలోని ఆ పత్రిక కార్యాలయం వద్ద సైన్‌బోర్డును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీకి ప్రయోజనం చేకూర్చేందుకు, విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసి, నగరవాసుల్లో అశాంతి రేకెత్తించే దురుద్దేశంతో డక్కన్‌ క్రానికల్‌ దినపత్రిక ఆ కథనాన్ని వండివార్చిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. మన రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటూ నీలి మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో విశాఖలోని డక్కన్‌ క్రానికల్‌ కార్యాలయం వద్ద ఉన్న ఆ పత్రిక సైన్‌బోర్డును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేయటం సరికాదని లోకేష్‌ హితవు పలికారు. కార్యకర్తలు భావోద్రేకాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని కోరారు. వాస్తవదూరమైన, పక్షపాత ధోరణితో కూడిన ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించే నీలి మీడియా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేష్‌ స్పష్టం చేశారు.

  • ప్రజాదర్బార్‌’తో లోకేష్‌ నూతన ఒరవడి!

    ప్రజాదర్బార్‌’తో లోకేష్‌ నూతన ఒరవడి!

    • నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ.. అంటూ మంత్రి ఆత్మీయ పలకరింపు
    • విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి

    అమరావతి(చైతన్యరథం): విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఉండవల్లిలోని నివాసంలో నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్‌’ ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన ఒరవడితో ముందుకు సాగుతోంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలను నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ, నమస్కారం చెల్లీ అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న యువనేత.. వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో 14వ రోజు మంగళవారం ప్రజాదర్బార్‌ కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

    ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలి
    రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొంతమంది ఆయాలు, పారిశుద్ధ్య కార్మికులను గత ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించిందని, ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన ఏపీజీసీఏఎస్‌ యూనియన్‌ ప్రతినిధులు.. నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని, పాఠశాలల విలీనం వల్ల పని ఒత్తిడి పెరిగిందని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కనీసం వేతనం అమలుచేయడంతో పాటు అకారణంగా విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఆయాలు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను విన్న మంత్రి లోకేష్‌… పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.

    తాగునీటి సమస్యను పరిష్కరించాలి
    పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం మెల్లంపూడికి చెందిన సీహెచ్‌ వెంకటేశ్వర్లు..లోకేష్‌ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన సతీమణి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని మంగళగిరి హుడా కాలనీకి చెందిన షేక్‌ మౌలాలి కోరారు. దశాబ్దాలుగా పెండిరగ్‌లో ఉన్న తాడేపల్లి కిస్ట్నా సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుల జీతం బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేసీ వర్క్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో తాగునీటి సరఫరాతో పాటు వీధి లైట్లు ఏర్పాటుచేయాలని ఆత్మకూరులోని సీతారామ అపార్ట్‌మెంట్‌ వాసులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి, తక్షణమే కొత్త వైస్‌ ఛాన్స్‌లర్‌ను నియమించాలని విశాఖకు చెందిన ఏపీ బీసీ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

    తిరుపతి జిల్లా నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్న తనను గత ప్రభుత్వం అకారణంగా తొలగించిందని, తిరిగి ఉద్యోగం కల్పించాలని ఎన్‌. మహేశ్వరి కోరారు. శ్రీశైలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న తనకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ వర్తింపజేయాలని డీసీ ఉన్నూరు సాహెబ్‌ కోరారు. గుంతకల్లు నియోజకవర్గం కసాపురం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న వాటర్‌ ట్యాంక్‌కు మరమ్మతులు చేయించి 8 గ్రామాల ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలని వై.జీవన్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని విజయవాడకు చెందిన ఏపీజీఎస్‌ డబ్ల్యూఎస్‌ దివ్యాంగ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని, అర్హత పత్రాలు మంజూరు చేయాలని, ఆర్‌ఎంపీ బోర్డు ఏర్పాటుచేయాలని ఆ సంఘాల ప్రతినిధులు.. నారా లోకేష్‌ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్‌ భరోసా ఇచ్చారు.

  • మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు!

    మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు!

