- ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే మాట తప్పను-మడమ తిప్పను అన్న మాటకి జగన్ కట్టుబడ్డాడు
- హామీల అమలుకు రోడ్డెక్కిన అంగన్ వాడీ సిబ్బందిపై ఎస్మా ప్రయోగించడమేనా మాట తప్పకపోవడం అంటే?
- మాట తప్పకపోవడం అంటే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే తొలిస్థానంలో నిలపడమా?
- మడమ తిప్పకపోవడమంటే మద్యనిషేధమని చెప్పి కల్తీ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచడమా?
- తల్లిని, చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేయడమేనా జగన్ రెడ్డి చెప్పిన విశ్వసనీయత?
- తెదేపా ‘జయహో బీసీ’ కార్యక్రమంలో భాగంగా 962 మండలస్థాయి సమావేశాలు
అమరావతి: తెదేపా సభలు, పార్టీ అధినేత చంద్ర బాబు ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాలకు ప్రజల నుండి వస్తున్న స్పందనతో వైసీపీ నేతల్లో కలవరం మొదలై జగన్‌రెడ్డి నుంచి, మంత్రుల వరకు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యు డు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘రా.. కదలిరా’ సభల ద్వారా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రజల తో మమేకమవుతున్నారని, తెదేపా చేపట్టిన బహిరంగ సభలకు ప్రజలు భారీస్థాయిలో తరలి వచ్చి, ఈ అరా చక ప్రభుత్వ దుర్మార్గ పాలనను ఇకపై సహించేది లేద ని గొంతెత్తుతున్నారన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీ య కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పిల్లల నుంచి వృద్ధుల వరకు ‘రా..కదలిరా’ సభలకు హాజరవుతున్న తీరుచూస్తే తమ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలు ఎంత గా తపన పడుతున్నారో అర్థమవుతోందన్నారు. తెలుగు దేశం పార్టీ బహిరంగసభలకు అశేషంగా తరలివస్తున్న ప్రజల్ని చూసి వైసీపీ నేతలు, మంత్రులు అవాకులు, చెవాకులు వాగుతున్నారని మండిపడ్డారు.
రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపాడు
ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి అన్నివర్గాల వారిని తీవ్రంగా వంచించాడు. రైతులు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నమ్మి నిండా మునిగి పో యారు. నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇవ్వ లేని ఈ ప్రభుత్వం, కనీసంవారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు కూడా ముందుకు రాకపోవడం విచారక రం. తమది రైతుప్రభుత్వమని చెప్పుకుంటూ రైతు ఆత్మ హత్యల్లో రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాడు. చంద్రబాబు చెప్పినట్టుగా తిక్కలోడు తిరునా ళ్లకు వెళ్లి ఎక్కడం..దిగడం చేశాడన్నట్టుగా ఈ ముఖ్య మంత్రి తన పిచ్చితనంతో రాష్ట్ర రైతాంగాన్ని కోలుకో లేని విధంగా దెబ్బతీశాడు.
రైతులకు సాగునీరివ్వాలనే ఆలోచన పూర్తిగా విస్మ రించాడు. రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి జాతీయ ప్రాజెక్ట్ పోలవరాన్ని అటకెక్కించాడు. చంద్రబాబుకి పేరుస్తుందన్న దురుద్దేశంతో పట్టిసీమ నుంచి రైతులకు సాగునీరు ఇవ్వకుండా పొలాలు బీళ్లు పెట్టాడు. వ్యవసా యరంగాన్ని నామ రూపాలు లేకుండా చేశాడని కొల్లు ధ్వజమెత్తారు.
యువతను వంచించి కల్తీమద్యం, మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేశాడు
రాష్ట్రంలోని యువతను జగన్‌రెడ్డి దారుణంగా వం చించాడు. ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి తన అవి నీతి పత్రిక సాక్షి దినపత్రిక క్యాలెండర్లు విడుదల చేసు కున్నాడు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని చెప్పి యువతను మోసగించాడు.పోలీస్ రిక్రూట్‌మెంట్ సహా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంగళం పాడాడు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పారిశ్రా మికవేత్తల్ని తన కమీషన్ల కక్కుర్తితో తరిమేశాడు. ప్రత్యే కహోదా తెస్తానని చెప్పి యువతను నమ్మించి, అధికా రంలోకి వచ్చాక వారిని కల్తీమద్యం, మాదక ద్రవ్యాల కు బానిసల్ని చేశాడు. చంద్రబాబు హయాంలో ఉపా ధ్యాయ పోస్టులు భర్తీచేయడంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో యువతకు దాదాపు 10లక్షల ఉద్యో గాలు ఇచ్చారని కొల్లు గుర్తు చేశారు.
