- జగన్‌కు ఓటేస్తే.. ‘ఒంటిమిట్ట’ ఆత్మహత్యలే
- అధికారంలోకి రాగానే చట్టం రద్దుచేస్తాం
- పోస్టల్ బ్యాలెట్ల ఓటింగులో ఉద్యోగులే స్ఫూర్తి
- అన్ని వర్గాలకూ న్యాయమే కూటమి సంకల్పం
- బూత్‌కు వెళ్లేముందు పిల్లల భవిష్యత్ ఆలోచించండి
- ఆ తరువాతే.. విజ్ఞతతో ఓటు వేయండి
- మాచర్ల, ఒంగోలు ప్రజాగళంలో చంద్రబాబు
ఒంగోలు (చైతన్య రథం): రాష్ట్రంలో విధ్వంసపాలన కావాలో.. అభివృద్ధి పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయమొచ్చింది. సంక్షేమపాలన కావాలో.. సంక్షోభపాలన కావాలో తేల్చుకోవాలి. బిడ్డలకు ఉద్యోగాలు కావాలో.. గంజాయి, డ్రగ్స్ కావాలో నిర్ధారించుకోవాలి. ఆస్తులకు రక్షణ కావాలో.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌కు బలవ్వాలో? ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్‌రెడ్డి కబ్జాలు, అరాచకాలు, అవినీతికి ఈనెల 13తో ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అదే సమయంలో స్వేచ్ఛకు నాంది పలకాలన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా శుక్రవారం మాచర్ల, ఒంగోలు ప్రజాగళం సభల్లో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి విజయానికి శుభసంకేతమన్నట్టు శుక్రవారం జోరున వర్షం కురుస్తున్నా.. ప్రజాగళం సభలకు జనం పోటెత్తారు. హోరున వర్షం కురుస్తున్న వర్షంలో నిలువునా తడుస్తూనే.. బాబు ప్రసంగాన్ని ప్రజలు ఆసాంతం విన్నారు. చంద్రబాబు సైతం వర్షంలో తడుస్తూనే.. ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. వర్షం కారణంగా మాచర్ల సభకు హెలికాప్టర్‌లో వెళ్లలేకపోయిన చంద్రబాబు, తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఒంగోలు నుంచే వర్చ్యువల్ ప్రసంగం కొనసాగించారు. ప్రధానంగా జగన్‌రెడ్డి సర్కారు తీసుకొచ్చిన ప్రమాదకర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మాట్లాడిన చంద్రబాబు.. ప్రజల ఆస్తుల దోపిడీకే చట్టం తెచ్చారని దుయ్యబట్టారు. తాత, తండ్రుల నుంచి వచ్చిన భూముల పత్రాలపై జగన్ ఫొటోలు ముద్రించడాన్ని తప్పుబడుతూ.. ‘మన వారసత్వం, మన కష్టార్జితంపై సైకో ఫొటోలేంటి?’ అని నిప్పులు చెరిగారు. 14ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలోవున్నా ఇలాంటి బరితెగింపు చర్యలకు పాల్పడలేదని అంటూ, కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వ రాజ ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ప్రకటించారు.
భూదోపిడీకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్…
జగన్ రెడ్డికి ప్రజల ఆస్తిపై కన్ను పడిరది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కుట్రపూరితమైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారు. భూముల రిజిస్ట్రేషన్స్‌కు సంబంధించిన పత్రాలు తనవద్ద పెట్టుకుని, యజమానులకు జిరాక్స్ పేపర్లే ఇస్తాడంట. భూరికార్డులన్నీ తనదగ్గర పెట్టుకుని.. భూమి అమ్మాలన్నా, తాకట్టు పెట్టాలన్నా అతని అనుమతి తీసుకోవాలట. సొంత బినామీ కంపెనీలో రికార్డులు దాచిపెట్టి తతంగాన్ని నడిపేందుకు టీఆర్‌వో అని జగన్ గుమస్తా ఉంటాడట. మీ భూమినైనా.. టీఆర్‌వో కాదని చెప్తే అదింక మన భూమి కానట్టే. ఎమ్మార్వో, ఆర్డీవో ఎవరి దగ్గరకూ వెళ్లడానికి వీల్లేదట. అలాంటి చట్టంతో ప్రజల భూములకు రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు. కడప జిల్లా ఒంటిమిట్టలో తన భూమి అమ్ముకుందామనుకునే సమయానికి.. ఆ భూమి వేరెవరి పేరుతోనో రిజిస్టర్ అయిపోయింది. సంబంధిత అధికారులనుంచి సమాధానం లేకపోవడంతో.. దిక్కులేని స్థితిలో రైల్వేట్రాక్‌పై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, కూతురు విషం తాగి చనిపోయారు. జగన్‌రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రావొచ్చు. అలాంటి అరాచక చట్టం రద్దుకు అధికారంలోకి రాగానే మలి సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేపరు మాత్రమే చించుతున్నా. 13న మనమంతా జగన్‌రెడ్డి చీటీ చించెయ్యాలని చంద్రబాబు పిలుపుచ్చారు. ప్రజల భూములపై కన్నేసిన జగన్‌రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొట్టే వరకూ నిద్ర పోవద్దని పిలుపునిచ్చారు.