    అమరావతి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్లను పెంచగా, ఏపీ వ్యాప్తంగా సోమవారం ఉదయం పంపిణీ ప్రారంభమయింది. దీంతో పెరిగిన పింఛన్లు అందుకున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీపై మంత్రి నారా లోకేష్‌ ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) వేదికగా స్పందించారు. ఈ రోజు అవ్వాతాతల కళ్లల్లో నేను చూసిన ఆనందం, చిరునవ్వు నా జీవితాంతం గుర్తుంటుంది. ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి మధ్య ఉన్న తేడా ఈ రోజు ప్రజలకు అర్థమైంది. మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు.. విడతల వారీ డ్రామాలు లేవు.. అడ్డమైన నిబంధనలు అసలే లేవు.. ఇచ్చిన హామీ ప్రకారం పెద్ద కొడుకుగా పెన్షన్‌ రూ.4 వేలు చేశారు చంద్రన్న. మూడు నెలల బకాయిలతో కలిపి రూ.7 వేల పెన్షన్‌ ఇంటి వద్దనే అందజేశారని లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

  • ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌

    ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌

    ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌ (ఏ.పి.ఓ.ఎస్‌.ఎస్‌) పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఎస్‌ఎస్‌సి పరీక్షలకు 15,058 విద్యార్థులు హాజరుకాగా 9,531 మంది ఉత్తీర్ణత (63.30 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 27,279 విద్యార్ధులు హాజరుకాగా 18,842 మంది(69.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం, ఆంధ్రప్రదేశ్‌, అమరావతి అధికారిక వెబ్‌ సైట్‌: ష్ట్ర్‌్‌జూం://aజూశీజూవఅంషష్ట్రశీశీశ్రీ.aజూ.స్త్రశీఙ.ఱఅ/లో విద్యార్ధులు ఫలితాలు తెలుసుకోవచ్చు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్ధులకు లోకేష్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

  • రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పండుగ

    రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పండుగ

    • మాటిచ్చినట్లుగానే తొలి నెల నుంచే పింఛన్లు పెంచి పంపిణీ
    • 65.31 లక్షల మంది లబ్ధిదారుల కోసం రూ.4408 కోట్లు ఖర్చు
    • ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా….మీ జీవితాలు మారుస్తా
    • సంక్షేమం అంటే కేవలం డబ్బులు ఇవ్వడం కాదు…జీవన ప్రమాణాలు పెంచడం
    • అధికారులు కూడా కొత్త పాలనకు అలవాటు పడాలి
    • చిత్తుచిత్తుగా ఓడినా వైసీపీ ఇంకా తన ఫేక్‌ ప్రచారాలనే నమ్ముకుంది
    • ఉదయం 6 గంటలకు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో స్వయంగా పాల్గొన్న సీఎం
    • బానావత్‌ పాములు నాయక్‌ కుటుంబంలో ముగ్గురికి స్వయంగా పింఛన్లు పంపిణీ చేసి వారితో ముచ్చటించిన ముఖ్యమంత్రి
    • ఆ గిరిజన కుటుంబానికి ఇల్లు మంజూరు చేసిన సీఎం
    • అనంతరం పెనుమాకలో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటించిన చంద్రబాబు

    మంగళగిరి/పెనుమాక (చైతన్యరథం): రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే నెలలో పెన్షన్లకు రూ.4,408 కోట్లు ఖర్చు చేయడం చారిత్రాత్మకమని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం, పెనుమాకలోని ఎస్టీ కాలనీలో సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే లబ్ధిదారులకు పింఛను అందించారు. లబ్ధిదారుడు బాణావత్‌ పాములు నాయక్‌ కుటుంబానికి మొదటగా పెన్షన్‌ అందించారు. నాయక్‌ కూతురు ఇస్లావతి బాయికి వితంతు పెన్షన్‌, పాములు నాయక్‌ కు వృద్ధ్యాప్య పెన్షన్‌, భార్య సీతా బాయికి రాజధాని పరిధిలో భూమిలేని వారికి ఇచ్చే వ్యవసాయ కూలీ పెన్షన్‌ ను అందించారు. అనంతరం నాయక్‌ కుటుంబ సభ్యులతో కాసేపు సీఎం ముచ్చటించారు. నాయక్‌ ఇల్లు లేదని సీఎంతో చెప్పగా తక్షణమే ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపి…ఇంటి నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వెంటనే అధికారులను ఆదేశించారు. ఎస్టీ వాడలోనే తిరిగి స్థానికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మసీదు సెంటరులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు, ప్రజలతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు.

    ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు
    మీ అందరి దయ, ఆశీస్సులతో 4వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశాను. టీడీపీని ఆదరించిన గ్రామంలో పెన్షన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మంగళగిరిలో గత ఎన్నికల్లో లోకేష్‌ ఓటమి చెందారు…అయినా పట్టు వదలకుండా మళ్లీ ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించి మీ అభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచారు. గాజువాక, భీమిలి తర్వాత భారీ మెజారిటీ వచ్చిన నియోజకవర్గం మంగళగిరి. మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాపై ఉంది. నేను 10 ఎన్నికలు చూశాను…ఎప్పుడూ చూడని విజయం మాకు దక్కింది. గత ఐదేళ్లలో ఇలా సంతోషంగా కూర్చూని మాట్లాడుకుంది ఒక్క రోజు కూడా లేదు. పోలీసులు ఎప్పుడు గోడ దూకి వస్తారో తెలీదు. భయంకర వాతావరణంలో ప్రజలు, నాయకులు బతికారు. ప్రజాస్వామ్యంలో న్యాయనిర్ణేతలు ప్రజలే. ఐదేళ్లు అణచివేతకు గురయ్యారు…అలాంటి వేల మంది నన్ను కలవడానికి వస్తున్నారు. నాకు సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. ప్రజలకు మాపై చాలా ఆశలు ఉన్నాయి. కానీ అన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవు. రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో అర్థం కావడం లేదు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. ఐదేళ్ల వికృత చేష్టలతో రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతీశారు. గత సీఎం ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టుకుని వెళ్లారు. మురికి కాల్వ కూడా కనబడకుండా తెరలు కట్టారు…దాచేస్తే సమస్యలు దాగవని సీఎం చంద్రబాబు అన్నారు.

    పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని గత పాలకులకు చెప్పా
    ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పెన్షన్‌ పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంచాలని చెపితే నాటి ప్రభుత్వం కుదరదని చెప్పింది. పంపిణీ చేయించడం చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని చెప్పాను. మండుటెండల్లో పెన్షన్ల కోసం వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పి 33 మంది ప్రాణాలు తీశారు. ఇళ్లవద్దనే పెన్షన్‌ ఇవ్వాలని మేము పోరాడినా వినలేదు. అందుకే ఇప్పుడు 1.20 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పెన్షన్లు అందిస్తున్నాం. గత పాలకులు నోరిప్పితే అబద్ధాలు చెప్పారు. ఐదేళ్ల పాటు అబద్ధాలు చెప్పి బతికారు. నేను, పవన్‌ ఎన్నికల ముందు జట్టు కట్టడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని. తర్వాత బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రయోజనాలు ఆశించాం. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలన్న ఆలోచనతో ముందుకు వెళ్లాం. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ…ఇంతటి ఫలితాలు ఎప్పుడూ రాలేదు. మేము సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండేవాళ్లం కాదు. మీరు మాకు ఇచ్చింది అధికారం కాదు….బాధ్యత అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

    పెన్షన్లకు ఆద్యుడు ఎన్టీఆర్‌
    దేశంలోనే మొదటిసారి పెన్షన్‌ ను ప్రారంభించింది ఎన్టీఆర్‌. రూ.35లతో ప్రారంభించారు…తర్వాత దాన్ని నేను రూ.75లు చేశాను. 2014 వరకు రూ.200 మాత్రమే ఉండేది…అధికారంలోకి రాగానే రూ.1000కి పెంచి, తర్వాత రూ.2000 చేశాను. ఇప్పుడు రూ.3 వేలు ఉన్నదాన్ని రూ.4 వేలకు పెంచాను. రూ.4 వేల పెన్షన్‌ లో రూ.2,875లను ఒక్క తెలుగుదేశం పార్టీనే పెంచింది. పేదలకు ఇచ్చే పెన్షన్‌ లో టీడీపీ హయాంలో పెంచిందే ఎక్కువ అని చెప్పడానికి గర్వపడుతున్నా. పెనుమాకలో 2,595 మంది వివిధ రకాల పెన్షన్‌ తీసుకుంటున్నారు. వీరికి ఒక నెల పెన్షన్‌ కు గతంలో రూ.1.06 కోట్లు ఖర్చు అయ్యేది. ఈ నెల పెన్షన్‌ కు రూ.1.20 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. గుంటూరు జిల్లా మొత్తం 2,61,588 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. వీరికి నెలకు ఇంతకు ముందు వరకూ రూ.81 కోట్లు ఖర్చు అయ్యేది..కానీ ఈ నెలలో రూ.111 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో 28 వర్గాలకు చెందిన 65.31 లక్షల మందికి పెన్షన్లను అందిస్తున్నాం. పెన్షన్లకు ఇది వరకు నెలకు రూ.1,938 కోట్లు ఖర్చు చేస్తే…ఇప్పుడు దానికి అదనంగా రూ.819 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల బకాయిల కలిపి రూ.1650 కోట్లు అదనంగా చెల్లించాం. ఈ ఒక్క నెలలోనే పేదలకు పెన్షన్ల కింద ఇస్తున్నది రూ.4,408 కోట్లు. ఇంతకంటే శుభదినం మరొకటి లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