జగన్‌ది మోసకారి సంక్షేమం
సంక్షేమం ముసుగులో దోపిడీచేస్తూ జగన్‌రెడ్డి మోసకారి సంక్షేమాన్ని అమలు చేస్తున్నాడు. ప్రజలపై విపరీతంగా పన్నులభారం మోపాడు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఇంధన ధరలు పెంచాడు. ఒకచేత్తో పేదలకు రూ.10 ఇస్తూ, మరో చేత్తోవారి నుంచి రూ.100 లాక్కుంటున్నాడు. చంద్రబాబు పేదలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో రద్దుచేశాడు. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, అన్న క్యాంటీన్లు, నిరుద్యోగభృతి, చంద్రన్నబీమా, పెళ్లికానుక, బెస్ట్ అవైల బుల్ స్కూళ్లు, స్టడీ సర్కిళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు రద్దుచేశాడు. పేదలు కడుపునిండా తినడం కూడా ఓర్చుకోలేని కసాయి కనుకే జగన్‌రెడ్డి అన్న క్యాంటీన్లు రద్దుచేశాడు. సంక్రాంతి కానుక కింద అందించే పండుగ సరుకులు లేకుండా చేశాడు. చం ద్రన్నబీమా కింద ప్రమాదవశాత్తూ మరణించినవారి కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం అందించింది. సహజంగా మరణించిన వారి కుటుంబా లకు రూ.2 లక్షలు అందించారు. జగన్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ సాయం ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత దాదాపు 6 లక్షల మంది ఉన్నతవిద్యకు దూరమ్యయారు. ఈ విధంగా అనేక పథకాలు రద్దుచేసి, ఇంకా సిగ్గు లేకుండా తాను సంక్షేమంతో ప్రజల్ని ఉద్ధరించానని వారికి మాయమా టలు చెబుతున్నాడు. టీడీపీ ప్రభుత్వం వివిధవర్గాల సంక్షేమం కోసం అమలు చేసిన 100కు పైగా పథకా ల్ని అధికారంలోకి రాగానే రద్దు చేసిన జగన్‌రెడ్డి… నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీ లంటూ ఆయా వర్గాల్ని వంచిస్తున్నాడు. బీసీలకు రాజ్యాంగ పరంగా దక్కాల్సిన రిజర్వేషన్లకు కోతపెట్టాడు. బాదుడే బాదుడు అంటూ ప్రజలపై భారాలు వేస్తూ వారిని, రాష్ట్రాన్ని దారుణంగా దోచేస్తున్నాడు.జగన్‌రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కొల్లు దుయ్యబట్టారు.