జగన్‌కు అవకాశమిస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుందని గత ఎన్నికల సమయంలో ప్రజలకు నమస్కారం పెట్టి మరీ చెప్పాను. ఒక్కసారి అవకాశమిచ్చినందుకు ఎంతటి విధ్వంసం సంభవించిందో అతా చూశారు. అందుకే మళ్లీ చెప్తున్నా.. జగన్‌లాంటి సైకోను నమ్మితే ఇంతకుమించిన విధ్వంసం చోటుచేసుకుంటుంది. అదే జరిగితే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాగళం 87వ సభలో మాట్లాడుతున్నా..
ఒంగోలులో 87వ ప్రజాగళం సభలో మాట్లాడుతున్నానని అంటూ, మరో రెండురోజుల్లో జరగనున్న పోలింగ్ వరకూ కూటమి శ్రేణుల్లో ఇదే ఉత్సాహం కొనసాగాలని పిలుపునిస్తూ.. ఆ ఉత్సాహమే కూటమి విజయానికి నాంది అని ప్రకంఐచారు. ఎవరైనా పరిపాలన మంచి పని నుంచి మొదలెడతారు. జగన్ మాత్రం, ప్రజావేదికను కూల్చి విధ్వంసంతో పాలన మొదలుపెట్టాడన్నారు. తన యావత్ రాజకీయ చరిత్రలో ఇలాంటి సైకోను చూడలేదని అన్నారు. జగన్ పాలనలో ఆదాయం లేదు. ప్రజల జీవితాల్లో మార్పు లేదు. దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, వేధింపులు, అరెస్టులు, కూల్చివేతలు, సెటిల్మెంట్లు… ఇలాంటి పాలన, అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అన్నారు. ప్రజల్లో కనిపిస్తున్న తీవ్ర వ్యతిరేకత వైసీపీ దుర్మార్గ పాలనకు అద్దం పడుతుందని, మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత.. ఇలా ఏ వర్గానికీ జగన్ ఏలుబడిలో న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి పరిణామాల్లో ఉద్యోగుల్లో తిరుగుబాటు కనిపించింది. 13న ప్రజల తిరుగుబాటు జగన్‌రెడ్డి అరాచక సర్కారును కూకటివేళ్లతో పెకిలించాలని బాబు సూచించారు.
బటన్ నొక్కడానికి జగనెందుకు?
నిన్నటి వరకూ బటన్ నొక్కుతున్నానంటూ చెప్పుకున్న జగన్.. ఇప్పుడు ఏకంగా పీకలు నొక్కడానికి సిద్ధమయ్యాడని, ప్రజలు అప్రమత్తం కావాలని హితవు పలికారు. ఎప్పుడో బటన్ నొక్కి నగదు చెల్లించకుండా ఆపేసిన జగన్, పోలింగ్‌కు ముందురోజు నగదు బదిలీకి సిద్ధమవ్వడం పెద్ద డ్రామా అన్నారు. అలాంటి దుర్మార్గుడికి పన్నికల సంఘం చెక్ పెట్టిందన్నారు. ఐదేళ్లలో 13లక్షల కోట్ల భారాన్ని ప్రజల నెత్తినమోపి.. వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి వర్గానికి అండగా ఉంటానని, మరోవైపు మోడీ గ్యారెంటీ, మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని బాబు హామీ ఇచ్చారు.
ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, సున్నావడ్డీ రుణాలు, యువతకు 20లక్షల ఉద్యొగాలు, రైతుకు ఏటా 20వేల ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, నెలకు రూ.4వేల పింఛను, బీసీ ఎస్సీ పస్టీ మైనారిటీలకు 50ఏళ్లకే పింఛనులాంటి పథకాలతో సిసలైన సంక్షేమాన్ని కూటమి అమలు చేయనుందని చంద్రబాబు ప్రకటించారు. సమాజంలో అన్ని వర్గాలను ఆదుకునేలా పథకాలు రూపొందించామని చంద్రబాబు వెల్లడిరచారు.
గ్యాంబ్లర్ ఎమ్మెల్యే.. స్మగ్లర్ ఎంపీ?
ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి ఒక గ్యాంబ్లర్, ఎంపీ ఒక స్మగ్లర్. వీళ్లను తరిమికొడితేనే ఒంగోలు అభివృద్ధి సాధిస్తుందని చంద్రబాబు అన్నారు. వీళ్లను తీహార్ జైలుకు పంపుతారా? చట్టసభలకు పంపుతారా? అని బాబు ప్రశ్నించారు. మన తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్థన్ అజాత శత్రువు. రూ.2516 కోట్ల ఖర్చుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి. దామచర్లను గెలిపించుకుని.. భూ కబ్జాలు, నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో ప్రజలను దోచుకునే రాజకీయ రౌడీలను ఇక్కడినుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు ఎక్కడైనా రూపాయి తప్పు చేయడం చూశారా? దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తున్నా మచ్చ లేని నాయకుడు. మాగుంటను గెలిపించి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని బాబు పిలుపునిచ్చారు.
ఒంగోలు నుంచి రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఓటింగ్ రోజున తెల్లవారుతూనే.. నా భవిష్యత్తుకు, నా పిల్లల భవిష్యత్తుకు భరోసాగా నిలిచే నిర్ణయం తీసుకుంటున్నానని పోలింగ్ బూత్‌కు వెళ్లి కూటమికి ఓటేయండి. జూన్ 4నుండి మీ జీవితాల్లో జరిగే మార్పులు మీరే స్వయంగా చూసుకోండి. సైకిల్ గుర్తుపై ఓటేసి.. సైకోకి స్వస్తి పలుకుదాం. సమయం లేదు. మన జీవితాలు బాగుపడాలంటే.. కూటమి గుర్తులపై ఓట్లు గుద్దండి. సైకోని రాష్ట్రం నుండి తరిమికొట్టండి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పౌరుషాల గడ్డపై త్యాగాలను మరువలేను…. చంద్రయ్య, జల్లయ్యకు బాబు నివాళి….
పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనం. ఐదేళ్ల జగన్‌రెడ్డి అరాచకంపై ఆవేదన, కసి ఉంది. జగన్‌రెడ్డిని ఓడిరచాలనే ఆవేశం మీలోఉంది. ఆ ఆవేశం తిరుగుబాటుగా కనిపిస్తోంది. పల్నాడు ప్రాంతంలో పసుపు జెండా నిలబెట్టడం కోసం మన కార్యకర్తలు చేసిన త్యాగాలు మరచిపోలేను. వారు విడిచిన ప్రాణాలను కూడా మరచిపోను. ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య, జల్లయ్యలాంటి కార్యకర్తలకు ఈ వేదికనుంచి నివాళులర్పిస్తున్నా. చంద్రయ్య పీకపై కత్తిపెట్టి జై జగన్ అంటే వదిలేస్తామన్నా.. అతను మాట వినకుండా ప్రాణాలొదిలాడు. అలాంటి వ్యక్తిని ఎప్పుడూ మరచిపోను. ఒక కార్యకర్త పార్టీని ఎంతగా ప్రేమిస్తాడో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పల్నాడు ప్రాంతంలో 30మంది టీడీపీ కార్యకర్తల్ని వైసీపీ రౌడీలు పొట్టన పెట్టుకున్నారు. అయినా ఏ కార్యకర్తా వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ జెండా పట్టుకుని గర్వంగా తిరుగుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో వైసీపీ రౌడీ మూకల్ని తరిమికొట్టి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బ్రహ్మారెడ్డి గెలుస్తున్నారు. పల్నాడులో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాను. అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే మరో నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు. రైతులకు మేలు చేయాలి. నీళ్లిచ్చి ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేయాలని తపిస్తున్నారు. వారికి తోడ్పాటు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. పల్నాడు ప్రాంతంలో ముస్లిం సోదరులున్నారు. బీజేపీతో కలిసినందున ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. మైనారిటీల అభ్యున్నతికి తెలుగుదేశం ఎంత కృషి చేసిందో ముస్లింలకు తెలీంది కాదు. 4శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించిందే తెలుగుదేశం. తర్వాత వాటిని కాపాడుతూ వచ్చాం. ఇప్పుడు వాటిన రద్దు చేయాలని జగన్ రెడ్డి ఆర్.కృష్ణయ్య ద్వారా కోర్టుకు వెళ్లారు. అలాంటి వ్యక్తి రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పడం హాస్యాస్పదం. దేశంలోని మత పెద్దలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వడం సంతోషకరం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మత సామరస్యం పాటించిందని, ముస్లింల హక్కులు కాపాడేది కూడా తెలుగుదేశమేనని వారంతా చెబుతున్నారు.