    పేదలను ఆదుకోవడమే మా ప్రభుత్వ ధ్యేయం
    ‘‘బానావత్‌ పాములు నాయక్‌ ఇంటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్‌ కింద రూ.4 వేలు అందించా. ఆయన భార్య సీతాబాయికి సీఆర్డీయే పరిధిలో భూమిలేని వారికి అందించే జాబితా కింద రూ.5 వేలు పెన్షన్‌ అందించాం. ఆయన కూతురు ఇస్లావతి బాయికి వితంతు పెన్షన్‌ కింద రూ.4 వేలు అందించాం. వీరికి మూడు నెలల బకాయిలతో కలిపి అందించాం. బీదవారైన పాములు నాయక్‌ కుటుంబం పూరింట్లో ఉంటోంది. కౌలుకు భూమి సాగు చేస్తే రూ.8 లక్షల నష్టపోయారు. వారి పరిస్థితి చూడగానే చాలా బాధేసింది. ప్రభుత్వం తరపున ఇల్లు కట్టిస్తానని మాటిచ్చాను. ఇలాంటి వారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. పేదలను ఆదుకోవడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై ఏడాదికి రూ.33,100 కోట్లు పెన్షన్‌ లబ్ధిదారులకు ఖర్చు చేయబోతున్నాం. రాబోయే ఐదేళ్లలో రూ.1,65,500 కోట్లు పెన్షన్ల కింద పేదలకు ఖర్చు పెట్టబోతున్నాం. పేదలను ఆదుకునేందుకు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

    ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా
    పరిపాలనలో మేము కష్టపడైనా సరే సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు చేస్తాం. దీని ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకొస్తాం. ఒక హామీ ఇస్తే అమలు చేయాలంటే సుమారు ఐదారు నెలలు పడుతుంది. కానీ ప్రభుత్వం ఏర్పడిన 26 రోజుల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేసి బకాయిలతో సహా అందించాం. దివ్యాంగులకు గత ప్రభుత్వం పెన్షన్‌ పెంచకుండా రూ.3 వేల వద్దే నిలిపేసింది. అందుకే వారికి ఇప్పుడు రూ.6 వేలకు పెంచాం. పూర్తిగా నడవలేని స్థితిలో ఉండే వారికి రూ.5 వేల నుండి రూ.15 వేలకు పెంచాం. కిడ్నీ, గుండె సమస్య, తలసేమియాతో బాధపడేవారికి రూ.10 వేలు అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు అందించామని గొప్పలు చెప్పుకోవడం కాదు..ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలి. జీవన ప్రమాణాలు పెంచడానికి మొదటి అడుగు వేశాం. సమాజమే దేవాలయం…ప్రజలే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయన స్ఫూర్తితో పేదల జీవితాలు మార్చడంపై శ్రద్ధ పెట్టాం. ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేస్తాం. ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసింది…ఎంత మొత్తంలో అప్పులున్నాయో తెలియడం లేదు. అయినా పేదలను ఆదుకునేందుకు ముందడుగు వేశాం. రూ.4 వేల పెన్షన్‌ వచ్చే వారికి యేడాదికి రూ.48 వేలు వస్తుంది. రూ.6 వేలు వచ్చే వారికి రూ.72 వేలు వస్తుంది. మీకు ఎకరా మాగాణి ఉంటే కౌలు రూ.15 వేలు, మెట్ట భూమికి ఎకరాకు రూ.5 వేలు కౌలు ఉంటుంది. కానీ మూడు ఎకరాల మాగాణికి వచ్చే కౌలుకు సమానంగా మన ప్రభుత్వం పెన్షన్‌ సొమ్మును ఇస్తోంది. 10 ఎకరాల మెట్ట భూమికి వచ్చే కౌలుకు సమానంగా మన ప్రభుత్వం పెన్షన్‌ సొమ్మును అందిస్తోంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి ఇంటి మనుషులు చాకిరీ చేయాల్సి ఉంటుంది. ఆదుకోవడానికి ఇబ్బంది పడతారు…అందుకే వారికి రూ.5 వేల నుండి రూ.15 వేలకు పెంచడం మా ప్రభుత్వ మానవత్వానికి నిదర్శనం. ప్రతి కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటా…సంక్షేమంలో ఇది మొదటి అడుగు మాత్రమేనని సీఎం చంద్రబాబు అన్నారు.