ప్రచారపిచ్చిలో జగన్ రెడ్డికి ఎవరూ సాటిరారు
జగన్‌రెడ్డి తన 4ఏళ్ల 9నెలల పాలనలో రాష్ట్రం కోసం,ప్రజల కోసం ఒక్కనిర్మాణం చేసింది లేదు.టీడీపీ ప్రభుత్వంలో కట్టిన భవనాలు. ప్రజల ఇళ్లకు కూడా తన పార్టీ రంగులేసుకున్నాడు. సాగునీటి ప్రాజెక్టుల పేర్లు మార్చాడు తప్ప, ఎక్కడా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసి, ఒక్కఎకరాకు నీరిచ్చిందిలేదు. సర్వేరాళ్లపై, రైతులకు అందించే పట్టాదార్ పాస్ పుస్తకాలపై, ఆఖరికి బాత్రూ మ్ తలుపులు, గోడలపై కూడా తన బొమ్మలు ముద్రిం చుకుంటూ ప్రచారపిచ్చిలో తనకెవరూ సాటిరారని జగన్‌రెడ్డి నిరూపించుకున్నాడు. మాటతప్పను-మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానని, ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ రెడ్డి అన్నింట్లో మాట తప్పాడు. దుర్మార్గపు ఆలోచనలతో ప్రజల్ని మోసపు వాగ్దానాలతో నమ్మించి, అధికారంలోకి వచ్చాడు. మద్యాన్ని నిషేధిస్తా నని చెప్పి, తన ధనదాహాం కోసం కల్తీ మద్యం అమ్ము తూ మహిళల పుస్తెలు తెంపుతున్నాడు. వారంలో సీపీఎస్ రద్దుచేస్తానని చెప్పి, ఉద్యోగుల్ని భయపెట్టి తన దారికి తెచ్చుకున్నాడు. ఆఖరికి జీతాలు కూడా సక్రమం గా ఇవ్వకుండా ప్రభుత్వఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని హింసిస్తున్నాడు. 28రోజులుగా అంగన్ వాడీ సిబ్బంది సమ్మె చేస్తుంటే, వారిపై దారుణంగా ఎస్మా చట్టం ప్రయోగించాడు. పారిశుధ్య కార్మికులు, సర్వశిక్షా అభి యాన్ సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది రోడ్లెక్కితే, ఒక్క రోజు కూడా జగన్‌రెడ్డివారి గోడు విన్నపాపాన పోలేదు. ఇసుక దోపిడీతో నిర్మాణరంగాన్ని కుప్పకూల్చి లక్షలాది కార్మికులకు పనిలేకుండా చేశాడు. కాంట్రాక్టర్లకు బకా యిలు చెల్లించకుండా వారు ఆత్మహత్యలకు పాల్పడేట్టు చేశాడు. మూడు రాజధానుల పేరుచెప్పిచివరకు అమ రావతిని విధ్వంసం చేశాడు. ఇదేనా జగన్‌రెడ్డి చెప్పిన విశ్వసనీయత? సొంతచెల్లిని, తల్లిని రాష్ట్రం నుంచి తరి మేయడేమనా ప్రజలముందు గొప్పగా చెప్పుకునే జగన్ రెడ్డి విశ్వసనీయత అని కొల్లు ప్రశ్నించారు.
చంద్రబాబు సూపర్‌సిక్స్ పథకాలు ప్రజల హృదయాల్లో నాటుకుపోయాయి
చంద్రబాబు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ప్రజల హృదయాల్లో నాటుకు పోయాయి. 18ఏళ్లు నిం డి ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఆర్థికసాయం, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎందరు పిల్లలు ఉన్నా చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15 వేలు, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు, ప్రతి రైతుకి ఏటా రూ.20వేల ఆర్థికసాయం, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, రాబోయే ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యో గాల కల్పనవంటి చంద్రబాబు ప్రకటించిన గొప్ప పథ కాలతో ప్రజాభిమానం టీడీపీవైపు కొట్టొచ్చినట్టు కనిపి స్తోందని కొల్లు వివరించారు.
‘జయహో బీసీ’ కార్యక్రమంలో 962 సమావేశాలు నిర్వహించబోతున్నాం
బీసీల అభ్యున్నతి కోసం టీడీపీ ‘జయహో బీసీ’ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గతం లో టీడీపీ బీసీలకు అందించిన పథకాలు, ఈ ప్రభు త్వంలో వారికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నాం. ‘జయహో బీసీ’ కార్యక్రమంలో భాగంగా 962 మండ లస్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నాం. ప్రతి మండల కేంద్రంలో టీడీపీ బీసీ నేతలు బలహీన వర్గాలతో సమావేశమై, వారి అభిప్రాయాలు, ఆలోచన లు తెలుసుకొని, భవిష్యత్‌లో టీడీపీ ప్రకటించే మేని ఫెస్టో అన్నివర్గాల సంతోషం, మేలు కలబోతలా ఉండే లా తమవంతు పాత్ర పోషించనున్నారు. టీడీపీ-జన సేన ప్రభుత్వం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో స్వచ్ఛ మైన, ప్రజారంజక పాలనకు బీజం వేయనుందని రవీంద్ర స్పష్టం చేశారు.