    సమాజానికి చేయూతనివ్వడంలో ముందుంటా
    ఎగువనుంచి కృష్ణాకి నీరు రాకున్నా నీరు ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయంటే కారణం పట్టిసీమ. పోలవరం పూర్తైతే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. రాజధాని అమరావతికి గత పాలకులు ఏ గతి పట్టించారో మీకు తెలుసు. అమరావతి పూర్తైతే ప్రతి ఒక్కరికీ ఉపాధి దొరుకుతుంది. తవ్వుతున్న కొద్దీ నాటి ప్రభుత్వ తప్పులు, అప్పులు బయటపడుతున్నాయి. వృద్ధులు, వికలాంగులు, గీత కార్మికులు, చేనేత, మత్య్సకార, ఒంటరి మహిళలు, హిజ్రాలు, డప్పుకళాకారులకు పెన్షన్‌ పెంచాం. విభిన్న ప్రతిభావంతులకు చేయూత ఇవ్వడం సమాజం బాధ్యత…అందులో ముందు నేనుంటా. సమాజానికి చేయూతనివ్వడానికి ముందడుగు వేస్తా. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయాల్సి ఉంది. ధరలు తగ్గిస్తే పేద కుటుంబాలకు వెసులుబాటు లభిస్తుంది. ఇంటి సమస్యల వల్ల గతంలో ముసలివాళ్లను భారంగా భావించేవాళ్లు…కానీ ఇప్పుడు నాలుగు రోజులు అదనంగా ఉన్నా పర్వాలేదనుకునే పరిస్థితి వస్తుంది. పెన్షన్ల పంపిణీలో భాగమైన సచివాలయ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేతకాదన్న అధికారులతోనే నేడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.

    సంక్షేమాన్నిచ్చే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
    ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఒకే రోజు 5 హామీలపై సంతకాలు చేశాను. డీఎస్సీ ద్వారా 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంతకం పెట్టాను. రెండో సంతకం ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్‌ రద్దుపై పెట్టాను. ఈ యాక్ట్‌ అమల్లోకి వస్తే మీ భూమి మీకు కాకుండా పోయేది. అందుకే రద్దు చేశాం. మూడవ సంతకం పెన్షన్ల అమలుపై చేశాను. నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై పెట్టాను రూ.5లకే కడుపునిండా అన్నం తినే రోజులు మళ్లీ రాబోతున్నాయి. త్వరలో 183 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నాం..మిగతా చోట్ల కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తాం. ఐదో సంతకం స్కిల్‌ సెన్సస్‌ పైన చేశాను ఉద్యోగాలు ఉన్నా నైపుణ్యం లేక యువతకు ఉద్యోగాలు రావడం లేదు. నైపుణ్య కేంద్రాలు పెట్టి ఎవరికి ఏ స్కిల్స్‌ అవసరమో నేర్పిస్తాం. మా ప్రభుత్వానికి మరింత శక్తినిస్తే మరింత సంక్షేమం అందిస్తుంది. మంచి ప్రభుత్వం ఉంటే అందరికీ అండగా ఉండి వెసులుబాటును కల్పిస్తుంది. గత ప్రభుత్వం సరిగా పాలన చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్యలు ఉండేవి కాదు. మాది ప్రజల ప్రభుత్వం…ప్రజా ప్రభుత్వం. నిరంతరం మీ కోసం పని చేస్తాం. నిండు మనసుతో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని సీఎం చంద్రబాబు కోరారు.

    రాజధాని వస్తుందని విశాఖ వాసులు భయపడ్డారు
    రాజధాని తరలిపోతుందని గతంలో ఇక్కడివారు బాధపడ్డారు…రాజధాని వస్తుందేమోనని విశాఖ వాసులు భయపడ్డారు. వైసీపీ నేతల భూ కబ్జాలు, శాంతిభద్రతలతో భయపడి దుష్టులు దూరంగా ఉండాలని ఉత్తరాంధ్ర వాసులు చిత్తుగా ఓడిరచారు. అధికారం ఉందని విర్రవీగితే ఏమవుతుందో గత పాలకుడికి పట్టిన గతిని చూస్తే తెలుస్తుంది. మహిళల వ్యక్తిత్వ హననం దెబ్బతినేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. గుంటూరులో రంగనాయకమ్మకు చెందిన శంకర్‌ విలాస్‌ లాక్కున్నారు…ఆమె చిన్న షాపు పెట్టుకుంటానన్నా అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో మోసం చేసి వైసీపీ నేతలు లాక్కున్న ఆస్తులను తిరిగి బాధితులకు అప్పగిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

    పోలవరంను ముంచేసి..మళ్లీ అడ్డగోలు వాదనలు
    పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రం వాల్‌ ను నాడు జర్మన్‌ కంపెనీ టెక్నాలజీతో కష్టపడి రెండు సీజన్లలలోనే నిర్మించాం. కానీ గత ప్రభుత్వం రెండేళ్లపాటు పట్టించుకోకపోవడంతో వరదల వల్ల డయాఫ్రం వాల్‌, కాఫర్‌ డ్యాంలు దెబ్బతిన్నాయి. రూ.440 కోట్లతో డయాఫ్రం వాల్‌ నిర్మిస్తే గత పాలకుల నిర్వాకం వల్ల దెబ్బతింది. కొత్తది మళ్లీ ఇప్పుడు నిర్మించాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది. దీన్ని పరిశీలించేందుకు ఇప్పుడు విదేశాల నుండి నిపుణులు వచ్చారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రూ.600 కోట్లు మిగిల్చామని గత పాలకులు చెప్పారు..కానీ జరిగిన నష్టం రూ.70 వేల కోట్లు…అది రూ.లక్షల కోట్లకు కూడా పెరుగుతుంది. దుర్మార్గులు పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు..మళ్లీ ఇప్పుడు అడ్డగోలు వాదనలకు దిగుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    నేను చేసిన అభివృద్ధిని తర్వాత పాలకులు కొనసాగించారు
    ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ లో నేను హైటెక్‌ సిటీ నిర్మిస్తే దాన్ని రాజశేఖర్‌ రెడ్డి కొనసాగించారు. రెండు మూడు ప్రాజెక్టులు తప్ప అన్నింటినీ రాజశేఖర్‌ రెడ్డి కొనసాగించారు. ఏపీలో రాజధాని అమరావతికి రైతులు భూములిచ్చారు..దానికి ప్రతిఫలంగా కేవలం కౌలు మాత్రమే ఇచ్చాం. అయినా అక్రమాలు జరిగాయని ముద్ర వేశారు. ఇల్లు కట్టుకోవడానికి నేను కూడా స్థలం వెతుక్కుంటుంటే భూ అక్రమాలు చేశానని కేసులు పెట్టారు. పిచ్చోడికి ఎవరిపై కోపం ఉంటుందో తెలీదు. అందుకే విధ్వంసం సృష్టించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన పరపతి ఢల్లీిలో కూడా ఉపయోగపడుతుంది. కులమతాలకు అతీతంగా సమర్థవంతమైన పాలన కావాలని ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఏ రోజైనా బయటకు వచ్చి ప్రజలతో ఒక్క సారైనా మాట్లాడారా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

    అత్యాచారాలకు పాల్పడితే అదే చివరి రోజు
    దళిత కుటుంబానికి చెందిన, గత ప్రభుత్వంలో బాధిత మహిళగా ఉన్న వంగలపూడి అనితను హోంమంత్రిని చేశాం. ఆడబిడ్డల జోలికి ఎవరొచ్చినా…మదంతో ప్రవర్తిస్తే ఎవరినీ వదిలిపెట్టను. ఎవరు అత్యాచారాలకు పాల్పడ్డా అదే చివరి రోజు అవుతుంది. పాలన ప్రారంభమైంది ఈ మధ్యనే కాబట్టి ఇప్పటిదాకా మర్యాదగా చెప్పా. మద్యం, గంజాయి మత్తులో ఏదిపడితే అది చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని తెలిస్తే….తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టబోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

    నేను అందరి వాడిని
    ఎప్పుడూ జరగని అభివృద్ధిని మంగళగిరి నియోజకవర్గంలో చేసి చూపిస్తాం. రోడ్లు వేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మాతో చెప్పండి..కోర్టులకు వెళితే పనులు ఆలస్యమవుతాయి. మా ప్రభుత్వం నిరంతరం మీ కోసమే ఆలోచిస్తుంది. రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు అమలు చేయడానికి…పేదరికం లేని సమాజానికి పెనుమాక నుండే సంకల్పం తీసుకుంటున్నాం. నేను అందరి వాడిని…ఏ ఒక్కరి వాడిని కాదు. మీ గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించడానికి పనిచేస్తా. కొన ఊపిరి వరకూ ప్రజల కోసమే పోరాడుతానని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.